Latest News

Secrets :సీక్రెట్స్ పంచుకున్న వాళ్లే చీటర్స్ అవుతున్నారా? ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్లతో ఎలా ఉండాలి?

Secrets : ఒక వ్యక్తిని నమ్మి మనసులోని బాధను, ఇంట్లోని విషయాలను పంచుకున్నప్పుడు.. వారు ఓదారుస్తూనే, వెనుక మరో కుట్రకు తెర తీస్తారని ఎవరూ ఊహించలేరు.

Secrets

కొంతమంది మన దగ్గరకు వచ్చి వారి జీవితంలో మనకంటే వారికి ఎవరూ ఇంపార్టెంట్ కాదు అన్నట్లుగా బిహేవ్ చేస్తారు. ఆ మాటల మాయలో పడి వారితో మన పర్సనల్ విషయాలన్నీ షేర్ చేసేసుకుంటాం. ఆ తర్వాతే వారి అసలు రంగు బయటపడుతుంది. మన బలహీనతలన్నిటినీ ఇతరులతో పంచుకోవడం, లేదా ఎవరి గురించి అయితే మనం ఫీలయ్యామో వారికే ఆ విషయాలన్నీ చెప్పి గొడవలు పెట్టడం చేస్తారు.

అటెన్షన్ సీకింగ్ వ్యాధి ఉన్నవాళ్లే ఇలా చేస్తారని సైకాలజీ చెబుతుంది. అంటే వేరేవాళ్ల రహస్యాలు(Secrets )ఇతరులకు చెప్పడం ద్వారా నలుగురిలో తాము ఏదో స్పెషల్ అనిపించుకోవాలనుకుంటారు. ఇలాంటి వారు పైకి మంచివారిలా కనిపిస్తారు కానీ, చేసే పనులు మాత్రం ఇతరుల మనశ్శాంతిని దూరం చేసేలా ఉంటాయి.

నిజమే ఎవరైనా సరే ఇలా తమ జీవితంలో ఒక్కసారి అయినా బోల్తా పడతారు. ఒక వ్యక్తిని నమ్మి మనసులోని బాధను, ఇంట్లోని విషయాలను పంచుకున్నప్పుడు.. వారు ఓదారుస్తూనే, వెనుక మరో కుట్రకు తెర తీస్తారని ఎవరూ ఊహించలేరు. కొందరు తియ్యగా మాట్లాడి.. తెలియకుండానే పర్సనల్(Secrets) విషయాలన్నీ వారితో చెప్పేలా చేసుకుంటారు.

కానీ తీరా చూస్తే ఆ మాటలనే చేరవేసి మనుషుల మధ్య చిచ్చు పెడతారు. ఇలాంటి ప్రవర్తన ఆఫీసులలోనూ, బంధువులు, స్నేహితులలో చూస్తుంటాం. దీనిని సైకాలజీలో ‘ట్రయాంగులేషన్’ (Triangulation) అని పిలుస్తారు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య అప్పటికే ఉన్న దూరాన్ని ఇంకాస్త పెంచి, ఆ గందరగోళంలో తాము పైచేయి సాధించాలనుకునే మనస్తత్వం అన్నమాట.

సైకాలజిస్టులు చెబుతున్న దాని ప్రకారం, ఇలాంటి మనస్తత్వం ఉన్నవారికి తమ జీవితంలో ఎలాంటి లక్ష్యాలు ఉండవు. అందుకే ఇతరుల సీక్రెట్స్‌(Secrets)ను ఒక కరెన్సీ లాగా వాడుకుంటారు. ఒకరి మాటలు మరొకరికి చెప్పడం ద్వారా అందరికి దగ్గరవొచ్చని, అందరూ తామే ముఖ్యమైన వ్యక్తులుగా భావిస్తారని భ్రమపడతారు. అయితే వీరి ఈ అటెన్షన్ సీకింగ్’ (Attention Seeking) వల్ల వీరిని నమ్మిన వ్యక్తికి మాత్రం తీరని మానసిక వేదన మిగులుతుంది.

పచ్చని సంసారాలు కూలిపోవడం, ప్రాణస్నేహితులు శత్రువులుగా మారడం వంటి వాటికి ఇలాంటి నారదముని మనస్తత్వాలే కారణం. అయితే ఇలాంటి పనులతో వారు తాత్కాలికంగా ఆనందపడినా, మెల్లగా సమాజంలో ఒంటరివాళ్లు అయిపోతారు. ఎవరూ వారిని నమ్మరు, కనీసం పలకరించడానికి కూడా భయపడతారు.

మరి ఇలాంటి వ్యక్తులను ముందే ఎలా గుర్తుపట్టాలంటే.. ఎవరైతే వేరేవాళ్ల పర్సనల్ విషయాలను మీ దగ్గరకు వచ్చి ఉత్సాహంగా చెబుతున్నారో, రేపు మీ విషయాలను కూడా వారు ఇతరుల దగ్గర అదే ఉత్సాహంతో చెబుతారన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లోని విషయాలను, మీ బలహీనతలను ఎప్పుడూ బయటి వ్యక్తులతో పంచుకోకండి.

Secrets
Secrets

ఒకవేళ ఎవరి మీదైనా అసంతృప్తిగా ఉంటే, ఆ వ్యక్తితోనే నేరుగా మాట్లాడి ఆ సమస్యను తేల్చుకోండి తప్ప, ఈ కలుపుగోలుతనం ముసుగు వేసుకున్న మనుషుల దగ్గర మాత్రం మనసు విప్పకండి. ఎందుకంటే వారు మీ బాధను వినరు, మీ జీవితాన్ని తగలబెట్టడానికి కావాల్సిన నిప్పును సేకరించే పనిలో మాత్రమే ఎప్పుడూ ఉంటారు.

ఒకవేళ మీరు ఇప్పటికే ఇలాంటి వారి వల్ల మోసపోయి ఉంటే, బాధపడటం ఆపేసి వారికి దూరంగా ఉండటం నేర్చుకోవాలి. వారు మళ్లీ మీ దగ్గరకు వచ్చి నటిస్తుంటే మాత్రం నాకు ఇలాంటివన్నీ నచ్చవని మొహం మీదే చెప్పేయండి. మనలో నిగ్రహం, ఎదుటివారిని అంచనా వేయడంలో కొంచెం విచక్షణ ఉంటే చాలు.. ఇలాంటి టాక్సిక్ మనుషుల మాయలో పడకుండా మన గౌరవాన్ని కాపాడుకోవచ్చు.

CSK : చెపాక్ లో గర్జించిన దిగ్గజాలు.. సీఎస్కే మాజీల ఎగ్జిబిషన్ మ్యాచ్

Related Articles

Back to top button