Just Andhra PradeshJust PoliticalLatest News

AP Municipal Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికల డేట్ ఫిక్స్.. మైదుకూరు మినహా మిగిలిన చోట్ల ఎలక్షన్స్..

AP Municipal Elections : ఆంధ్రప్రదేశ్‌లోని 99 పట్టణ, నగర స్థానిక సంస్థలకు నవంబర్ 1 వ తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్ పత్రాల ధ్వంసం కారణాలతో మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా పడింది.

AP Municipal Elections

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల పోరు తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది.ఏపీ వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) షెడ్యూల్‌ను కన్ఫర్మ్ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 99 పట్టణ , నగర స్థానిక సంస్థల(AP Municipal Elections) కు నవంబర్ 1వ తేదీన పోలింగ్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది.

అయితే ఇదే సమయంలో కడప జిల్లాలోని మైదుకూరు మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం.. ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుని పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు తెరలేపింది. అలాగే నామినేషన్ల స్వీకరణలో ఆటంకాలు ఎదురవడంతో  కడప నగరపాలక సంస్థ, రాజంపేట, మైదుకూరు, తిరుపతి నగరపాలక సంస్థల్లోని కొన్ని వార్డులకు మాత్రం మరో అవకాశాన్ని  కల్పించారు. మైదుకూరులోని మొత్తం 32 వార్డులకు కొత్తగా నామినేషన్లు స్వీకరించనున్నారు.

అక్టోబర్ 23వ తేదీ, 24వ తేదీలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఇప్పటికే ప్రకటించిన కేంద్రాలతో పాటుగా సంబంధిత కలెక్టరేట్లలో కూడా నామినేషన్లు దాఖలు చేయొచ్చు

కొత్తగా దాఖలైన నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 25వ తేదీన ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కొత్తగా నామినేషన్ వేసిన కేండిడేట్స్‌కు మాత్రమే అదే రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు ఛాన్స్ ఉంటుంది.

తాజాగా  మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ల స్వీకరణ సాగుతుండగా భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నామినేషన్ కేంద్రంలోకి ప్రవేశించిన కొంతమంది వ్యక్తులు ఏకంగా 19 నామినేషన్ పత్రాలను చించివేసి ధ్వంసం చేయడంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేపింది.

పత్రాలు చించివేసిన సంఘటనపై మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదుతో క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత ప్రభావితమైన కేండిడేట్స్‌కు మళ్లీ నామినేషన్లు వేసే చాన్స్ ఇచ్చినా కూడా కేవలం ఒక్కరంటే ఒక్కరు మాత్రమే తిరిగి దాఖలు చేశారు. దీంతో అక్కడి పరిస్థితులు, జిల్లా కలెక్టర్ అందించిన పక్కా గ్రౌండ్ రిపోర్టును పరిశీలించిన ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా.. మైదుకూరు పోలింగ్‌ను టెంపరరీగా నిలిపివేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చారు.

మైదుకూరులో మళ్లీ కొత్తగా నామినేషన్ల ప్రాసెస్‌ను మొదటి నుంచి చేపడతామని, ఆ తర్వాతే అక్కడ పోలింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తామని ఎస్‌ఈసీ వెల్లడించింది. మైదుకూరును మినహాయించి మిగిలిన 99 పట్టణాల్లో నవంబర్ 1వ తేదీన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు(AP Municipal Elections) ముగిసేలా అధికారులు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

Pink Basket Dating : డేటింగ్ యాప్స్ ఓల్డ్ అయిపోయాయ్.. పింక్ బాస్కెట్ లవ్ స్టోరీస్ ట్రెండ్ అవుతున్నాయి..

Related Articles

Back to top button