Just LifestyleLatest News

Partner: టేకింగ్ ఫర్ గ్రాంటెడ్.. మీ భాగస్వామికి మీరిచ్చే ప్రాధాన్యత ఎందుకు తగ్గుతుందో తెలుసా?

Partner: ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ తగ్గడం, మెసేజ్‌లకు ఆలస్యంగా రిప్లై ఇవ్వడం, చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం వంటివి ఇక్కడ నుంచే మొదలవుతాయి.

Partner

ఏ రిలేషన్ అయినా మొదట్లో చాలా మధురంగా, ఉత్సాహంగా ఉంటుంది. అయితే కాలం గడిచేకొద్దీ ఆ ఇంపార్టెన్స్, ఒకరికి ఒకరు ఇచ్చుకున్న ప్రయారిటీ మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఇదే ప్రశ్న ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సమయంలో ప్రతీ బంధంలోనూ వేధిస్తూనే ఉంటుంది. అయితే ఈ రకమైన మెంటాలిటీని సైకాలజీలో ‘హెడోనిక్ అడాప్టేషన్’ అని పిలుస్తారు. అంటే ఏదైనా కొత్త విషయం మొదట్లో ఇచ్చే ఆనందం, అది అలవాటైన తర్వాత మెల్లగా తగ్గుతూ వస్తుందన్న మాట.

ఏ రిలేషన్‌లో అయినా ప్రారంభ దశను హనీమూన్ పీరియడ్ అంటారు. ఈ సమయంలో ఆ ఇద్దరి మెదడులో ఆక్సిటోసిన్, డోపమైన్ వంటి రసాయనాలు వెల్లువలా కురుస్తాయి. దీనివల్లే భాగస్వామి(Partner)లోని లోపాలేమీ అప్పుడు కనిపించవు, కేవలం వారిలోని మంచి, అందచందాలు వంటివే కనిపిస్తాయి. ఆ సమయంలో ఎదుటివారిని మెప్పించడానికి ఇద్దరూ కూడా తమలోని అత్యుత్తమ వెర్షన్‌ను చూపిస్తారు.

అయితే మెల్లమెల్లగా ఈ బంధంలో ఈ ఆక్సిటోసిన్, డోపమైన్ రసాయనాల ప్రభావం తగ్గి, వాస్తవ పరిస్థితులు ఫేస్ చేసే స్టేజ్‌కు ఇద్దరూ వెళతారు. అప్పుడు వారిలోని చిన్న చిన్న లోపాలు కూడా పెద్దవిగా కనిపించడం మొదలవుతుంది. దీనివల్ల వారికి తెలియకుండానే గొడవలకు బీజం పడుతుంది.

ఇలా ఇంపార్టెన్స్ తగ్గడానికి మెయిన్ రీజన్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ అని సైకాలజిస్టులు చెబుతున్నారు. అంటే, అవతలి వ్యక్తి(Partner) ఎక్కడికీ వెళ్లరు, ఎప్పుడూ మనతోనే ఉంటారనే ఒక నిశ్చింత ఏర్పడటం, అలాగే నాతో అలా ఉండాల్సిన బాధ్యత వారిది అన్న ఫీలింగ్‌లోకి అవతలివారు వెళ్లడం అన్నమాట. దీని వల్లే బంధం మొదట్లో చూపించిన శ్రద్ధ, ఆరాటం మెల్లమెల్లగా తగ్గుతాయి.

దీనిలో భాగంగానే ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ తగ్గడం, మెసేజ్‌లకు ఆలస్యంగా రిప్లై ఇవ్వడం, చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం వంటివి ఇక్కడ నుంచే మొదలవుతాయి. దీనివల్ల అవతలి వ్యక్తికి తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే భావన కలిగి, మానసిక దూరం పెంచుకుంటారు. ఇలా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగినప్పుడు, వీరిద్దరి మధ్య మౌనమే రాజ్యమేలుతుంది. ఆ మౌనం లోపల అసంతృప్తిని పెంచి, చిన్న కారణాలకే పెద్ద గొడవలు అయ్యేలా చేస్తుంది.

అంతేకాదు వారి ముందున్న బాధ్యతలు కూడా వారిద్దరి బంధంలో ఎఫెక్ట్ చూపిస్తుంది. కెరీర్, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు పెరిగేకొద్దీ మన శక్తి అంతా వాటికే సరిపోతుంది. దీనివల్ల భాగస్వామి(Partner)తో క్వాలిటీ టైమ్‌ (Quality Time) గడపడం తగ్గిపోతుంది. అయితే ఇక్కడే ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రేమ అనేది ఒక మొక్క వంటిది, దానికి ప్రతిరోజూ నీళ్లు పోయాలి.

కానీ చాలామంది తమ ఇద్దరి మధ్య బంధం స్థిరపడగానే ఇక ఏమీ చేయక్కర్లేదని అనుకుంటారు. ప్రయారిటీ తగ్గిస్తూ మిగిలిన విషయాలపై ఫోకస్ పెంచుతారు. ఈ నిర్లక్ష్యమే వారి బంధాన్ని మెల్లమెల్లగా వీక్ చేస్తుంది. అంతేకాదు ఎదుటివారి నుంచి వారేం పొందుతున్నామనేది చూస్తారే తప్ప, తాము వారికి ఏమి ఇస్తున్నామనేది గమనించకపోవడం వల్ల కూడా ఈ బంధాలలో గ్యాప్ పెరుగుతుంది.

Partner
Partner

మరో ముఖ్యమైన కారణం ఎక్స్‌పెక్టేషన్స్, అతిగా ఆశించడం.ఎందుకంటే బంధం మొదట్లో అవతలి వ్యక్తి మన ఊహల్లోని దేవతలా, దేవుడిలా కనిపిస్తారు. వారి నుంచి ఎక్కువ టైమును, ప్రేమను కోరుకుంటారు. ఈ నిరాశే కోపంగా, అసహనంగా మారి గొడవలకు దారితీస్తుంది. కానీ గ్యాప్ ఏర్పడుతుందని తెలిసినా ,కూర్చుని చర్చించుకోవాల్సిన సమయం వచ్చినా కూడా వారి బంధాన్ని లైట్ తీసుకుని అలాగే ఉండటం వల్ల ఒక్కోసారి ఆ రిలేషన్ శాశ్వతంగా దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.

నిజానికి ఎలాంటి రిలేషన్ షిప్ అయినా ఎప్పుడూ ఒకేలా ఉంటుందనేది అబద్ధం. అది నిరంతరం మారుతూ ఉంటుంది. ఉండాలి కూడా. ఆ మార్పును అర్థం చేసుకుని, ఒకరినొకరు గౌరవించుకుంటూ, కొత్తగా ప్రేమించుకోవడం నేర్చుకున్నప్పుడు మాత్రమే వారిద్దరి బంధం చిరకాలం నిలుస్తుందనేది ఏ జంట అయినా తెలుసుకోవాలి. అది స్నేహితులు అయినా, భార్యభర్తలు అయినా ప్రేమికులు అయినా సరే ఎవరైనా పాటించాల్సిందేనని సైకాలజీ చెబుతుంది. ఇది ఏ ఒక్కరి చేతిలోనో ఉండదు . రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లుగా రెండు మనసులు అర్ధం చేసుకుంటేనే ఏ బంధం అయినా కలకాలం నిలబడుతుంది.

Lord Venkanna:రూ. 300 టికెట్లు దొరకలేదా? శ్రీవారి దర్శనానికి మరో ఈజీ మార్గం..

Related Articles

Back to top button