Just SportsLatest News

Delhi Capitals : ఢిల్లీ రాత మారేనా ?..రాజస్థాన్ తో కీలక పోరు

Delhi Capitals : ఐపీఎల్ సీజన్ జరిగిన ప్రతీసారీ ఆరంభ మ్యాచ్ లలో అదరగొట్టడం.. తర్వాత చేతులెత్తేయడం ఢిల్లీ క్యాపిటల్స్ కు అలవాటుగా మారింది.

Delhi Capitals

ఐపీఎల్ సీజన్ జరిగిన ప్రతీసారీ ఆరంభ మ్యాచ్ లలో అదరగొట్టడం.. తర్వాత చేతులెత్తేయడం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) కు అలవాటుగా మారింది. ప్రస్తుత సీజన్ లోనూ ఆ జట్టు ఇదే తరహా ప్రదర్శన చేస్తోంది. మొదట వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన ఢిల్లీ తర్వాత వరుసగా పరాజయాలు చవిచూస్తోంది.

ఇప్పటి వరకూ 8 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మూడింటిలో గెలిచి, ఐదింటిలో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ అవకాశాలు నిలబెట్టుకోవాలంటే ఇప్పటి నుంచి జరిగే మ్యాచ్ లలో కనీసం నాలుగు లేదా ఐదింటిలో గెలవాల్సి ఉంటుంది. ఢిల్లీ(Delhi Capitals)కి ప్రధాన సమస్య వారి నిలకడ లేని బ్యాటింగే..

ఒక మ్యాచ్ లో 240 ప్లస్ స్కోరు చేస్తే, తర్వాతి మ్యాచ్ లో 77 పరుగులకే కుప్పకూలింది. రాహుల్, నిస్సాంక, నితీశ్ రాణా, సమీర్ రిజ్వీ నిలకడగా రాణించలేకపోతుండడం మైనస్ గా మారింది. ఢిల్లీని వరుసగా రెండు మ్యాచ్ లలో గెలిపించిన రిజ్వీ మళ్లీ ఒక్కసారి కూడా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. స్టబ్స్ , మిల్లర్ కూడా ఫినిషింగ్ రోల్స్ లో సత్తా చాటాల్సిన సమయం వచ్చింది.

విప్రజ్ నిగమ్ కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్ పూర్తిస్థాయిలో గాడిన పడితే తప్ప ఢిల్లీ పుంజుకునే అవకాశం లేదు. అటు బౌలింగ్ లో మిఛెల్ స్టార్క్ జట్టుతో చేరడం ఢిల్లీకి బలాన్ని పెంచేదే. గాయం కారణంగా 8 మ్యాచ్ లకు దూరమైన స్టార్క్ కు ఆసీస్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జట్టుతో కలిసాడు.

ఇప్పుడు లుంగి ఎంగిడి కూాడా దూరమవడంతో స్టార్క్ పైనే భారం పడనుంది. అటు చమీరా లేదా జేమీసన్ లో ఒకరికి ప్లేస్ దక్కనుంది. ముకేశ్ కుమార్ కూడా ఢిల్లీ పేస్ ఎటాక్ లో కీలకంగా ఉన్నాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఇంకా మెరుగ్గా రాణించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

Delhi Capitals
Delhi Capitals

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ మాత్రం సూపర్ ఫామ్ లో ఉంది. సన్ రైజర్స్ చేతిలో పరాజయం పాలైన తర్వాత కాస్త తడబడినా మళ్ళీ పుంజుకుంది. లక్నో , పంజాబ్ జట్లపై విజయాలను అందుకుంది. బ్యాటింగ్ లో జైస్వాల్ , వైభవ్ సూర్యవంశీ ఇచ్చే ఆరంభాలే రాజస్థాన్ విజయాల్లో కీలకంగా ఉంటున్నాయి.

ముఖ్యంగా వైభవ్ ను ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. కొద్దిసేపే క్రీజులో ఉన్నా భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అలాగే జురెల్, ఫెరీరా, జడేజా కూడా రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ లో కీలకంగా ఉన్నారు. అయితే రియాన్ పరాగ్ కెప్టెన్ గా పర్వాలేదనిపిస్తున్నా బ్యాటర్ గా ఫ్లాప్ అవుతున్నాడు. బౌలింగ్ లో ఆర్చర్ పైనే భారం పడింది. బర్గర్, యశ్ రాజ్ పుంజా కూడా రాణిస్తుండడంతో రాయల్స్ బౌలింగ్ పటిష్టంగా మారింది. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు చెరో 15 మ్యాచ్ లు గెలిచాయి.

Gujarat Titans : గుజరాత్ ఆల్ రౌండ్ షో..ఆర్సీబీపై రివెంజ్ విక్టరీ

Related Articles

Back to top button