Just CrimeJust NationalLatest News

Salman Khan : సల్మాన్ కేసులో బిగ్ ట్విస్ట్..అప్రూవర్‌గా మారతానంటున్న బిష్ణోయ్

Salman Khan : ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటికి.. గ్యాలక్సీ అపార్ట్‌మెంట్స్ బయట 2024 ఏప్రిల్ 14వ తేదీన బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపి పారిపోయారు.

Salman Khan

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల కేసులో తాజాగా ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్.. తానే లొంగిపోతానంటూ స్వయంగా ముంబై ప్రత్యేక కోర్టు తలుపు తట్టాడు. సల్మాన్ ఖాన్(Salman Khan) కాల్పుల కేసుకు సంబంధించిన నిజాలను వెలికితీయడంలో తాను విచారణాధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని, దీనికి అనుమతించాలని కోరుతూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు.

ప్రస్తుతం అన్మోల్ బిష్ణోయ్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఖైదీగా ఉంటున్నాడు. గతేడాది నవంబర్‌లో అమెరికా నుంచి ఇండియాకి ఇతడిని తీసుకువచ్చిన తర్వాత, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధించిన టెర్రరిస్ట్ అండ్ క్రిమినల్ నెట్‌వర్క్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) లారెన్స్‌ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఢిల్లీ జైలులో న్యాయ విచారణలో ఉండటంతో.. సల్మాన్ ఖాన్(Salman Khan) కేసు దర్యాప్తు కోసం ముంబై కోర్టులో హాజరు కావడానికి ప్రత్యేక ఆదేశాలను ఇవ్వాలని కోరాడు.

తీహార్ జైలు అధికారులకు తన ప్రొడక్షన్ వారెంట్ జారీ చేయాలని, కుదిరితే డైరెక్టుగా కానీ టెక్నాలజీ ద్వారా కానీ చివరకు వర్చువల్ విధానంలోనైనా అయినా తన రిమాండ్ ప్రక్రియను పూర్తి చేయాలని అన్మోల్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. తను వాలెంటర్‌గా లొంగిపోవడం వల్ల పోలీసుల దర్యాప్తు మరింత వేగవంతం అవుతుందని తన పిటిషన్‌లో అన్నాడు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు కీలక సాక్షుల వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేశారని అన్మోల్ గుర్తుచేశాడు. దీనిపై ప్రత్యేక న్యాయమూర్తి ఎస్.ఆర్.నవేందర్.. అన్మోల్ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలంటూ ప్రభుత్వ లాయర్‌ను ఆదేశించారు.

Salman Khan
Salman Khan

ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటికి.. గ్యాలక్సీ అపార్ట్‌మెంట్స్ బయట 2024 ఏప్రిల్ 14వ తేదీన బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా కూడా పెద్ద సంచలనాన్ని సృష్టించింది.

అయితే ఈ దాడి వెనుక లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఉందని ముంబై పోలీసులు నిర్ధారించారు. ఇప్పుడు ఈ కేసులో విక్కీ గుప్తా, సాగర్ పాల్‌తో పాటు మరికొంతమంది జైల్లో శిక్ష అనుభవిస్తుండగా.. అనుజ్ కుమార్ థాపస్ అనే నిందితుడు మాత్రం పోలీస్ కస్టడీలోనే చనిపోయాడు. ఈ కేసులో లారెన్స్ , అన్మోల్ ఇద్దరినీ కూడా పోలీసులు ప్రధాన నిందితులుగా ప్రకటించారు.

Electric Vehicles : పైపైకి పెట్రోల్, డీజిల్ ధరలు..ఈవీ మార్కెట్ మాత్రం డల్.. కారణాలివే

Related Articles

Back to top button