Just LifestyleLatest News

Dates: డయాబెటిస్ ఉన్నవారు ఖర్జూరం తినొచ్చా ..?

Dates: ఖర్జూరంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా? వర్షాకాలంలో తప్పక తినాల్సిన పండు ఇదే!

Dates

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఫలాల్లో ఖర్జూరం ఒకటి. అయితే రుచికి మాత్రమే పరిమితం కాకుండా, ఖర్జూరం మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. పండు రూపంలో ఉన్నా, ఎండిన డ్రై ఫ్రూట్ రూపంలో ఉన్నా.. దీని పోషక విలువలు ఏమాత్రం తగ్గవు. అందుకే దీనిని తరచూ మన ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఖర్జూరం ఎందుకు తినాలి, దాని వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఖర్జూరం తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలసటగా, నీరసంగా అనిపించినప్పుడు ఒకటి రెండు ఖర్జూరాలు తింటే చాలు, వెంటనే ఉత్సాహం వస్తుంది. వ్యాయామం చేసేవారు, శారీరక శ్రమ అధికంగా ఉన్నవారు దీనిని తీసుకోవడం వల్ల శక్తిని తిరిగి పొందవచ్చు. దీనిలోని సహజ చక్కెరలు శరీరానికి కావాల్సిన గ్లూకోజ్‌ను అందిస్తాయి.

Dates
Dates

ఖర్జూరం లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యలను నివారిస్తుంది. రోజూ కొన్ని ఖర్జూరాలు తినడం వల్ల ప్రేగుల కదలికలు మెరుగై, జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఒక మంచి ఔషధం. రోజూ కొన్ని ఖర్జూరాలు తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.

వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి ఖర్జూరం బాగా సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చిన్నపిల్లలకు రోజూ ఖర్జూరాలు తినిపించడం వల్ల వారు చురుకుగా ఉండటమే కాకుండా, వారిలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

చాలామంది డయాబెటిస్ రోగులు(dates for diabetics) ఖర్జూరం తినడానికి భయపడుతుంటారు. అయితే, ఖర్జూరంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే మితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ముఖ్యంగా ఎండు ఖర్జూరం తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Dates-diabetes
Dates-diabetes

ఖర్జూరం తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే, ఖర్జూరం తినడం వల్ల నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది. ఇందులో ఉండే పోషకాలు మెదడును శాంతపరిచి, మంచి నిద్రకు సహకరిస్తాయి. అందుకే ఈ అద్భుతమైన ప్రయోజనాల(Dates benefits)ను దృష్టిలో ఉంచుకొని, ఖర్జూరాన్ని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button