Just EntertainmentJust PoliticalLatest News

Nara Lokesh : లోకేష్‌లోని ఈ యాంగిల్ చూశారా?జగపతి బాబు టాక్ షోలో రివీల్ చేసిన సీక్రెట్స్ ఏంటి?

Nara Lokesh : నారా లోకేష్‌లోని నయా యాంగిల్‌ను బయటకు లాగిన జీ తెలుగు 'జయమ్ము నిశ్చయమ్మురా' సీజన్ 2. జగపతి బాబు హోస్ట్‌గా చేసిన ఈ ఎపిసోడ్‌లో లోకేష్ పంచుకున్న ముచ్చట్లు, టెలికాస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.

Nara Lokesh

పాలిటిక్స్‌లో వ్యూహాలు, ప్రజా సమస్యలు,సమీక్షలు,సమావేశాలు, పొలిటికల్ విమర్శలతో ఎప్పుడూ చాలా సీరియస్‌గా కనిపించే లీడర్స్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఒకరు. యంగ్ లీడర్‌గా పార్టీ బాధ్యతలను మోస్తూ, ప్రభుత్వంలో కీలక శాఖలను పర్యవేక్షిస్తూ నిత్యం ప్రెస్ మీట్లు, టూర్లతో బిజీగా గడిపే లోకేష్‌లో ఒక సరదా, హుషారైన, వినోదాత్మకమైన యాంగిల్ కూడా ఉందనే విషయం చాలామందికి తెలీదు. సరిగ్గా ఆయనలోని ఆ అరుదైన, సరికొత్త డిఫరెంట్ యాంగిల్‌నే బుల్లితెరపై ఇంట్రడ్యూస్ చేశారు జగపతి బాబు.

వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు హోస్ట్‌గా జీ తెలుగులో సందడి చేస్తున్న ల్యాండ్‌మార్క్ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సీజన్ 2 కి నారా లోకేష్ స్పెషల్ గెస్ట్‌గా విచ్చేశారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ , ప్రోమో రిలీజ్ కాగా, దానిలో లోకేష్‌ను చూసి నెటిజన్లు, ఫ్యాన్స్ తెగ ఆశ్చర్యపోతున్నారు. దీనిలో రోజూ చూసే సీరియస్ పొలిటీషియన్ కాకుండా, సరదాగా కబుర్లు చెబుతున్న ఒక ఎనర్జిటిక్ గెస్ట్‌లా లోకేష్‌ను చూసి మురిసిపోతున్నారు

స్టేజ్ మీదికి వచ్చీ రాగానే జై బాలయ్య అంటూ మాస్ నినాదంతో రచ్చ లేపిన లోకేష్.. తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. చిన్నప్పుడు బడిలో అందరికంటే ఎక్కువగా దెబ్బలు తిన్న స్టూడెంట్ తానొక్కడినేనంటూ తన స్కూల్ రోజుల ముచ్చట్లను గుర్తు చేసుకుని అందరినీ నవ్వించారు.

అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ చాలా మొండి వారని.. అయినా కూడా ఒకరికి భయపడతారని ఒక సీక్రెట్ లీక్ చేసి ఎపిసోడ్‌పైనే క్యూరియస్‌ను పెంచేశారు. ప్రోమో ఎండింగ్‌లో ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అంటూ మావయ్య ఐకానిక్ డైలాగ్ చెప్పి హౌస్‌ని షేక్ చేశారు.

ఈ ప్రోమోతో ..పోలిటికల్ హీట్ నుంచి కాసేపు పక్కకు జరిగి, తనలోని మాస్, ఫన్ వేరియేషన్‌ను చూపించిన లోకేష్ ఈ ఎపిసోడ్‌లో ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవాలని పొలిటికల్, ఎంటర్‌టైన్‌మెంట్ వర్గాల్లో ఓ రేంజ్‌లో క్యూరియాసిటీ నెలకొంది. ఇక ఈ ఇంట్రస్టింగ్ ఎపిసోడ్ ఫేమస్ ఓటీటీ ‘జీ5’ (ZEE5) లో నవంబర్ 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుండగా, బుల్లితెర ఆడియన్స్ కోసం జీ తెలుగు ఛానల్‌లో నవంబర్ 8వ తేదీన రాత్రి 7.30 గంటలకు టెలికాస్ట్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Zee 5 Telugu (@zee5telugu)

Nominations Rejection : పరిషత్ పోరులో ఊహించని ట్విస్ట్‌లు.. ట్రెండింగ్‌లో నామినేషన్లు రద్దు అంశం..

Related Articles

Back to top button