Just InternationalJust PoliticalLatest News

Ukraine : ఒడెసా పోర్టులో వాణిజ్య నౌకపై రష్యా దాడి..నలుగురు భారతీయులు మృతి

Ukraine : ఒడెసా పోర్టు నుంచి ధాన్యంతో బయలుదేరుతున్న ఎంవీ గోల్డెన్ లియో అనే వాణిజ్య కార్గో నౌకను లక్ష్యంగా చేసుకుని రష్యా మూడు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించడంతో ఈ దారుణం జరిగింది

Ukraine

మొన్నటి వరకూ సాధారణ స్థితిలో ఉన్న రష్యా, ఉక్రెయిన్(Ukraine) యుద్ధం ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. ఉక్రెయిన్ ప్రధాన సైనిక స్థావరాలు, పోర్టులపై రష్యా విరుచుకుపడుతోంది. అయితే రష్యా జరిపిన తాజా దాడిలో నలుగురు భారతీయులు దుర్మరణం పాలయ్యారు. ఉక్రెయిన్‌లోని కీలక రేవు నగరం ఒడెసా పోర్టుపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో జరిపిన తాజా దాడుల్లో నలుగురు భారతీయులు సహా మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఒడెసా పోర్టు నుంచి ధాన్యంతో బయలుదేరుతున్న ఎంవీ గోల్డెన్ లియో అనే వాణిజ్య కార్గో నౌకను లక్ష్యంగా చేసుకుని రష్యా మూడు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించడంతో ఈ దారుణం జరిగింది. ప్రమాద సమయంలో గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఆ నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు.

ఈ క్షిపణి దాడితో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకుని నలుగురు భారతీయ నావికులు అక్కడికక్కడే చనిపోగా, మరొక భారతీయుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.భారతీయులతో పాటు సిరియాకు చెందిన నావికులు, ఒక ఉక్రేనియన్ పైలట్ సహా మొత్తం 10 మంది ఈ దాడిలో మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు ధృవీకరించారు.

కాగా ముంబైకి చెందిన ఒక కంపెనీ నియంత్రణలో ఉన్న ఈ నౌక, ఒడెసా పోర్టు నుండి కార్గోలో మొక్కజొన్న లోడ్ చేసుకుని బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. నల్లసముద్రం ద్వారా జరిగే ఉక్రెయిన్ ఎగుమతులను దెబ్బతీయడమే లక్ష్యంగా రష్యా గత కొన్ని రోజులుగా ఒడెసా రీజియన్‌లోని రేవులపై, ఇంధన నిల్వ కేంద్రాలపై విపరీతంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది.

సోమవారం కూడా ఒడెసా పోర్టు మౌలిక సదుపాయాలపై జరిగిన వేరొక దాడిలో మరో ముగ్గురు పౌరులు మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. ఈ నౌకాశ్రయం మరియు పరిసర ప్రాంతాలపై రష్యా బలగాలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో నౌకాశ్రయ మౌలిక వసతులు, గిడ్డంగులు దెబ్బతినడంతో పాటు చాలా మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.

Ukraine
Ukraine

ఉక్రెయిన్ ప్రధాన నల్ల సముద్ర ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం యుద్ధ నేరమని ఉక్రెయిన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ దాడులకు ప్రతిగా ఉక్రెయిన్ కూడా రష్యాలోని వివిధ ప్రాంతాలపై డ్రోన్ దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే వాణిజ్య నౌకపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

Milk : పాలు పదే పదే విరిగిపోతున్నాయా?.. ఎక్కువసేపు నిల్వ ఉంచే బెస్ట్ టిప్స్ ఇవే..

Related Articles

Back to top button