Vinegar : కిచెన్, బాత్రూమ్ గోడలు తళతళ మెరిసిపోవాలా?.. ఈ సీక్రెట్ నాచురల్ హ్యాక్ మీ కోసమే..
Vinegar : వెనిగర్ స్ప్రే చేసే ముందు కొన్ని విషయాలు తెలియకపోతే గోడలు మెరవడం మాట పక్కన పెడితే, ఉన్న పెయింట్ కూడా పోయే ప్రమాదం ఉంటుంది.
Vinegar
మనం ఇల్లు ఎంత నీట్‌గా ఊడ్చినా, రోజు తుడిచినా కూడా కొద్దిరోజులకే గోడలన్నీ జిడ్డుపట్టి, మురికిగా తయారవుతూ ఉంటాయి. బయటికి నీట్‌గా కనిపించినా సరే.. వాటిపై సన్నటి దుమ్ము, తేలికపాటి మరకలు,తేమతో పాటు బ్యాడ్ స్మెల్ వచ్చే అవశేషాలు పేరుకుపోతూ ఉంటాయి.
ముఖ్యంగా వంటగదిలో ఆయిల్ మచ్చలు, బాత్రూమ్లో మొండి మరకలు మన ప్రశాంతతను పాడుచేస్తుంటాయి. మరి వీటిని శుభ్రంగా క్లీన్ చేయడానికి మార్కెట్లో దొరికే కెమికల్స్ వాడాలంటే.. పెయింట్ ఊడిపోతుందనే భయం వేస్తుంది. ఇలాంటి టైమ్‌లో పవర్ఫుల్ నాచురల్ ఆప్షన్ వైట్ వెనిగర్ అంటున్నారు నిపుణులు.
అయితే వెనిగర్(Vinegar) స్ప్రే చేసే ముందు కొన్ని విషయాలు తెలియకపోతే గోడలు మెరవడం మాట పక్కన పెడితే, ఉన్న పెయింట్ కూడా పోయే ప్రమాదం ఉంటుంది.
వైట్ వెనిగర్ అనేది అద్భుతమైన మ్యాజిక్ క్లీనరేమీ కాదు, కానీ మన డైలీ ఇంటి క్లీనింగ్ కోసం వాడే ఒక బెస్ట్ నేచురల్ రెమిడీగా వాడతారు. వెనిగర్‌లో ఉండే అసిటిక్ యాసిడ్ కొద్దిపాటి మురికిని, సబ్బు మార్క్‌ను, చేతి ముద్రలను, తేలికపాటి మరకలను చిటికెలో మాయం చేస్తుంది.

నీళ్లు, వైట్ వెనిగర్(Vinegar) ఈక్విల్ క్వాంటిటీలో తీసుకుని స్ప్రే బాటిల్లో కలిపి గోడలపై స్ప్రే చేయాలి. 2 నుంచి 5 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత మెత్తని క్లాత్‌తో తుడిస్తే దుమ్ము, మచ్చలు మొత్తం పోతాయి.
అయితే పెయింట్ దెబ్బతిన్న గోడలు, మార్బుల్, గ్రానైట్, వ్యాక్స్ పూత ఉన్నవాటిపై వెనిగర్ అసలు ఉపయోగించకూడదు. దీని ఆమ్ల స్వభావం వల్ల ఆ స్టోన్స్, పెయింట్ శాశ్వతంగా పాడైపోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా వెనిగర్‌ను బ్లీచింగ్ పౌడర్ , ఇతర బలమైన కెమికల్ క్లీనర్లతో కలపకూడదు. ఇలా చేస్తే ఘాటైన వాయువులు విడుదలయి ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది.
Transactional Relationship : కనుమరుగువుతున్న అనుబంధాలు.. ఖాళీ అవుతున్న కుటుంబ బంధాలు





