Country Chicken Egg Vs Farm Egg : నాటుకోడి గుడ్డు నాన్‌వెజ్.. ఫారమ్ గుడ్డు వెజ్ ఎందుకు? ఈ సైంటిఫిక్ సీక్రెట్ తెలుసుకుంటే ఫుల్ క్లారిటీ..
Country Chicken Egg Vs Farm Egg : గుడ్డులోని తెల్లసొన కేవలం ప్రోటీన్, వాటర్‌తో మాత్రమే తయారవుతుంది. పసుపుసొన (Egg Yolk)లో అయితే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.
Country Chicken Egg Vs Farm Egg
సండే వచ్చినా, మండే వచ్చినా రోజ్ ఖావో అండే అనే అడ్వర్టైజ్మెంట్ డైలీ చూస్తుంటాం. అయితే అసలు ఈ గుడ్డు శాకాహారమా? లేక మాంసాహారమా? అనే ప్రశ్న వస్తే మాత్రం ఇంట్లో పెద్దల నుంచి ఫ్రెండ్స్ వరకు ఆర్గ్యుమెంట్లు పీక్స్‌కి వెళ్లిపోతాయి. కానీ క్లారిటీ మాత్రం రాదు.
శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో నాన్‌వెజ్ బంద్ చేయాలనుకున్నపుడు..ఫారమ్ కోడి గుడ్డు తింటే పర్లేదు, అది ప్యూర్ వెజిటేరియన్.. నాటుకోడి ఎగ్ మాత్రమే నాన్‌వెజ్(Country Chicken Egg Vs Farm Egg) అని ఒక లాజిక్ చెబుతుంటారు. అసలు ఎగ్ వెజ్ ఎలా అవుతుంది? నాటుకోడి గుడ్డుకు, ఫారమ్ గుడ్డుకు(Country Chicken Egg Vs Farm Egg) ఉన్న ఆ తేడా ఏంటి? సైన్స్ దీనిపై ఏం చెబుతుందనే నిజాలను తెలుసుకుంటే కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోతుంది.
అసలు సైన్స్ పరంగా ఎగ్‌ను ఎలా చూస్తారో తెలిస్తే మన మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. మనం సాధారణంగా నాన్‌వెజ్ అంటే ఒక జీవి శరీరం నుంచి వచ్చే మాంసం, రక్తం, ఎముకలు లేదంటే ఆ జీవిని చంపి తినడాన్ని మాంసాహారం అంటాం. కానీ కోడి గుడ్డులో ఏ విధమైన మాంసం కానీ కండరాలు కానీ ఉండవు. పైగా గుడ్డులోని తెల్లసొన (Egg White) కేవలం ప్రోటీన్, వాటర్‌తో మాత్రమే తయారవుతుంది. పసుపుసొన (Egg Yolk)లో అయితే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.
మరి ఫారమ్ కోడి గుడ్డు వెజ్.. నాటుకోడి గుడ్డు(Country Chicken Egg Vs Farm Egg )నాన్‌వెజ్ అని ఎందుకు అంటారంటే ఇక్కడే అసలైన సైంటిఫిక్ మ్యాజిక్ ఉంది.పల్లెటూళ్లలో పెరిగే నాటుకోళ్లు (Free-range chickens) ఫెర్టిలైజ్డ్ గుడ్లును (Fertilised Eggs) ఇస్తాయి. అంటే కోడి పుంజు (Rooster)తో కోడిపెట్ట కలయిక జరిగాక పెట్టే గుడ్లు ఇవి. అందుకే ఈ నాటుకోడి ఎగ్లో జీవం(Life) ఉంటుంది. దానిని పొదిగితే దానిలోంచి నుంచి ఒక కోడిపిల్ల బయటకు వస్తుంది. అంటే ఆ ఎగ్లో ఒక జీవి పుట్టడానికి కావలసిన ప్రాణం ఉంటుందన్నమాట. అందుకే, ఒక జీవి పుట్టే అవకాశం ఉన్న నాటుకోడి ఎగ్స్‌ను నాన్‌వెజ్ కింద లెక్కేస్తారు.
ఇక పౌల్ట్రీ ఫారమ్‌లలో ఉండే ఫారమ్ కోళ్ల స్టోరీ వేరు. పొల్ట్రీ రంగంలో ..లేయర్ ఫారమ్‌లలో పుంజు లేకుండా కోడి పెట్టే అన్‌ఫెర్టిలైజ్డ్ (Unfertilized)ఎగ్స్‌ను కేవలం ఆహార అవసరాల కోసమే ఉత్పత్తి చేస్తారు. అక్కడ కేవలం కోడి పెట్టలు (Hens) మాత్రమే ఉంటాయి, అసలు పుంజుతో కలయికే ఉండదు.
సైన్స్ ప్రకారం.. కోడికి పుంజు తోడు లేకపోయినా కూడా అది నేచురల్‌గానే రోజువారీ ప్రాసెస్‌లో గుడ్లు పెడుతుంది. వీటిని అన్-ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ (Unfertilised Eggs) అంటారు. ఈ ఎగ్‌ను మీరు ఏళ్ల తరబడి పొదిగించినా కూడా అందులో జీవం లేకపోవడం వల్ల దాని నుంచి ఒక్క కోడిపిల్ల కూడా బయటకు రాదు.మన గల్లీలోని షాపుల నుంచి మొదలుకొని పెద్ద పెద్ద సూపర్మార్కెట్స్, హోటల్స్, కేఫ్‌ల వరకు మనం రోజూ చూసే ఎగ్స్ ఇవే. వీటిని కేవలం తినడానికి మాత్రమే పనికివస్తాయి. ఈ ఎగ్స్‌ను పొదిగించినా పిల్లలు రావు కాబట్టి, ఇవి నిల్వ ఉండే కాలం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.

ఇక బ్రీడర్ ఫారమ్‌లలో కోడి పుంజు, కోడి పెట్ట కలయిక వల్ల వచ్చే ఫెర్టిలైజ్డ్ (Fertilized) గుడ్లను మార్కెట్లో షాపులకు తెచ్చి అమ్మరు. ఎందుకంటే ఇవి చాలా ఖరీదు. వీటిని స్పెషల్‌గా కోడిపిల్లలను ఉత్పత్తి చేసే హాచరీల (Hatcheries)కు మాత్రమే కేటాయిస్తారు. అక్కడ మాత్రమే ఈ ఎగ్స్‌ను ఇంక్యుబేటర్ యంత్రాల్లో పెట్టి 21 రోజుల పాటు పొదిగించి వాటి నుంచి కోడిపిల్లలను బయటకు తీస్తారు.
కాబట్టి జీవం లేని ఫారమ్ ఎగ్‌ను పాలు, పెరుగులాగే ఒక నేచురల్ జంతు ఉత్పత్తిగా (Animal Product) భావిస్తూ సైంటిఫిక్‌గా వెజిటేరియన్ అని కేటగరైజ్ చేస్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు, న్యూట్రిషనిస్టులు మాత్రం ఎగ్‌ను ‘ఎగ్గెటేరియన్’ (Eggetarian) అనే స్పెషల్ కేటగిరీలో పెట్టారు. పాలు ఇవ్వడానికి ఆవును చంపాల్సిన అవసరం ఎలా ఉండదో.. ఫారమ్ ఎగ్ రావడం వల్ల ఒక జీవికి ఎటువంటి హానీ జరగదన్నది వారి లాజిక్. కాబట్టి ఇకపై ఎగ్ తింటున్నప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫుల్ ప్రోటీన్‌ను తింటున్నా అనుకుని ఎంజాయ్ చేసేయండి.
Potatoes In The Fridge : ఫ్రిడ్జ్‌లో ఆలుగడ్డలు పెడుతున్నారా? అయితే మీరిది తప్పకుండా చదవాల్సిందే..





