T20 : చెత్తగా ఆడి…చిత్తుగా ఓడి…మూడో టీ20లో భారత్ ఓటమికి కారణాలివే ..
T20 : ఈ విజయంతో సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు 2-0 ఆధిక్యం దక్కింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా ఇంగ్లీష్ టీం సిరీస్ సొంతం చేసుకుంటుంది.
T20
ఇంగ్లాండ్ గడ్డపై భారత్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. మరోసారి సమష్టి వైఫల్యంతో మూడో టీ ట్వంటీ(T20)లో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. బౌలింగ్‌లోనే కాదు బ్యాటింగ్‌లోనూ చెత్త ప్రదర్శనతో ఘోర పరాజయం పాలయింది.
అసలు వరల్డ్ నెంబర్ వన్ టీమ్ నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవ్వరూ ఊహించలేదు. తాజాగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రవి బిష్ణోయ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ను ఒక దశలో భారత బౌలర్లు 160-170 పరుగులకే పరిమితం చేసేలా కనిపించారు. ఆరంభంలో ప్రిన్స్ యాదవ్ వికెట్లు తీసి అదరగొట్టాడు. అయితే తర్వాత ఇంగ్లాండ్ పార్టనర్ షిప్స్ బ్రేక్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. సాల్ట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి..44 బంతుల్లో 70 రన్స్ చేశాడు. సామ్ కరన్ కూడా 41 రన్స్‌తో రాణించడంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది.
తర్వాత చేజింగ్‌లో టీమిండియా చేతులెత్తేసింది. భారీ అంచనాలు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ మరోసారి కూడా నిరాశ పరిచాడు. అభిషేక్ , ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. భారత బ్యాటింగ్ పేకమేడలా కూలిపోయింది. పవర్ ప్లేలోనే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ త్వరగా పెవిలియన్ చేరడంతో భారత్ 52 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఇంగ్లాండ్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్‌ల పేస్, బౌన్స్‌ను భారత బ్యాటర్లు ఎదుర్కోలేకపోయారు. ఫలితంగా టీమిండియా కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు అవసరమైన భాగస్వామ్యాలు నిర్మించడంలో, రన్ రేట్‌ను అందుకోవడంలో జట్టు విఫలమైంది. మ్యాచ్‌లో ఏ దశలోనూ భారత జట్టు ఇంగ్లాండ్‌కు పోటీనివ్వలేకపోయింది.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో జట్టు సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. ఈ విజయంతో సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు 2-0 ఆధిక్యం దక్కింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా ఇంగ్లీష్ టీం సిరీస్ సొంతం చేసుకుంటుంది. అటు సిరీస్‌ను సమం చేయాలంటే భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ గెలిచి తీరాల్సిందే. బ్యాటింగ్ , బౌలింగ్‌లో ప్రదర్శన మెరుగు పరచుకోకపోతే మాత్రం సిరీస్ సమం చేయడం కష్టమే.
Advice : మీరూ అడగకపోయినా అడ్వైజ్‌లు ఇస్తున్నారా? అసలు ఉచిత సలహాలు ఇవ్వడం మంచిదేనా?





