Just BusinessLatest News

Buy Gold : బంగారం కొనాలనుకునే వారికి బంపర్ న్యూస్.. ఐదు రోజుల్లోనే పాతాళానికి పసిడి ధరలు

Buy Gold : తక్కువ బడ్జెట్‌లో జ్యువెలరీ చేయించుకోవాలనుకునే వారు ఎక్కువగా వాడే 18 క్యారెట్ల బంగారం ధర కూడా 7,740 రూపాయల మేర తగ్గడంతో కొనుగోలు దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Buy Gold

బంగారమంటే భారతీయులకు, ముఖ్యంగా తెలుగు వారికి ఉన్న మక్కువే కాదు కాస్త సెంటిమెంట్ కూడా. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ మొదలైందంటే చాలు, పసిడి ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి బులియన్ మార్కెట్ నుంచి ఒక అద్భుతమైన వార్త వచ్చేసింది.

నిజానికి కొద్దిరోజులుగా చుక్కలను తాకిన పసిడి ధరలు ఈమధ్య కాస్త నేలచూపులు చూస్తున్నాయనే చెప్పొచ్చు. ఇక కేవలం ఒక్క రోజులోనే 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్‌పై ఏకంగా 10 వేల రూపాయలకు పైగా ధర తగ్గిపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఈ ఏడాది జనవరిలో దాదాపు ఒక లక్షా 70 వేల రూపాయల గరిష్ట స్థాయికి చేరుకున్న పుత్తడి ధరలు, ఇప్పుడు అక్కడి నుంచి భారీగా పతనమై సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తోంది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలయిన హైదరాబాద్ ,విజయవాడ, విశాఖ పట్నం వంటి ప్రధాన నగరాల్లో ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర సుమారు 10,320 రూపాయల వరకూ తగ్గిపోయి, ఇప్పుడు ఒక లక్షా 35 వేల 650 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, జ్యువెలరీ తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి ధర కూడా తులంపై 9,450 రూపాయల వరకు తగ్గడంతో, ఒక లక్షా 24 వేల 350 రూపాయలకు చేరింది.

అంతేకాదు తక్కువ బడ్జెట్‌లో జ్యువెలరీ చేయించుకోవాలనుకునే వారు ఎక్కువగా వాడే 18 క్యారెట్ల బంగారం ధర కూడా 7,740 రూపాయల మేర తగ్గడంతో కొనుగోలు దారులు(Buy Gold) సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఐదు రోజులుగా బులియన్ మార్కెట్ సరళిని గమనిస్తే, తులం పుత్తడిపై మొత్తం మీద 22 వేల రూపాయలకు పైగా ధర తగ్గడంతో బంగారం కొనుగోలుదారుల(Buy Gold)కు ఒక సువర్ణావకాశమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Buy Gold
Buy Gold

మరోవైపు గోల్డ్ ధరలతో ఇన్ని రోజులు పోటీ పడి మరీ పెరిగిన సిల్వర్ ధరలు కూడా భారీగానే పతనమవుతూ వస్తున్నాయి. నిన్న అంటే మార్చి 23 సోమవారం ఒక్కరోజే కిలో వెండిపై 20 వేల రూపాయల భారీ తగ్గింపు నమోదయి మార్కెట్ నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ తగ్గిన ధరలతో ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర 2 లక్షల 30 వేల రూపాయల వద్ద స్థిరపడినట్లు అయింది.

అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ విలువ పెరగడంతో పాటు , అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇంట్రస్ట్ రేట్ల విషయంలో తీసుకుంటున్న కఠిన నిర్ణయాలతో బంగారంపై పెట్టుబడులు తగ్గుతున్నాయి.అంతేకాకుండా కమోడిటీ మార్కెట్లలో ఇన్వెస్టర్లు భారీగా పుత్తడి అమ్మకాలకు మొగ్గు చూపడం వల్ల ధరలు ఇలా కిందికి దిగి వస్తున్నాయి. అయితే గోల్డ్ రేట్లు అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ గణాంకాలు బట్టి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి బంగారం కొనే ముందు ఒకసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

Delhi Capitals : ట్రోఫీ ముచ్చట తీరేనా ?..అంచనాలతో ఢిల్లీ క్యాపిటల్స్

Related Articles

Back to top button