Just LifestyleLatest News

Fridge Tips : ఫ్రిడ్జ్‌లో ఇవి పెడుతున్నారా? నిపుణులు చెప్తున్న షాకింగ్ నిజాలు..

Fridge Tips : మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆహారం దాని టేస్ట్‌ను, పోషకాలను కోల్పోవడమే కాకుండా కొన్ని రకాల బ్యాక్టీరియా చేరుతాయని, అది అనారోగ్యానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు

Fridge Tips

ఈ రోజుల్లో ఫుడ్ పాడవకుండా ఉండటంతో పాటు ఫ్రెష్‌గా ఉంచడానికి ఫుడ్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకెళ్లి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటాం. కానీ మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆహారం దాని టేస్ట్‌ను, పోషకాలను కోల్పోవడమే కాకుండా కొన్ని రకాల బ్యాక్టీరియా చేరుతాయని, అది అనారోగ్యానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఫ్రిడ్జ్‌లో ఏవి పెట్టకూడదు, ఏవి ఎలా స్టోర్ చేసుకోవాలో తెలుసుకోవాలని అంటున్నారు.

బంగాళాదుంపలను ఫ్రిడ్జ్‌లో అస్సలు ఉంచకూడదట. ఆలూని ఫ్రిడ్జ్‌లో ఉంచితే చల్లదనానికి వాటిలోని పిండిపదార్థం కాస్తా షుగర్‌గా మారిపోయి ఒరిజినల్ టేస్ట్ పోతుంది. అలాగే వెల్లుల్లిని పెడితే ఫ్రిడ్జ్‌ టెంపరేచర్ వల్ల తొందరగా మొలకలొచ్చి, లోపల రబ్బరులా మారి త్వరగా పాడైపోతుంది.

టమాటాలను కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకపోవడమే బెటర్. వాటిని పెట్టడం వల్ల వాటి నేచురల్ టేస్ట్ పోవడంతో పాటు విటమిన్-సి, పొటాషియం లెవెల్స్ తగ్గిపోతాయి. ఇక ఉల్లిపాయలను పెడితే వాటి లోపల ఉండే తేమ వల్ల మెత్తగా అయిపోయి బూజు పడతాయి.

తేనెను ఫ్రిడ్జ్‌లో పెడితే ఆ కూలింగ్‌కి గడ్డకట్టి స్పటికాల్లా మారిపోతుంది. అరటిపండ్లను పెడితే తొక్క నల్లగా మారిపోవడంతో పాటు పండు సరిగ్గా పండదు. అలాగే కోసిన పుచ్చకాయ ముక్కలను ఫ్రిడ్జ్‌లో అస్సలు పెట్టకూడదు. అలా పెడితే స్వీట్‌నెస్ తగ్గడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లను కోల్పోతాయి.

కాయకూరలను పెట్టినపుడు ముందుగా పేపర్‌లో చుట్టి, ఆ తర్వాత పాలిథిన్ కవర్‌లో పెడితే ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. నిమ్మకాయలను కవర్‌లో కాకుండా గాజు సీసాలో ఉంచాలి. అల్లం ఎప్పుడూ కూడా మూత తెరచి ఉంచాలి, లేదంటే ఫంగస్ వస్తుంది.

పచ్చిమిర్చి కాడలను, కొత్తిమీర వేళ్లను తీసేసి స్టోర్ చేసుకోవాలి. పనీర్, చీజ్ వంటి వాటిని అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి పెట్టాలి. మిగిలిపోయిన ఫుడ్‌ను ఎక్కువ రోజులు ఉంచకుండా ఒకటి రెండు రోజులలో తినేయడం మంచిది.

Fridge Tips
Fridge Tips

కనీసం నెలకోసారైనా ఫ్రిడ్జ్ ఖాళీ చేసి, లోపలి ట్రేలను నీట్‌గా కడిగి ఆరబెట్టాలి. కరెంట్ పోయినప్పుడు మరీ అవసరం ఉంటే తప్పు డోర్ తీయకపోవడమే బెటర్. రాత్రిపూట ఫ్రిడ్జ్ ఆఫ్ చేయడం వంటి పనులు చేయకూడదు. డోర్ సరిగ్గా వేయకపోతే కంప్రెసర్‌పై భారం పడి పవర్ బిల్లు ఎక్కువగా వస్తుంది.

ఫ్రిడ్జ్ క్లీన్ చేసే ముందు ప్లగ్ తీసేసి, గోరువెచ్చని నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా లేదా నిమ్మరసం కలిపి లోపల మెత్తటి క్లాత్‌తో క్లీన్ చేయాలి. ఫ్రిడ్జ్‌ డోర్ రబ్బర్ల వద్ద ఉండే మురికిని పాత టూత్ బ్రష్‌తో క్లీన్ చేయోచ్చు. బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక మూలన చిన్న గిన్నెలో బేకింగ్ సోడా లేదా కాఫీ పొడి ఉంచితే సరిపోతుంది.

Hanuman : పనులు జరగాలా? శత్రువుల పీడ వీడాలా? హనుమంతుడికి ఒక్కటి సమర్పిస్తే చాలు..

Related Articles

Back to top button