Rupee:డాలర్ దెబ్బకు రూపాయి విలవిల.. చరిత్రలో తొలిసారిగా 96 మార్కును దాటిన మారకపు విలువ
Rupee : పశ్చిమ ఆసియాలో ఇరాన్ యుద్ధ భయాల వల్ల అంతర్జాతీయంగా ఫ్యూయల్ ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకడంతోనే రూపాయిపై ఈ స్థాయి ఒత్తిడికి ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Rupee
అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న ఊహించని పరిణామాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ ఎప్పుడూ లేనంతగా భారీ పతనాన్ని చవి చూసింది. చరిత్రలోనే మొదటిసారిగా ఒక డాలర్ విలువ రికార్డు స్థాయిలో 96 రూపాయల మార్కును దాటడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
ఈరోజు ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్‌లో అప్ అండ్ డౌన్స్ మధ్య ప్రారంభమైన రూపాయి, ఒక దశలో 96.14 రూపాయిల అత్యల్ప స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెంటనే జోక్యం చేసుకోవడంతో కాస్త కోలుకుని, చివరికి 95.86 వద్ద ముగిసింది. పశ్చిమ ఆసియాలో ఇరాన్ యుద్ధ భయాల వల్ల అంతర్జాతీయంగా ఫ్యూయల్ ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకడంతోనే రూపాయిపై ఈ స్థాయి ఒత్తిడికి ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూపాయి (Rupee) విలువ 6 శాతానికి పైగా క్షీణించగా, కేవలం 6 రోజుల్లోనే 2 శాతం మేర పడిపోయింది. అమెరికాలో రిటైల్ విక్రయాలు పెరగడంతో పాటు, అక్కడి మార్కెట్ స్థిరంగా ఉండటంతో డాలర్ ఇండెక్స్ మరింతగా బలపడింది. దీనికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి అలాగే ఐటీ రంగంలో కొత్త పెట్టుబడుల కొరత వల్ల విదేశీ నిధులు వెనక్కి వెళ్లిపోతున్నాయి.

రూపాయి (Rupee) పతనం కావడం వల్ల భారత దేశంపై పడే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. భారత్ తన అవసరాల కోసం ముడి చమురును భారీగా దిగుమతి చేసుకుంటుంది కాబట్టి, డాలర్ ధర పెరిగితే మనం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, రవాణా ఖర్చులు ఖరీదై నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతాయి. విదేశీ విద్య, పర్యటనలు కూడా మరింత భారం కానున్నాయి.
రూపాయి పతనం, క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 108 డాలర్లకు చేరడం దేశీయ స్టాక్ మార్కెట్లను కూడా కోలుకోలేని దెబ్బతీసింది. ఉదయం లాభాలతో ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు, ముగింపు సమయానికి మాత్రం తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించడంతో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడినట్లు అయింది.
Voter list: తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల లిస్ట్ క్లీనింగ్..తప్పులుంటే ఇలా అప్పీల్ చేసుకోండి..





