Strait of Hormuz : హర్మూజ్ జలసంధిలో అలజడి..అమెరికాకు మరోసారి ఇరాన్ సవాల్
Strait of Hormuz : తమ అనుమతి , నిబంధనలను కాదని ఏ నౌక వెళ్లినా సహించేది లేదంటూ ఇరాన్ సైన్యం ఇంతకు ముందు ఇచ్చిన హెచ్చరికలను తమ దాడుల ద్వారా నిజం చేసి చూపించింది.
Strait of Hormuz
ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు గుండెకాయ వంటి హర్మూజ్(Strait of Hormuz) జలసంధిలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన టెంపరరీ డిటెంట్ అగ్రిమెంట్ గడువు ముగిసిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ కీలక జలమార్గం రక్తసిక్తమైంది. ఒమన్ తీరానికి దగ్గరలో ప్రయాణిస్తున్న రెండు వాణిజ్య నౌకలపై.. ఇరాన్ సైన్యానికి చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) క్షిపణులతో దాడులు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది.
ఈ దాడిలో ఖతార్‌కు చెందిన గ్యాస్ ట్యాంకర్ అలాగే మరో నౌక కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్షిపణి తగలడంతో ఒక నౌకలో భారీగా మంటలు చెలరేగినట్లు అంతర్జాతీయ నౌకాయాన కంపెనీలు ధృవీకరించాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోయినా, ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు అన్న ఆందోళనను అందరిలో కలిగించింది.
అమెరికాతో కుదిరిన ఒక వారం రోజుల టెంపరరీ అగ్రిమెంట్ ముగిసిపోవడమే ఇరాన్ ఈ స్ఠాయిలో తెగబడటానికి ప్రధాన కారణం. ఇరాన్ దేశాధినేత అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దౌత్యపరమైన చర్చలు విఫలం కావడం ఒక రీజన్ అయితే, జలసంధిపై తమకున్న సర్వాధికారాలను నిరూపించుకోవాలనేది ఇరాన్ మెయిన్ ఎజెండా.
తాము సూచించిన మార్గంలో కాకుండా, అమెరికా నౌకాదళం సపోర్ట్‌తో ఒమన్ దేశ తీర మార్గం ద్వారా వెళ్తున్న నౌకలను ఇరాన్ టార్గెట్ చేసింది. తమ అనుమతి , నిబంధనలను కాదని ఏ నౌక వెళ్లినా సహించేది లేదంటూ ఇరాన్ సైన్యం ఇంతకు ముందు ఇచ్చిన హెచ్చరికలను ఈ దాడుల ద్వారా నిజం చేసి చూపించింది. అంతర్జాతీయంగా తమపై ఉన్న ప్రెజర్‌ను ఎదుర్కోవడానికి హర్మూజ్ జలసంధిని ఇరాన్ ఒక ఆయుధంగా వాడుకుంటోంది.
ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్‌ఫర్ అయ్యే మొత్తం ఆయిల్, సహజవాయువులలో సుమారు ఐదో వంతు అంటే 20 శాతం కేవలం ఈ హర్మూజ్ జలసంధి(Strait of Hormuz) ద్వారానే సాగుతుంది. కాబట్టి ఇక్కడ చిన్న గొడవ జరిగినా దాని ఎఫెక్ట్ డైరెక్టుగా ప్రపంచ దేశాల మార్కెట్లపై పడుతుంది. తాజా దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.
ఇది భారత్ వంటి ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి, దీని ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి దారితీస్తుంది. భద్రతా కారణాల వల్ల రవాణా సంస్థలు తమ నౌకలను ఇతర మార్గాల ద్వారా మళ్లించాల్సి రావడం వల్ల రవాణా ఖర్చులు, భీమా ప్రీమియంలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఈ పరిణామాలు ప్రపంచ స్థాయి వాణిజ్యాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టే అవకాశం ఉంది.

మరోవైపు అమెరికా ఇరాన్ దాడులపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇరాన్ సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు చేయడానికి అమెరికా సిద్ధమవుతున్నట్లు వస్తున్న నివేదికలు ఇప్పుడు గల్ఫ్ ప్రాంతాన్ని మరింత ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్‌ను హెచ్చరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఏ క్షణంలోనైనా పూర్తి స్థాయి యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Pesarappu Halwa:టేస్ట్‌తో పాటు బూస్ట్ ఇచ్చే పెసరపప్పు హల్వా.. మీరూ ట్రై చేస్తారా?





