HealthLatest News

Fatty Liver : సైలెంట్ కిల్లర్ ఫ్యాటీ లివర్..అరగంట బ్రిస్క్ వాకింగ్‌తో లివర్ సేఫ్‌గా ఉంటుందా?

Fatty Liver : రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం వల్ల బాడీలోని ఫ్యాట్ బర్న్ అవ్వడమే కాకుండా, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది, బాడీలో ఇన్‌ఫ్లమేషన్ కంట్రోల్ అవుతాయి.

Fatty Liver

ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, గంటల తరబడి కూర్చుని చేసే ఆఫీస్ వర్క్, ఆయిలీ ఫుడ్స్, లైఫ్‌స్టైల్ చేంజెస్ వల్ల ఆల్కహాల్ అలవాటు లేకపోయినా కూడా.. ఈరోజుల్లో చాలామంది సైలెంట్‌గా ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు. స్టార్టింగ్‌లో ఎలాంటి పెయిన్ , సీరియస్ లక్షణాలు కనిపించవు. కాకపోతే లోపల లివర్‌లో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీనికి చెక్ పెట్టడానికి రోజూ కాసేపు స్పీడ్‌గా నడిస్తే చాలని..దీని వల్ల ఫ్యాటీ లివర్ రివర్స్ అవ్వడం స్టార్ట్ అవుతుందని మెడికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల కండరాలు బ్లడ్ నుంచి గ్లూకోజ్ అండ్ ఎనర్జీని ఎక్కువగా వాడుకోవడం స్టార్ట్ చేస్తాయి. దీనివల్ల బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ విపరీతంగా పెరిగి, షుగర్ లెవెల్స్ పర్ఫెక్ట్‌గా కంట్రోల్ అవుతాయి. లివర్‌ లోపల ఫ్యాట్ పేరుకుపోవడానికి కారణమయ్యే మెటబాలిక్ సమస్యలన్నిటికీ కూడా ఈ నడక బ్రేక్ వేస్తుంది.

రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం వల్ల బాడీలోని ఫ్యాట్ బర్న్ అవ్వడమే కాకుండా, కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది, బాడీలో ఇన్‌ఫ్లమేషన్ కంట్రోల్ అవుతాయి. లివర్ హెల్త్ కోసం వారానికి కనీసం 150 నుంచి 300 నిమిషాలు అంటే రోజుకు ఒక 30 నుంచి 45 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే మంచిది. లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, భోజనం తర్వాత కాసేపు స్లో వాకింగ్ లాంటి చిన్న చిన్న హాబిట్స్ కూడా పెద్ద చేంజ్ తెస్తాయి.

అయితే కేవలం వాకింగ్ చేసినంత మాత్రానే ఫ్యాటీ లివర్ మాయమైపోదు. మీ వెయిట్‌లో ఒక 5 శాతం తగ్గినా లివర్‌లోని ఫ్యాట్ తగ్గుతుంది. అదే 7 – 10 శాతం వెయిట్ లాస్ అవ్వగలిగితే లివర్ వాపు తగ్గి, ఆరంభంలో ఉన్న లివర్ డ్యామేజ్ కూడా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

అయితే వెంటనే వెయిట్ తగ్గకపోయినా సరే వాకింగ్ మాత్రం ఆపకూడదు. ఎందుకంటే వెయిట్ తగ్గకపోయినా వాకింగ్ వల్ల లివర్‌కు మేలు జరుగుతుంది. వాకింగ్‌తో పాటు తాజా పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, లీన్ ప్రొటీన్ ఉన్న డైట్ తీసుకోవాలి.

స్వీట్స్,కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్‌కు దూరంగా ఉండటం ముఖ్యం. వారానికి రెండు, మూడు సార్లు అయినా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ , రెసిస్టెన్స్ వర్కౌట్స్ చేస్తే కండరాలు స్ట్రాంగ్ అయ్యి గ్లూకోజ్ వాడకం మరింత బెటరవుతుంది.

Fatty Liver
Fatty Liver

ఫ్యాటీ లివర్ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించకపోయినా, రాను రాను ఇది ఫైబ్రోసిస్ , ఆ తర్వాత సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్ లేదా కాలేయ క్యాన్సర్ వంటి తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుంది.

అందుకే షుగర్, బీపీ, హై కొలెస్ట్రాల్ ఉన్నవారు లేదా ఆల్రెడీ ఫ్యాటీ లివర్ అని తేలినవారు రెగ్యులర్‌గా డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ బ్లడ్ టెస్టులు, స్కాన్లు చేయించుకోవడం మంచిది. మంచి నిద్ర, బ్యాలెన్స్‌డ్ డైట్, వాకింగ్ అన్నీ కనుక కలిసి పనిచేస్తే ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టడం చాలా ఈజీ అవుతుంది.

Sleep Over : పెరుగుతున్న స్లీప్ ఓవర్ కల్చర్..పిల్లలను ఫ్రెండ్స్ ఇంటికి అలా పంపడం సేఫేనా?

Related Articles

Back to top button