VD Satheesan :కేరళంలో మళ్లీ మొదలైన హస్తం పాలన..వీడీ సతీషన్‌కే సీఎం పీఠం ఎందుకు?
VD Satheesan: సీనియర్ నేత వీడీ సతీషన్‌ను కేరళం నూతన ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ హైకమాండ్ అధికారిక నిర్ణయం తీసుకుంది.
VD Satheesan
కేరళం రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ (UDF) కూటమి ఘనవిజయం సాధించాక.. కొద్దిరోజులుగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది.
సీనియర్ నేత వీడీ సతీషన్‌ను కేరళం నూతన ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ హైకమాండ్ అధికారిక నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్కంఠభరిత సెలక్షన్ వెనుక ఉన్న అసలు కారణాలు, సతీషన్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్‌పై ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది
వీడీ సతీషన్ (VD Satheesan)కేరళం రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత. ఎర్నాకుళం జిల్లాకు చెందిన వీడీ సతీషన్, లా గ్రాడ్యుయేట్ మాత్రమే కాదు.. కేరళ హైకోర్టులో లాయర్‌గానూ ప్రాక్టీస్ చేశారు.
కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన సతీషన్(VD Satheesan), పరవూరు నియోజకవర్గం నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటుకున్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించడంలో ఆయన పోషించిన పాత్ర చాలా కీలకమని అధిష్టానం కూడా గుర్తించింది.
మొత్తం 140 స్థానాలున్న కేరళం అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమి ఏకంగా 102 సీట్లు గెలుచుకుని పవర్‌లోకి వచ్చేసింది. వీటిలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 63 స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. దశాబ్ద కాలం తర్వాత కేరళంలో ఎల్డీఎఫ్ (LDF) కోటను బద్ధలు కొట్టి మరీ కాంగ్రెస్ జెండా ఎగురవేయడంతో, సహజంగానే సీఎం రేసులో పోటీ బాగా పెరిగింది.
కేరళం ముఖ్యమంత్రి పదవి కోసం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పేరు కూడా గట్టిగా వినిపించింది. అయితే, ఐదేళ్లుగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న సతీషన్ వైపు పార్టీ మొగ్గు చూపించింది.

అదీకాకుండా, ముఖ్యమంత్రి సీటు ఇస్తే మాత్రమే తీసుకుంటాను లేదంటే ఏ పదవీ వద్దని సతీషన్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు, కేసీ వేణుగోపాల్ సేవలు కేంద్రంలో పార్టీకి అత్యవసరమని భావించిన కాంగ్రెస్ అధిష్టానం, చివరి నిమిషంలో సతీషన్‌ను ఫైనల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది
మొత్తంగా అనుభవం, పట్టుదల, పార్టీ పట్ల ఉన్న నిబద్ధతే సతీషన్‌ను కేరళం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాయి. ఇకపై వీడీ సతీషన్ నేతృత్వంలో కేరళంలో కాంగ్రెస్ పాలన ఎలా సాగుతుందో చూడాలి.





