Just LifestyleLatest News

Camphor Hair Mask : జుట్టు చిట్లిపోతోందా? కర్పూరంతో ఇంట్లోనే వేసుకునే మ్యాజిక్ హెయిర్ మాస్క్..

Camphor Hair Mask : పూజల్లో వాడే కర్పూరంతో హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టుకు మంచి తేమ అందడమే కాకుండా, రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుందని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

Camphor Hair Mask

డస్ట్, పొల్యూషన్, మారిన లైఫ్‌స్టైల్ వల్ల బిగ్గెస్ట్ ప్రాబ్లెం జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్య ఈరోజుల్లో చాలామందిని వేధిస్తుంది. హెయిర్ గడ్డిలా మారిపోయి ఎంత కేర్ తీసుకున్నా యూజ్ లేదని బాధపడేవారికి ఒక సింపుల్ అండ్ పవర్ ఫుల్ నాచురల్ సొల్యూషన్‌ను ట్రై చేయమని చెబుతున్నారు బ్యూటీ ఎక్స్‌పర్ట్స్.

పూజల్లో వాడే కర్పూరంతో హెయిర్ మాస్క్(Camphor Hair Mask) వేసుకుంటే జుట్టుకు మంచి తేమ అందడమే కాకుండా, రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుందని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఖర్చు ఎక్కువ లేకుండా ఇంట్లోనే ఈ హెయిర్ మాస్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఈ హెయిర్ మాస్క్ తయారు చేసుకోవడానికి కర్పూరం పొడి, అలోవెరా జెల్, ఆముదం అలాగే విటమిన్ ఇ ఆయిల్ కావాలి. ముందుగా కర్పూరాన్ని మెత్తగా పొడిగా చేసుకోవాలి. కర్పూరం స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్‌ను విపరీతంగా బూస్ట్ చేసి, మూసుకుపోయిన హెయిర్ ఫాలికల్స్‌ను ఓపెన్ చేస్తుంది.

దీనివల్ల కొత్త జుట్టు రావడమే కాకుండా జుట్టు చిట్లిపోవడం, బలహీనపడటం తగ్గుతాయి. ఇక దీనికి తోడయ్యే అలోవెరా జెల్, ఆముదం, విటమిన్ ఇ ఆయిల్స్ జుట్టుకు కావాల్సినంత మాయిశ్చర్ అండ్ పోషణను అందిస్తాయి.

Camphor Hair Mask
Camphor Hair Mask

కర్పూరం పొడి, అలోవెరా జెల్, ఆముదం అలాగే విటమిన్ ఇ ఆయిల్‌ను ఒక గిన్నెలో వేసి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ప్యాక్‌లా అప్లై చేసి, ఒక పది నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది.

వారం వారం ఈ మాస్క్ వాడితే ఏ సీజన్లలో అయినా కూడా జుట్టు డ్రై అవ్వకుండా చాలా స్మూత్‌గా మారుతుంది. అయితే కర్పూరం వల్ల కొందరికి స్కిన్ ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, హెడ్ ప్యాక్ వేసే ముందు చిన్న ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.

Emotional Unpredictability : ఒకసారి క్లోజ్.. మరోసారి డిస్టెన్స్.. అర్థం కాని ప్రవర్తన వెనుక ఏముంది?

Related Articles

Back to top button