Just TelanganaLatest News

GHMC: హైదరాబాదీలకు ఇది నిజంగా శుభవార్తే..

GHMC : జీహెచ్‌ఎంసీ కొత్త అడుగు: ఇకపై మీ సమస్యలకు వాట్సాప్ పరిష్కారం....వాట్సాప్‌ (whatsapp)లో ఎలా ఫిర్యాదు చేయాలంటే..

GHMC

హైదరాబాద్ (hyderabad) నగరంలో ఉండే ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఒక మంచి శుభవార్త చెప్పింది. ఇకపై మీ చుట్టుపక్కల ఉండే చెత్త సమస్యలు, రోడ్ల పక్కన పడి ఉన్న నిర్మాణ వ్యర్థాలు, లేదా నిండిపోయిన చెత్త డబ్బాల గురించి ఫిర్యాదు చేయాలంటే, ఒక వాట్సాప్ నంబర్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త వాట్సాప్ సర్వీస్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ శుక్రవారం మొదలుపెట్టారు.

ఈ కొత్త సేవ వల్ల ప్రజలు తమ సమస్యలను అధికారులకు మరింత తేలికగా, త్వరగా చెప్పగలుగుతారు. ఇంతకుముందు ఫిర్యాదులు చేయాలంటే ..మై జీహెచ్‌ఎంసీ యాప్(My GHMC App) వాడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు అందరూ వాడే వాట్సాప్ ద్వారానే ఫిర్యాదులు స్వీకరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ప్రజల నుంచి వచ్చే సమస్యలపై అధికారులు మరింత వేగంగా స్పందించేందుకు ఈ కొత్త వాట్సాప్ నంబర్ ఎంతో ఉపయోగపడుతుంది.

GHMC
GHMC

వాట్సాప్‌ (whatsapp)లో ఎలా ఫిర్యాదు చేయాలంటే..

మీ కాలనీలో లేదా మీరు వెళ్లే దారిలో ఎక్కడైనా చెత్త కుప్పలు, డొమెస్టిక్ వేస్ట్ ఎక్కువగా పేరుకుపోయినా, నిర్మాణ వ్యర్థాలు రోడ్డుపై పడి ఉన్నా, లేదా చెత్త డబ్బాలు నిండిపోయి చెత్త బయటకు వస్తున్నా, ఆ సమస్యల గురించి ఫిర్యాదు చేయాలంటే చాలా సులభం.

  • మీ ఫోన్‌లో 81259 66586 అనే వాట్సాప్ నంబర్‌ను సేవ్ చేసుకోండి.
  • ఆ సమస్య ఉన్న చోటును ఫోటో తీసి, ఆ ఫోటోను ఈ నంబర్‌కు పంపించండి.
  • ఆ సమస్య ఎక్కడ ఉందో కచ్చితమైన లొకేషన్ వివరాలను కూడా పంపించండి.
  • మీరు పంపించిన ఫిర్యాదులు జీహెచ్‌ఎంసీ అధికారులకు నేరుగా వెళ్తాయి. ఆ తర్వాత అధికారులు ఆ సమస్యను వెంటనే పరిష్కరిస్తారు.
GHMC
GHMC

హైదరాబాద్‌(hyderabad)ను మరింత పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతోనే ఈ కొత్త వాట్సాప్ సేవను మొదలుపెట్టారు. ఈ విషయంలో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ (R.V. Karnan)చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి, ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే ఈ వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయడానికి ఈ కొత్త సేవను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఇది ప్రజలు, జీహెచ్‌ఎంసీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, మరింత మెరుగైన సహకారానికి దారి తీస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: liquor scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ కనెక్షన్.. అసలేం జరుగుతోంది?

 

Related Articles

Back to top button