Just LifestyleLatest News

Homestay : ఖాళీ రూమ్‌ ఉంటే చాలు మనీ వర్షమే..హోమ్ స్టే తో లక్షల్లో ఆదాయం ఎలా అంటే..

Homestay : హోటల్స్‌లో చార్జీలు ఎక్కువగా ఉండటంతో పాటు ఒక రకమైన కమర్షియల్ ఫీలింగ్ వస్తుంది. అదే హోమ్ స్టే అయితే మన ఇంట్లో ఉన్నట్లే ప్రశాంతంగా ఉంటుంది పైగా హోమ్ మేడ్ ఫుడ్ దొరుకుతుంది.

Homestay

చాలామందికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అయితే ట్రావెల్ చేసేటప్పుడు హోటల్ రూమ్‌లలో ఉండటం కంటే సొంతింటి ప్రశాంతత, ఇంటి వంటలు కావాలనుకునే టూరిస్టుల సంఖ్య ఈ మధ్య కాలంలో మెల్లగా పెరుగుతూ వస్తుంది. ఈ కొత్త ఐడియా ఇప్పుడు ఒక పవర్‌ఫుల్ బిజినెస్ మోడల్‌గా మారిపోయింది. దాన్నే హోమ్ స్టే (Homestay) బిజినెస్ అంటారు.

దీని గురించి సింపుల్‌గా చెప్పాలంటే, టూరిస్టులు లేదా ప్రయాణికులు స్టార్ హోటళ్లలో కాకుండా, అక్కడే ఉంటున్న ఓ కుటుంబంతో కలిసి లేదా వారి ఇంట్లోనే ఒక భాగాన్ని అద్దెకు తీసుకుని ఉండే విధానం ఇది. కేవలం ఖాళీగా ఉన్న గదులతోనే నెలనెలా పాసివ్ ఇన్‌కమ్ ఇచ్చే బిజినెస్ అసలు ఎలా పనిచేస్తుంది? దీనికి ఉన్న క్రేజ్ ఏంటి అంటూ ఈ మధ్య నెట్ లోనూ తెగ వెతుకుతున్నారు.

నిజానికి ఈ బిజినెస్ కాన్సెప్ట్ అనేది చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. మీ సొంత ఇంట్లో ఖాళీగా ఉన్న బెడ్‌రూమ్‌లను కానీ లేదంటే విల్లా , ఊరిలోని పాత ఇల్లు ఇలా ఏదైనా ఉంటే వాటిని టూరిస్టుల కోసం నీట్‌గా సిద్ధం చేయడమే దీని మొదటి స్టెప్. కేవలం బెడ్, క్లీన్ వాష్‌రూమ్‌ ఇచ్చి ఊరుకోవడమే కాదు.. వచ్చేవారికి మన లోకల్ స్టైల్ వంటలు రుచి చూపించడం, ఆ ఏరియాలో చూడాల్సిన హిడెన్ అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి గైడెన్స్ ఇవ్వడం దీనిలో మెయిన్ పాయింట్.

దీనికోసం మీరు కల్పించే సదుపాయాలను ఎయిర్‌బీఎన్‌బీ( Airbnb),మేక్ మై ట్రిప్( MakeMyTrip), అగోడా (Agoda), బుకింగ్ డాట్ కామ్ (Booking.com ) వంటి పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో లిస్ట్ చేస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు డైరెక్టుగా లను బుక్ చేసుకుంటారు.

హోటల్స్ కంటే కూడా హోమ్ స్టేల వైపు టూరిస్టులు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే.. ప్రైవసీ అండ్ రీజనబుల్ ప్రైస్ ఉండటమే కారణం. హోటల్స్‌లో చార్జీలు ఎక్కువగా ఉండటంతో పాటు ఒక రకమైన కమర్షియల్ ఫీలింగ్ వస్తుంది. అదే హోమ్ స్టే అయితే మన ఇంట్లో ఉన్నట్లే ప్రశాంతంగా ఉంటుంది పైగా హోమ్ మేడ్ ఫుడ్ దొరుకుతుంది. మెయిన్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఐటీ ఎంప్లాయీస్, వీకెండ్ గేట్‌వే వెతికే కుటుంబాలు, సోలో ట్రావెలర్స్ హోటల్స్ కంటే హోమ్ స్టేలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు.

Homestay
Homestay

బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దీనికి లక్షలు, కోట్ల రూపాయల పెట్టుబడి అస్సలు అవసరం లేదు. కొత్తగా బిల్డింగ్‌లు కట్టాల్సిన పని కూడా ఉండదు. ప్రస్తుతం ఉన్న రూమ్‌లనే కలర్‌ఫుల్‌గా, హైజీనిక్‌గా మార్చి, ఏసీ, వైఫై వంటి బేసిక్ సదుపాయాలు కల్పిస్తే చాలు.

తెలుగు రాష్ట్రాలలో అయితే హైదరాబాద్ ,వైజాగ్ అరకు, కోనసీమ ప్రాంతాలలో ఈ బిజినెస్‌కి మైండ్ బ్లాకింగ్ డిమాండ్ ఉంది. కస్టమర్లకి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తూ, కంటిన్యూయస్‌గా డబ్బులు సంపాదించడానికి హోమ్ స్టే(Homestay) అనేది ఒక పర్ఫెక్ట్ అండ్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియాగా అందరిని అట్రాక్ట్ చేస్తోంది.

Rakhi Pournami : రాఖీ పౌర్ణమి 2026 ఆగస్టు 27నా? 28నా?.. ఆరోజే చంద్రగ్రహణం కాబట్టి రాఖీ కట్టొచ్చా?

Related Articles

Back to top button