Padma Shri:పద్మశ్రీ పురస్కారాలు 2026.. తెలుగు వెలుగులతో పాటు సామాన్యులకు పెద్దపీట
Padma Shri: జనవరి 25న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పద్మశ్రీ పురస్కారాల జాబితాను అధికారికంగా రిలీజ్ చేసింది.
Padma Shri
భారత గణతంత్ర దినోత్సవం 2026 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ(Padma Shri) పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మొత్తం 45 మందిని ఈ ఏడాది పద్మశ్రీ(Padma Shri) అవార్డులకు ఎంపిక చేసింది. జనవరి 25న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ జాబితాను అధికారికంగా రిలీజ్ చేసింది.
ఈ ఏడాది అవార్డుల్లో సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక రంగం, కళలు, పశుసంవర్ధక రంగాల్లో కృషి చేసిన వారికి ప్రాధాన్యత లభించింది. ముఖ్యంగా ఎటువంటి ప్రచారం లేకుండా సమాజం కోసం పనిచేసే అన్సంగ్ హీరోస్ (గుర్తింపు లేని వీరులు) ఈ జాబితాలో అధికంగా ఉండటం విశేషం. ఈ పురస్కారాలను ఈ ఏడాది మార్చిలో కానీ ఏప్రిల్ నెలలో కానీ రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక వేడుకలో రాష్ట్రపతి ప్రదానం చేస్తారు.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్‌లోని సీసీఎంబీ (CCMB) శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్.. పద్మశ్రీకి ఎంపికయ్యారు. జన్యుసంబంధిత పరిశోధనల్లో, ముఖ్యంగా భారతీయ జనాభా జన్యు వైవిధ్యం , వంశపారంపర్య వ్యాధుల గుర్తింపులో తంగరాజ్ మూడు దశాబ్దాలుగా చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించింది.
అదే విధంగా తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి పాడి, పశుసంవర్ధక విభాగాల్లో ఆయన చేసిన సేవలకు గానూ పద్మశ్రీ దక్కింది. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పోషణ ,అభివృద్ధిపై ఆయన చేసిన నిరంతర పోరాటం ఎందరో రైతులకు ఆదర్శంగా నిలిచింది.

2026 పద్మశ్రీ(Padma Shri) అవార్డు గ్రహీతల పూర్తి జాబితా ఇదే..
అంకె గౌడ, ఆర్మిడా ఫెర్నాండెజ్, భగవందాస్ రైక్వార్, భిక్ల్యా లడాక్య ధిండా, బ్రిజ్ లాల్ భట్, బుధ్రీ టాటి, చరణ్ హెంబ్రామ్, చిరంజీ లాల్ యాదవ్, ధార్మిక్లాల్ చునీలాల్ పాండ్య, గఫ్రుద్దీన్ మేవాతీ జోగి, హల్లి వార్, ఇందర్జీత్ సింగ్ సిద్ధు, కే పాజనివేల్, కైలాష్ చంద్ర పంత్, ఖేమ్ రాజ్ సుంద్రియాల్, కొల్లక్కాయిల్ దేవకి అమ్మ జీ, కుమారస్వామి తంగరాజ్, మహేంద్ర కుమార్ మిశ్రా, మీర్ హాజిబాయి కసంబాయి, మోహన్ నాగర్, నరేష్ చంద్ర దేవ్ వర్మ, నీలేశ్ వినోద్‌చంద్ర మండ్లేవాలా, నూరుద్దీన్ అహ్మద్, ఒతువార్ తిరుత్తణి స్వామినాథన్, పద్మా గుర్మెట్, పొఖిలా లేఖ్తేపి, పున్నియమూర్తి నటేశన్, ఆర్ కృష్ణన్, రఘుపత్ సింగ్, రఘువీర్ తుకారాం ఖేడ్కర్, రాజస్థపతి కలియప్ప గౌండర్, రామారెడ్డి మామిడి, రామ్‌చంద్ర గోడ్బోలే – సునీత గోడ్బోలే, ఎస్ జీ సుశీలమ్మ, సంగ్యూసాంగ్ ఎస్ పొంగెనర్, షఫీ షౌక్, శ్రీరంగ్ దేవబా లాడ్, శ్యామ్ సుందర్, సిమాంచల్ పత్రో, సురేష్ హనగవాడి, తాగా రామ్ భీల్, టేచి గుబిన్, తిరువారూర్ భక్తవత్సలం, విశ్వ బంధు, యుమ్నామ్ జాత్రా సింగ్.
ఈ జాబితాలో ఉన్న అన్సంగ్ హీరోల ప్రతిభ అసాధారణమైనది. మధ్యప్రదేశ్‌కు చెందిన భగవందాస్ రైక్వార్ వ్యవసాయ రంగంలో చేసిన మార్పులు.. జమ్మూకశ్మీర్‌కు చెందిన బ్రిజ్ లాల్ భట్ సంస్కృత భాషా సేవ.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బుద్రీ థాటి ఆదివాసీ మహిళల కోసం చేసిన పోరాటం వంటివి ఈ పురస్కారాల స్థాయిని పెంచాయి.
కర్ణాటకకు చెందిన అంకె గౌడ సాహిత్యం ,విద్యా రంగంలో చేసిన కృషికి గానూ ఎంపికయ్యారు. వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు . దివ్యాంగుల సేవకే జీవితాన్ని అంకితం చేసిన ఎందరో మహానుభావులను ఈసారి పద్మశ్రీ వరించింది.
Medaram :మేడారం 2.0.. చిన్నపిల్లలకు ఏఐ సాంకేతికతతో భరోసా..ఎలా పనిచేస్తుంది ఇది?




One Comment