Just SpiritualJust Andhra PradeshLatest News

Vontimitta : పౌర్ణమి రోజు రాములోరి కళ్యాణం…ఒంటిమిట్ట క్షేత్రం విశేషాలు తెలుసా ?

Vontimitta : చైత్రమాసం పౌర్ణమి రోజు మాత్రం ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి

Vontimitta

శ్రీరామనవమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే వాడవాడలా ఘనంగా జరిగాయి. అయితే చైత్రమాసం పౌర్ణమి రోజు మాత్రం ఒంటిమిట్ట(Vontimitta)లో సీతారాముల కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.సాయంత్రం 6. 30 నుంచి రాత్రి 8:30 గంటల మధ్య శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరగనుంది.

అసలు నవమి రోజున కాకుండా పౌర్ణమి రోజు రాములోరి కళ్యాణ వేడుక ఏర్పాటు చేయడానికి కారణమేంటి.. ఆ విశేషాలు ఒకసారి చూద్దాం.. తెలుగు రాష్ట్రాల్లో చాలా పురాతన ఆలయాలున్నాయి. వాటిలో అత్యంత పురాతనమైనది ఒంటిమిట్ట(Vontimitta) కోదండ రామాలయం. భద్రాచలంలో శ్రీరామనవమి రోజు కళ్యాణం జరిగితే ఒంటిమిట్టలో మాత్రం ఐదు రోజుల తర్వాత రాములవారి కళ్యాణాన్ని కన్నులపండువగా జరుపుతారు.

Related Articles

ఒంటి అంటే ఒక అని అర్థం… ఒక మిట్టమీద నిర్మించిన రామాలయం కావడంతో దీనికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చింది. ఒంటిమిట్ట క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ గర్భాలయంలో ఆంజనేయస్వామి ఉండడు.

ఆంజనేయుడిని కలిసేందుకు ముందే సీతారామలక్ష్మణులు ఇక్కడ సంచరించారనీ, అందుకే ఆంజనేయుని విగ్రహం ఇక్కడ ప్రతిష్టించలేదని కొందరు చెబుతుంటారు.అలాగే అత్యంత పురాతనమైన ఈ ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలు విడి విడిగా ఉన్నా ఏక రాతిలో చెక్కబడి ఉండడం ప్రత్యేకత. అందుకే దీనిని ఏక శిలా నగరంగా పిలుస్తారు.

Vontimitta
Vontimitta

ఒంటిమిట్ట ఆలయం ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులుగా ఉంటుంది. విజయనగర రాజులు, పొత్తపి చోళులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తోంది. కాగా ఆలయంలో మధ్య 32 స్తంభాలున్న రంగమండపం ఉంది. ఈ స్తంభాల మీద శిల్పకళ చోళ, విజయనగర శిల్పశైలిని పోలి ఉంటుంది.

వాటిపై రామాయణం, భారతం కథలు చిత్రీకరించి ఉంటాయి. ఒంటిమిట్టలో చైత్ర శుధ్ధ నవమి నుంచి బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చైత్ర శుద్ధ చతుర్దశి రోజు జరిగే కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంటుంది. అలాగే చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు రథోత్సవం కూడా అంగరంగవైభవంగా జరుపుతుంటారు.

ఈ ఉత్సవాలు వీక్షించడానికి పలు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ఏపీ, తెలంగాణ విడిపోయిన తర్వాత ఒంటిమిట్ట రాములోరి కళ్యాణానికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది.

Tollywood : మార్చి సందడి కొంతే…టాలీవుడ్ 3 నెలల రిపోర్ట్

Related Articles

Back to top button