Integrity : భాగస్వామిని భరించడం భారంగా ఉందా? బంధం గట్టిపడాలంటే ఈ 3 క్వాలిటీస్ ఉండాల్సిందే..
Integrity : రిలేషన్‌షిప్‌లో ఇద్దరూ ఒకరి గ్రోత్‌కు ఇంకొకరు తోడ్పడాలి. కలిసి ముందుకు వెళ్దాం అనే కాన్సెప్ట్‌తో ఒకరి ఆశయాలను మరొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, కొత్త విషయాలను నేర్చుకుంటూ సాగినప్పుడు ఆ బంధం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది కాబట్టి.. బోర్ కొట్టే అవకాశమే ఉండదు.
Integrity
ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం అందరిలో జరిగే విషయాలే కానీ ఆ బంధాన్ని కాలంతో పాటు ఏ ఇబ్బందులు లేకుండా కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్లడమే అసలైన సవాల్. ప్రేమలో పడ్డ కొత్తలో మనిషి మెదడులో డోపమైన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్లు విపరీతంగా రిలీజవుతాయి. దాంతో పార్ట్‌నర్‌లోని లోపాలు కూడా చాలా అందంగానే కనిపిస్తుంటాయి. దీన్నే సైకాలజీ భాషలో ది హనీమూన్ ఫేజ్ అని పిలుస్తారు.
అయితే ప్రేమలో కొన్నాళ్లు గడిచాక లేదంటే పెళ్లయ్యాక డైలీ లైఫ్ జీవితంలోని బాధ్యతలు, ఆర్థిక పరిస్థితులు, అలవాట్లు ఎదురయ్యేసరికి ఆ తొలిరోజుల్లో ఉన్న అట్రాక్షన్ తగ్గి, ఒకరి అసలైన వ్యక్తిత్వం ఇంకొకరికి కనిపిస్తుంది. అప్పటివరకు ఉన్న అట్రాక్షన్ తగ్గి అసలైన బాధ్యతలు లేదా పార్ట్‌నర్ గురించి పూర్తిగా అర్ధం అయ్యాక ఆ బంధం భారంలా అనిపిస్తుంది.
లవ్‌లో ఉన్నప్పుడు పార్ట్‌నర్ గురించి ఊహల్లో ఒక పర్ఫెక్ట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు. కానీ పెళ్లయ్యాక పార్ట్‌నర్ వారి ఆలోచనలకు భిన్నంగా ప్రవర్తించినప్పుడు తీవ్ర నిరాశ మొదలవుతుంది. దీనికి తోడు మొహమాటం లేని మాటలు , ఈగోలు , ఆశించడాలు వంటివి దూరాలను పెంచుతాయి. ఒక్కొక్కరు పెరిగిన వాతావరణం, అలవాట్లు చివరకి వారిద్దరి ఆలోచనా ధోరణి వేరుగా ఉంటాయి కాబట్టి వాటిని అంగీకరించలేకపోవడం వల్ల చిన్న విషయాలే పెద్ద గొడవలుగా మారుతుంటాయి.
అయితే ఈ సవాళ్లను ఫేస్ చేస్తూ పార్ట్‌నర్స్ మధ్య రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే సైకాలజీ ప్రకారం మూడు ముఖ్యమైన విషయాలు అత్యంత కీ రోల్ పోషిస్తాయి. అందులో మొదటిది ఇంటెగ్రిటీ(Integrity) అంటే నిజాయితీ.
ఇంటెగ్రిటీ(Integrity) అంటే కేవలం పార్ట్‌నర్‌ను మోసం చేయకపోవడం మాత్రమే కాదు, భాగస్వామి పక్కన లేనప్పుడు కూడా వారి పట్ల గౌరవంగా ఉండటం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అన్నమాట. ఇది పార్ట్‌నర్స్ మధ్య బలమైన నమ్మకాన్ని బిల్డ్ చేస్తుంది. రిలేషన్‌లో ఇద్దరూ నిజాయితీగా ఉన్నారన్న నమ్మకం వచ్చినపుడు వారి మధ్య ఎలాంటి అనుమానాలకు, భయాలకు తావుండదు.
ఇక రెండోది అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం లేదా బాధ్యత వహించడం. ఒక ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఇది నీ వల్లే జరిగిందని ఒకరిపై ఒకరు నెట్టుకోకుండా, తమ వైపు నుంచి ఏం తప్పు జరిగిందో ఆలోచించి ఒప్పుకోవడమే అకౌంటబిలిటీ. ఇలా తప్పును అంగీకరించే మైండ్‌సెట్ ఉన్నప్పుడు ఈగోలు పక్కకు వెళ్లి ప్రాబ్లెమ్ చాలా త్వరగా సాల్వ్ అవుతుంది. ఇది పార్ట్‌నర్‌కి మీపై ఉన్న గౌరవాన్ని వంద రెట్లు పెంచుతుంది.

ఇక మూడోది డిజైర్ టు గ్రో అంటే కలిసి ఎదిగే కోరిక. మనుషులు కాలంతో పాటు మారతారు. పాతికేళ్ల వయసులోనున్న ఆలోచనలు 30 ఏళ్లకు ఉండవు. కాబట్టి రిలేషన్‌షిప్‌లో ఇద్దరూ ఒకరి గ్రోత్‌కు ఇంకొకరు తోడ్పడాలి. కలిసి ముందుకు వెళ్దాం అనే కాన్సెప్ట్‌తో ఒకరి ఆశయాలను మరొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, కొత్త విషయాలను నేర్చుకుంటూ సాగినప్పుడు ఆ బంధం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది కాబట్టి.. బోర్ కొట్టే అవకాశమే ఉండదు.
ఈ పరిస్థితులను ఇంప్రూవ్ చేసుకోవాలంటే ముందుగా మీ పార్ట్‌నర్ మాత్రమే కాదు మీరు కూడా పర్ఫెక్ట్ కాదనే విషయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించాలి. వారితో పాటు వారి లోపాలను కూడా ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. పార్ట్‌నర్‌కు కూడా పర్సనల్ స్పేస్ ఇవ్వాలి.
AirPods With Camera : ఆపిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. చెవులకు కెమెరాలు పెడుతున్న ఆపిల్..





