Chapati : రాత్రి పూట బ్రెడ్, చపాతీలు తింటున్నారా? దీంతో బరువు పెరుగుతారా? తగ్గుతారా?
Chapati : డిన్నర్లో రైస్‌కు నో చెప్పి చపాతీలు, బ్రెడ్‌కు ఓకే చెబుతున్నారా? అయితే మీ వెయిట్ లాస్ ప్లాన్‌పై ఈ అలవాటు ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోండి.
Chapati
చాలా మంది రాత్రి పూట రైస్ తింటే లావైపోతారని.. దానికి బదులు చపాతీలు, బ్రెడ్ వంటివి తింటూ ఉంటారు. కానీ లైట్ ఫుడ్ అనుకుని తినే ఈ చపాతీ(Chapati)లు, బ్రెడ్ వల్ల కూడా బాడీలో చాలా మార్పులు జరుగుతాయని నిపుణులు అంటున్నారు. దీనివల్ల బరువు కూడా పెరుగుతారని హెచ్చరిస్తున్నారు.
మనం తిన్న తిండిని అరిగించి ఎనర్జీగా మార్చే ప్రక్రియను మెటబాలిజం అంటారు. మన బాడీకి ఒక టైమ్ టేబుల్ ఉంటుంది. పగటిపూట ఈ మెటబాలిజం చాలా వేగంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఉదయం వేళ మనం నడుస్తాం, పనులు చేస్తాం కాబట్టి.
కానీ సూర్యాస్తమయం అయ్యాక, రాత్రి వేళల్లో మన బాడీ రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. దీనివల్లే రాత్రి సమయంలో జీర్ణక్రియ రేటు బాగా మందగిస్తుంది. ఈ తక్కువ మెటబాలిజం ఉన్న టైమ్‌లో మనం చపాతీ(Chapati)లు, బ్రెడ్ తింటే బాడీ వాటిని అరిగించుకోవడానికి చాలా కష్టపడుతుంది.
సైన్స్ ప్రకారం.. చపాతీలు, బ్రెడ్లలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి మన కడుపులోకి వెళ్లగానే గ్లూకోజ్‌గా మారిపోతాయి. పగలైతే మన పనుల వల్ల ఈ గ్లూకోజ్ ఖర్చయిపోతుంది. కానీ రాత్రి తిని పడుకుండిపోతాం కాబట్టి ఎనర్జీ అసలు ఖర్చవ్వదు.
దాంతో మన బాడీ ఈ ఎక్స్ట్రా గ్లూకోజ్‌ను ఏం చేయాలో తెలీక, డైరెక్టుగా ఫ్యాట్ రూపంలో పొట్టలోనే దాచిపెడుతుంది. ఇదే మెల్లగా పొట్ట చుట్టూ ఫ్యాట్ పెరగడానికి, బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది.
అంతేకాకుండా రాత్రి పూట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఫుడ్ తినడం వల్ల నిద్ర కూడా పాడవుతుంది. మనం పడుకున్నా సరే కడుపులో జీర్ణక్రియ జరుగుతూనే ఉండటం వల్ల గాఢ నిద్ర కరవవుతుంది.

నిద్ర సరిగ్గా లేకపోతే ఆ నెక్స్ట్ డే మెటబాలిజం రేటు ఇంకా పడిపోతుంది. పైగా రాత్రి చపాతీలు తిన్నవాళ్లకు బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగి మళ్లీ పడిపోతాయి. దీనివల్ల పొద్దున్నే లేవగానే విపరీతమైన నీరసం రావడం లేదా తెల్లవారుజాము నుంచే విపరీతమైన ఆకలి వేయడం స్టార్టవుతుంది. దీంతో నిద్ర డిస్టర్బ్ అవుతుంది.
అందుకే, రాత్రి పూట వెయిట్ పెరగకుండా హెల్దీగా ఉండాలంటే డిన్నర్లో చపాతీలు, బ్రెడ్ వంటి కార్బోహైడ్రేట్లను తగ్గించాలి. వాటికి బదులుగా ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయల సూప్‌లు, లేదా సలాడ్స్ వంటి తేలికపాటి ఫుడ్‌ను ఎంచుకోవాలి. అలాగే రాత్రి ఏడు గంటలలోపే డిన్నర్ పూర్తి చేసేయడం వల్ల తిన్న ఆహారం.. ఫ్యాట్‌గా మారకుండా ఎనర్జీగా మారుతుంది.
Alibaba : పెంటగాన్‌పై కోర్టుకు అలీబాబా.. ఆ రెండు దేశాల టెక్ వార్‌కు బలయ్యారా?





