Deepika: 90+ ఉమెన్ లిస్ట్‌లో దీపికా పదుకొణె
Deepika : దీపికా పదుకొణె.. కేవలం ఒక నటి మాత్రమే కాదు, ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ కూడా అని అందరికీ తెలిసిందే.

Deepika : దీపికా పదుకొణె.. కేవలం ఒక నటి మాత్రమే కాదు, ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ కూడా అని అందరికీ తెలిసిందే. తాజాగా ‘ది షిఫ్ట్’ అనే అంతర్జాతీయ సంస్థ ప్రకటించిన ’90+ ఉమెన్ షేపింగ్ కల్చర్’ లిస్ట్‌లో చోటు సంపాదించుకుని, ప్రపంచ వేదికపై మెరిసిపోతోంది.
Deepika
ఈ జాబితాలో దీపికాతో పాటు.. సెలెనా గోమెజ్, ఏంజెలీనా జోలీ, బిల్లీ ఐలిష్, అమల్ క్లూనీ, జోయా అక్తర్ వంటి గ్లోబల్ ప్రముఖులు ఉన్నారు. యాక్టివిజం, క్రియేటివిటీ, లీడర్షిప్, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్తో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న మహిళలను ఈ లిస్ట్ సెలబ్రేట్ చేస్తుంది. ప్రముఖ ఫెమినిస్ట్ గ్లోరియా స్టెయిన్మ్ 91 సంవత్సరాల నిస్వార్థ సేవకు, ఆమె యాక్టివిజానికి గౌరవంగా ఈ ప్రత్యేక ఎడిషన్ రిలీజ్ చేశారు. అలాంటి ప్రతిష్టాత్మక జాబితాలో దీపికా చోటు సంపాదించుకోవడంతో ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
‘ది షిఫ్ట్’ లిస్ట్‌లో స్థానం దక్కించుకున్న సందర్భంగా దీపికా పదుకొణె ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. “ఒకే ఒక్క గ్లోరియా స్టెయిన్మ్.. ఆమె 91 సంవత్సరాల యాక్టివిజానికి నివాళిగా, ‘ది షిఫ్ట్’ మన భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న 90 మందికి పైగా వాయిస్‌లను గౌరవిస్తోంది. ఈ గౌరవం పట్ల కృతజ్ఞతలు… #TheShiftIsOn” అని రాసింది.
దీపికా పదుకొణె విజయంపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. “నా దృష్టిలో, విజయం అంటే కేవలం కెరీర్లో సాధించిన విజయాలు మాత్రమే కాదు. మన శారీరక, మానసిక ఆరోగ్యం, సెల్ఫ్ కేర్ కూడా అంతే ముఖ్యం. క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల ఎంత ముఖ్యమో, ఇవి కూడా అంతే ప్రధానం. ఓర్పు, సమతుల్యత, నిలకడ, నిజాయితీకి విలువనిచ్చే తరానికి తాను స్ఫూర్తిగా నిలబడాలని ఆశిస్తున్నానంటూ తనను తాను మరోసారి పరిచయం చేసుకుంది.
దీపికా కేవలం ఒక స్టార్‌గా కాకుండా, లవ్ లాఫ్ లివ్ ఫౌండేషన్’ద్వారా ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా తన ప్రభావాన్ని ఇప్పటికే చాటుకుంది. తాజాగా 2026లో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో స్టార్ పొందిన మొట్టమొదటి భారతీయ నటిగా చరిత్ర సృష్టించనుంది.
మరోవైపు ఆమె తన బిగ్ స్క్రీన్ ప్రాజెక్ట్‌లకు సిద్ధమవుతోంది. దర్శకుడు అట్లీ డైరెక్షన్లో, సన్ పిక్చర్స్ బ్యాకప్‌తో హై-ఆక్టేన్ పాన్-ఇండియా యాక్షన్ సినిమాలో నటించనుంది. ఈ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లీడ్ రోల్లో ఉండగా, వీరిద్దరి కాంబినేషన్ ఇదే మొదటిసారి. అట్లీతో ‘జవాన్’ తర్వాత ఇది ఆమెకు రెండో ప్రాజెక్ట్. ఈ పవర్‌హౌస్ కాంబినేషన్ వల్ల సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.
అంతేకాదు, ‘కల్కి 2898 AD’ సీక్వెల్ కోసం కూడా దీపికా రెడీ అవుతోంది. దీని షూటింగ్ డిసెంబర్ 2025లో ప్రారంభం కానుంది. నిర్మాతలు ప్రియాంక, స్వప్న దత్ చెప్పిన ప్రకారం, ‘కల్కి 2’లో దాదాపు 30-35% షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. దీపికా సీక్వెల్లో కూడా తల్లి పాత్రలో కనిపించనుంది.