Just EntertainmentLatest News

AA23 Update : AA23 సర్‌ప్రైజ్ రీలోడెడ్.. బన్నీ పిక్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన లోకేష్..

AA23 Update : ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చాలా సీరియస్‌గా మాట్లాడుతున్న ఒక క్రేజీ ఫోటోను లోకేష్ పోస్ట్ చేశారు.

AA23 Update

పాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. సెన్సేషనల్ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) ఫేమ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ అనౌన్స్ అయిన ఆ క్షణం నుంచే సౌత్ ఇండియా మొత్తం డెడ్లీ కాంబో పేరు మార్మోగిపోయింది. అయితే కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, ఫిలిం నగర్ వర్గాల్లో ఈ(AA23 Update) ప్రాజెక్ట్ అనుకోకుండా ఆగిపోయిందంటూ రూమర్లు వినిపించాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ కాస్త కన్ఫ్యూజన్‌లో పడ్డారు. కానీ ఆ పుకార్లన్నింటికీ కూడా లోకేష్ తన స్టైల్‌లో ఒకే ఒక్క పిక్‌తో ఫుల్ స్టాప్ పెట్టారు.

సోమవారం తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చాలా సీరియస్‌గా మాట్లాడుతున్న ఒక క్రేజీ ఫోటోను పోస్ట్ చేశారు. దాంతో పాటు వెరీ సూన్ విత్ సం వెరీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ అంటూ ఒక క్యాప్షన్ జత చేశారు. ఇక అంతే.. క్షణాల్లో ఆ పోస్ట్ నెట్టింట తుపానులా వైరల్ అయిపోయింది. బన్నీ ఫ్యాన్స్ సైలెంట్‌గా ఉంటూనే.. మైండ్ బ్లాంక్ అయ్యే అప్‌డేట్ ఇచ్చారంటూ కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు.

ఈ 2026 జనవరిలో ఈ(AA23 Update) ప్రాజెక్ట్‌ అనౌన్స్ చేసిన సమయంలో..మేకర్స్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ అనౌన్స్‌మెంట్ వీడియోనే మూవీ రేంజ్ ఏంటో చూపించింది. ఒక సింహం నిలబడి ఉంటే, దాని చుట్టూ కొన్ని నక్కలు తిరుగుతూ కనిపించే విజువల్స్ చూసి ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. స్టోరీ ఏంటో పక్కాగా చెప్పకపోయినా, బన్నీని లోకేష్ ఏ లెవెల్లో చూపించబోతున్నారో ఆ ఒక్క షాట్‌తోనే క్లారిటీ వచ్చేసింది.

ఇప్పటికే బన్నీతో పుష్ప వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌ను అందించిన మైత్రీ మూవీ మేకర్స్.. ఈసారి లోకేష్ కనగరాజ్ కాంబోలో అంతకుమించి అన్నట్లుగా ప్లాన్ చేస్తోంది. ఇక మాస్ పల్స్ తెలిసిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

AA23 Update
AA23 Update

ప్రస్తుతం అల్లు అర్జున్.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రాకా’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీనిలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండటంతో వీరిద్దరి కాంబోపై చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

రాకా పనులు పూర్తయిన వెంటనే లోకేష్ .. బన్నీ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ లోపే అప్‌డేట్స్ ఇస్తామని లోకేష్ చెప్పడంతో.. ఎలాంటి సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారో అని ఇండస్ట్రీ వర్గాలు కూడా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Lokesh Kanagaraj (@lokesh.kanagaraj)

Srikanth Daughter Medha : టాలీవుడ్‌లో కొత్త క్రష్ ..ఇండస్ట్రీని షేక్ చేస్తున్న శ్రీకాంత్ కూతురు మూవీ అప్‌డేట్..

Related Articles

Back to top button