UPI: యూపీఐ పేమెంట్స్‌పై ఇక ఛార్జెస్.. ఆర్బీఐ షాకింగ్ నిర్ణయం
UPI : ప్రతి నెలా కోట్లాది లావాదేవీలతో యూపీఐ కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

UPI : ఇప్పుడు క్యాష్ ఎవరి జేబులోనూ, పర్సుల్లోనూ కనిపించడం లేదు చిన్న వీధి వ్యాపారి దగ్గర్నుంచి మల్టీప్లెక్స్ వరకు, ప్రతిచోటా యూపీఐ పేమెంట్సే (UPI Payments) కనిపిస్తున్నాయి. అంతెందుకు డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచానికే మన దేశం ఇప్పుడు ట్రెండ్‌సెట్టర్‌గా మారిపోయింది. కానీ, ఇప్పటివరకు యూపీఐ పేమెంట్స్‌పై ఒక్క రూపాయి కూడా ఛార్జ్ పడలేదు . కానీ, వీటికి త్వరలోనే ఎండ్ కార్డ్ పడొచ్చని ఆర్బీఐ గవర్నర్ ఇచ్చిన షాకింగ్ హింట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ డిబేట్‌ను స్టార్ట్ చేసింది.
UPI
డిజిటల్ పేమెంట్స్‌లో ఇండియా సాధించిన ప్రగతి అద్భుతం. జనాల దగ్గర ఇప్పుడు క్యాష్ అన్న పదమే వినిపించడం లేదు. అందుకే చాలా ఏటీఎంలు కూడా మూతపడుతున్నాయి. ప్రతి నెలా కోట్లాది లావాదేవీలతో యూపీఐ కొత్త రికార్డులను సృష్టిస్తోంది.
గతంలో యూపీఐపై ఛార్జీలు పడతాయని వార్తలు వచ్చినా, కేంద్రం వాటిని ఖండించింది. అయితే, తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. “ఉచిత యూపీఐ సేవలకు త్వరలో శుభం పలకాల్సి రావొచ్చు” అని ఆయన చెప్పడం అందరినీ ఆలోచనలో పడేసింది. యూపీఐ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే, ఆదాయ మార్గం తప్పనిసరి అని ఆయన తేల్చి చెప్పారు.
ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల వెనుక బ్యాంకులు, ఫోన్‌పే, గూగుల్‌పే వంటి థర్డ్ పార్టీ ప్రొవైడర్‌లకు కేంద్రం భారీగా సబ్సిడీలు ఇస్తోంది. అంటే, ఈ డిజిటల్ ఎకోసిస్టమ్‌ను నడపడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. సంజయ్ మల్హోత్రా వివరించిన దాని ప్రకారం, “పేమెంట్స్, నగదు ప్రవాహం ఒక ఎకానమీకి బ్లడ్ లైన్ లాంటివి.” యూపీఐ సేవలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలంటే, ఈ సిస్టమ్‌ను మెయింటెయిన్ చేసే సంస్థలకు స్థిరమైన ఆదాయం ఉండాలి.
లాభాపేక్ష లేకుండా ఏ సంస్థా పనిచేయదు కాబట్టి, దీర్ఘకాలంలో కస్టమర్లు కూడా కొన్ని ఛార్జీలను భరించాల్సి ఉంటుందని ఆయన సూచించారు. అయితే, ఇప్పుడిప్పుడే ఈ రూల్ మారదని, ప్రస్తుతానికి యూపీఐ సేవలను ఫ్రీగానే కొనసాగించాలని కేంద్రం భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు భవిష్యత్ నిర్ణయాలకు ఒక సంకేతంలా వినిపిస్తున్నాయి.
ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) తెలిపిన డేటా ప్రకారం, ఈ రెండేళ్లలో యూపీఐ లావాదేవీలు రెండు రెట్లు పెరిగాయి. గతంలో రోజుకు సుమారు 30 కోట్ల లావాదేవీలు జరిగేవి, ఇప్పుడు ఆ సంఖ్య 60 కోట్లను దాటింది. ఇన్ని వందల కోట్ల లావాదేవీలు జరిగినా, వాటి నుంచి బ్యాంకులు లేదా యాప్ ప్రొవైడర్లకు పెద్దగా ఆదాయం ఉండదు. అందుకే, తమ ఆపరేషనల్ కాస్ట్స్, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ల కోసం ఛార్జీలు ప్రవేశపెట్టాలని గతంలోనే బ్యాంకులు, థర్డ్ పార్టీ సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి.
అప్పుడు కేంద్రం ఒప్పుకోలేదు. కానీ, ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ స్వయంగా ఈ అంశాన్ని ప్రస్తావించడంతో, భవిష్యత్తులో యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. డిజిటల్ ఇండియా డ్రీమ్ నెరవేరాలంటే, ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను ఆర్థికంగా నిలకడగా మార్చాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.
UPI Payments, Digital Transactions, RBI Governor, Free Services, Charges, Subsidy, Financial System, Transaction Growth, Online Payments, India