Maharashtra : ఇదేం శిక్ష అధ్యక్షా..మహారాష్ట్రలో అంతేనా?
Maharashtra : మహారాష్ట్ర మంత్రి మాణిక్ రావు అసెంబ్లీ సమావేశంలో రమ్మీ ఆడుతూ వీడియోలో చిక్కుకుపోవడంతో రాజకీయ దుమారం రేగింది. విపక్షాలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసినప్పటికీ, ప్రభుత్వం కేవలం ఆయన శాఖ మార్పు చేశారు. ఇది సరైన చర్య కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Maharashtra
మహారాష్ట్ర (Maharashtra )లో ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. మరోవైపు రమ్మీ వీడియో (Rummy Video)చూస్తూ అడ్డంగా దొరికిపోయిన మంత్రివర్యులు మాణిక్ రావు (Manikrao Kokate) విషయం ఎంత వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న మాణిక్ రావు అసెంబ్లీ సమావేశాల్లో ఫోన్లో రమ్మీ ఆడుతున్నట్లు సరైన ఆధారాలతో వీడియో బయటపడటంతో సామాన్యులు షాక్ అయ్యారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో, విపక్షాలు ఆయన మంత్రిపదవికి వెంటనే రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేశాయి.
అయితే, (Maharashtra) ప్రభుత్వం మాణిక్ రావ్(Manikrao Kokate)పై మంత్రి పదవి నుంచి తొలగించడానికి చర్యలు తీసుకోలేదు. సరికదా ఆయనకు వ్యవసాయ శాఖ బాధ్యతలను తీసేసి, కేవలం క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించి చేతులు దులిపేసుకుంది. ఇదే అసలు శిక్ష అన్నట్లు చెప్పుకొస్తుంది. అయితే ఇది అసలు సరైన చర్య కాదని చాలామంది మండిపడుతున్నారు.

ఎందుకంటే ప్రభుత్వ నేతలకు, సామాన్యులకు ఒకే శిక్ష అనే భావన ప్రజలలో కలగాలి. మంత్రులు అసెంబ్లీలో, ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తున్న సందర్భంలో ఇలాంటి పనులు చేయడానికి ఆలోచించేలా చేయాలి. కమిటీ సభ్యునిగా మరింత బాధ్యతగా వ్యవహరించాలి గానీ, సరదాగా , నిర్లక్ష్యంగా వ్యవహరించుట ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
విపక్షాలు కూడా ఇదే పాయింట్ ఎత్తారు . ఒక మంత్రి పబ్లిక్‌గా తప్పు చేశారని తేలితే, కేవలం శాఖ మాత్రమే మార్చడం వల్ల ప్రజలకు సరైన సందేశం వెళ్లదు. మంత్రి పదవిలో ఉండేవారికి బాధ్యత, నైతికత చాలా ప్రధానమైనవి. అక్కడ మిస్ అయితే.. ప్రభుత్వం మరింత కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయం చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో నిస్పక్షపాతంగా విచారణ జరిపి, తప్పు తేలితే కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే మంత్రిగా లేదా ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారికి సరైన మెసేజ్ వెళ్తుంది. అధికారపక్షం ఎంచుకున్న మార్గం అనేక అనుమానాలను రేపుతుంది . రాజకీయ విలువలు, బాధ్యతాయుత నాయకత్వం అంటే ఇదేనా? అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక, మాణిక్ రావ్ తన ఆరోపణలను తిప్పికొట్టినప్పటికీ, ప్రజల్లో, మీడియాలో విస్తృతంగా ఈ వీడియో వెళ్లిపోయింది. అందుకే అతనిపై ఇలాంటి చర్య సరిపోదు… ప్రజాస్వామ్యంలో నాయకులకు ఉన్న నైతిక బాధ్యత ఎంత ముఖ్యమో ప్రభుత్వం గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.
Also Read: Kaleshwaram :16నెలలు.. 650 పేజీలు.. కాళేశ్వరం కమిషన్ ఓపెన్ బుక్ రిలీజ్
Tirumala: ఇకపై తిరుమలలో వారికి నో ఎంట్రీ..