ISRO : ఇస్రో ప్రైవేటీకరణపై చైర్మన్ వి. నారాయణన్ రెస్పాన్స్..ఉద్యోగుల లేఖపై ఇస్రో బాస్ రియాక్షన్..
ISRO : కొద్ది రోజులుగా ఇస్రో పరిధిలోని ప్రొడక్ట్ తయారీ, మెయింటెనెన్స్ వంటి కీలక ఆపరేషన్లను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ISRO
భారతదేశ ప్రతిష్టను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన ఇస్రో త్వరలోనే ప్రైవేట్ సంస్థల చేతికి వెళ్తోందన్న వార్త తెగ వైరల్ అవుతోంది. దీంతో నిద్రాహారాలు మానుకుని మరీ అక్కడ ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్న వేలాది మంది సైంటిస్టులు, సిబ్బందిలో టెన్షన్ మొదలైంది.
అయితే ఈ హాట్ టాపిక్‌పై ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ తాజాగా కంక్లూజన్ ఇచ్చేశారు. ఆ రూమర్లన్నింటికీ కూడా ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌తో ఫుల్‌స్టాప్ పెట్టేశారు. ఇస్రో ఇప్పుడే కాదు ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ రంగ సంస్థగానే కంటిన్యూ అవుతుందని, దాన్ని ప్రైవేటీకరించే ఆలోచన తమకు లేనే లేదని స్పష్టం చేశారు. ఎంప్లాయిస్ ఆందోళనల్లో న్యాయం ఉందని, వాళ్ల ప్రతీ భయాన్ని తాము అర్థం చేసుకుంటామని అన్నారు.
కొద్ది రోజులుగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పరిధిలోని ప్రొడక్ట్ తయారీ, మెయింటెనెన్స్ వంటి కీలక ఆపరేషన్లను ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతోనే ఇకపై ఇస్రోలో తమ భవిష్యత్తు, జాబ్ సేఫ్టీ ఏమవుతుందంటూ.. సెప్టెంబర్ 4న ఇస్రోకు చెందిన తొమ్మిది ఎంప్లాయ్ యూనియన్లు ఏకమై..తమ యాజమాన్యానికి ఒక లెటర్ రాశాయి. అయితే ప్రైవేటీకరణపై తమకు క్లారిటీ ఇవ్వాలని ఎంప్లాయ్ యూనియన్లు డిమాండ్ చేయడం అలాగే కొంతమంది రిజైన్ చేసి వెళ్తుండటంతో ప్రైవేటీకరణపై అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది.
బెంగళూరులో అట్టహాసంగా ప్రారంభమైన 9వ స్పేస్ ఎక్స్‌పో (BSX) ఈవెంట్ ముగిసాక నారాయణన్ ఈ వివాదంపై రెస్పాండ్ అయ్యారు. ప్రస్తుతం ఇస్రోలో సుమారు 20 వేల మంది ఉద్యోగులు పని చేస్తుండగా, వారిలో ఏకంగా 8 వేల మంది టాప్ క్లాస్ సైంటిస్టులే ఉన్నారని చెప్పారు. అలాంటి పెద్ద ఆర్గనైజేషన్‌లో ఇయర్‌కి ఒక 150 మంది వరకూ రాజీనామా చేసి బయటకు వెళ్లడం చాలా కామన్‌గా జరిగే విషయమని క్లారిటీ ఇచ్చిన ఇస్రో బాస్.. దాన్ని ప్రైవేటీకరణ భయాలు, అనుమానాలతో ముడిపెట్టడం సరికాదంటూ తేల్చి చెప్పారు.
ఆరేళ్ల కాలంగా ఇస్రోలో ఇంటర్నేషనల్ లెవెల్ మార్పులు తీసుకురావడానికి ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. దీనిలో భాగంగానే ప్రైవేట్ స్టార్టప్‌లు, కార్పొరేట్ కంపెనీలను పార్ట్‌నర్‌లుగా చేసుకుంటున్నామే తప్ప.. ఉన్న ఇస్రోను అమ్మేయడం లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మన స్పేస్ రేంజ్‌ను గ్లోబల్ మార్కెట్‌లో టాప్‌లో నిలబెట్టడమే తమ టార్గెట్ అని, త్వరలోనే ఏడాదికి 50 రాకెట్ లాంచ్‌లు చేసే రేంజ్‌కు ఎదుగుతామనే ధీమా వ్యక్తం చేశారు.

ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న ఇన్-స్పేస్ (IN-SPACe) చైర్మన్ పవన్ గోయెంకా కూడా మాట్లాడుతూ, ఇండియా స్పేస్ సెక్టర్ చాలా స్పీడ్‌గా గ్రో అవుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణం, చంద్రయాన్-4 ప్రాజెక్ట్, అలాగే ప్రతిష్టాత్మక గగన్‌యాన్ వంటి పెద్ద ప్రాజెక్టులలో ఇస్రో అండ్ ప్రైవేట్ సెంటర్లు పక్కపక్కనే నిలబడి హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తాయని వివరించారు.
ఎన్ని రూమర్స్ వచ్చినా, ఉద్యోగుల లెటర్స్ కలకలం రేపినా.. ఇస్రో తన ఒరిజినాలిటీని, గవర్నమెంట్ బ్రాండ్‌ను కోల్పోదన్న విషయం.. ఈ క్లారిటీతో ప్రూవ్ అయింది. ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ అనేది కేవలం స్పీడ్‌ను పెంచే ఒక ఆక్సిలరేటర్ మాత్రమే అవ్వాలని.. మెయిన్ స్టీరింగ్ మాత్రం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుందని క్లారిటీ రావడంతో సైంటిస్టులు, సిబ్బందితో పాటు సామాన్యులు కూడా టెన్షన్ ఫ్రీ అయ్యారు.
Philosophy : పుస్తకాల్లో చదివితే సరిపోదు.. లైఫ్‌స్టైల్‌నే మార్చేసే 10 సూత్రాలు





