Gold Price : పసిడి ప్రియులకు పండుగ..తగ్గిన బంగారం,వెండి ధరలు
Gold Price : అక్టోబర్ 22న వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. 24, 22, 18 క్యారెట్ల పుత్తడి ధరలతో పాటు కేజీ వెండి ధరల అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ పూర్తి వివరాలు చూడండి.
Gold Price
కొన్ని రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపించిన గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు ఇప్పుడు కొద్దికొద్దిగా రిలీఫ్ ఇస్తున్నాయి. అక్టోబర్ 22న వరుసగా మూడో రోజు కూడా మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగొస్తుండటం కొనుగోలుదారులకు ఊరటనిస్తోందనే చెప్పాలి.
ఎన్నడూ లేని విధంగా ధరలు క్రాష్ అవ్వడంతో గోల్డ్ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈరోజు ఎమ్‌సీఎక్స్ (MCX) ఫ్యూచర్స్ మార్కెట్లో సిల్వర్ కాస్ట్ ఏకంగా రూ. 4,550 వరకూ తగ్గి, కేజీకి రూ. 204,618 వద్ద ట్రేడవుతోంది.
అలాగే 10 గ్రాముల పుత్తడి ధర కూడా రూ. 1,558 వరకూ క్షీణించి రూ. 144,521కి పడిపోయింది. ఇక గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే.. కామెక్స్‌లో (COMEX) పసిడి ధర ఔన్సుకు 4,109 డాలర్లకి చేరగా, వెండి ధర 2 శాతానికి పైగా తగ్గి ఔన్సుకు 56 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.
ఇక దేశీయ మార్కెట్లోకి వస్తే.. ప్యూర్ గోల్డ్ అని పిలిచే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌పై ఏకంగా రూ. 1700 వరకు కోత పడింది.జ్యువెలరీ తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 1550 వరకు దిగి రాగా, 18 క్యారెట్ల గోల్డ్ రేటుపై రూ. 1270 తగ్గింది.
ఈ భారీ తగ్గుదల తర్వాత భారత దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ కాస్ట్ రూ. 1లక్ష44వేల380 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1లక్ష32వేల350 వద్దకు చేరింది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1లక్ష08వేల290 వద్ద ట్రేడవుతోంది.
ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలతో పాటు ముంబైలో కూడా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం కాస్ట్ రూ. 1లక్ష44వేల380 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ రేట్(Gold Price) రూ. 1లక్ష32వేల350 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 1లక్ష44వేల530గాను, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1లక్ష32వేల500 వద్ద నమోదయింది.
మరోవైపు పసిడి బాటలోనే వెండి కూడా భారీగా కరిగిపోతోంది. మార్కెట్లో సిల్వర్ కాస్ట్ కూడా రికార్డు స్థాయిలో క్రాష్ అవుతూ కిలోపై ఏకంగా రూ. 5000 వరకు దిగి వచ్చింది. ఈ పతనం తర్వాత ఇప్పుడు కేజీ సిల్వర్ రేటు రూ. 2లక్షల25,000 వద్ద ట్రేడవుతోంది.
మధ్యప్రాచ్యంలో (Middle East) నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు ఎక్కడ భారీగా పెరుగుతాయోనన్న భయాల మధ్య గోల్డ్ రేట్లు(Gold Price) వారం రోజుల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు పెట్టుబడిదారులంతా నెక్స్ట్ వీక్ జరగబోయే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (US Fed) కీలక సమావేశంపైనే తమ దృష్టిని నిలిపారు.
ఏది ఏమైనా గోల్డ్ అండ్ సిల్వర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. షాప్‌కి వెళ్లే ముందు ఈ లేటెస్ట్ రేట్లను ఒకసారి చెక్ చేసుకోవడం చాలా మంచిది .





