Ponnam Prabakar : బరాబర్ మా అయ్య జాగీరే..పవన్ కు పొన్నం కౌంటర్
Ponnam Prabakar : పవన్ ప్రెస్ మీట్ ముగిసిన 5 నిమిషాల్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ లో మీడియా సమావేశం పెట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బరాబర్ మా జాగీరే అంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.
Ponnam Prabakar
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్ , జనసేన మధ్య పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరిపోయింది. పవన్ తెలంగాణ పర్యటనతో రాజకీయం రాజుకుంది. జనసేన సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ తన నివాసంలోనే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. దీంతో పవన్ ప్రెస్ మీట్ ముగిసిన 5 నిమిషాల్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabakar) గాంధీభవన్ లో మీడియా సమావేశం పెట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బరాబర్ మా జాగీరే అంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.
గతంలో తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ ఇప్పుడు ఇక్కడకు వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. పవన్ ను పెయిడ్ ఆర్టిస్ట్ గా అభివర్ణించిన పొన్నం ప్రభాకర్(Ponnam Prabakar) తానే నిర్మాతనై ఉంటే ఒక పాత్ర ఇచ్చి నటింపజేస్తానంటూ సెటైర్లు వేశారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఇచ్చిన నిధుల గురించి పవన్ ప్రస్తావించడాన్ని పొన్నం తప్పుపట్టారు.
కొండగట్టుకు నిధులు పవన్ తన జేబులో నుంచి తీసి ఇచ్చారా అంటూ మండిపడ్డారు. అమరుడు గద్దర్‌కు కారు కొనిచ్చానని పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ, చనిపోయిన వారి గురించి మాట్లాడటం సంస్కారం కాదన్నారు., దీనిపై పవన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఆంధ్రా ప్రజలను ఎన్నడూ ఏమీ అనలేదన్న పొన్నం ఇప్పుడు పవన్ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు, పవన్ మరోసారి తెలంగాణపై తన అక్కసు వెళ్లగక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ ఇక్కడ మీటింగ్ ఎందుకు పెట్టాలనీ, ఇది రెచ్చగొట్టడం కాకుంటే మరేంటని పొన్నం మండిపడ్డారు.
పవన్ తెలంగాణలో పోటీ చేయొచ్చని , ప్రచారం కూడా చేసుకోవచ్చని తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పవన్ ను చూసేందుకు జనాలు వస్తారనీ, ఓట్లు మాత్రం వేయరని స్పష్టం చేశారు. గతంలోనే పవన్ కు ఈ అనుభవం ఎదురైందంటూ సెటైర్లు వేశారు. ఏపీ ప్రజలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ స్వాగతిస్తుందనీ, రాజకీయంగా పవన్ వచ్చి ఇక్కడ పోటీ చేసినా తమకు పోయేదేమీ లేదంటూ పొన్నం వ్యాఖ్యానించారు.
Yes మిస్టర్ పవన్ కళ్యాణ్..ఇది మా అయ్యా జాగిరే … నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల అయ్యా జాగిరే.. నీ అయ్యా జాగిరి కాదు..
ముందు తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి..
చనిపోయిన గద్దర్ గురించి మాట్లాడుతూ నేను కారు కొనిచ్చా అని చెప్తున్నాడు..
తెలంగాణ లో ఉన్న దళిత వర్గాలు… pic.twitter.com/KHXOrJBApz
— Ponnam Prabhakar (@Ponnam_INC) June 2, 2026
Pawan Kalyan : తెలంగాణ మీ అయ్య జాగీరా ?..ఇచ్చిపడేసిన పవన్ కళ్యాణ్





