Just NationalJust Andhra PradeshLatest News

First Flight : ఉత్తరాంధ్ర వాసులకు గుడ్‌న్యూస్.. భోగాపురం నుంచి ఢిల్లీకి మరో ఫ్లైట్

First Flight : భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆకాశ ఎయిర్‌లైన్స్ షెడ్యూల్ , పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

First Flight

ఉత్తరాంధ్ర ప్రజలకు ఆకాశ ఎయిర్‌లైన్స్ తీపి కబురు అందించింది. భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్టుగా కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నం (VTZ) లోని ప్రస్తుత ఎయిర్‌పోర్ట్ నుంచి ఇండిగో (IndiGo), ఎయిర్ ఇండియా (Air India) కంపెనీలు ఇప్పటికే ప్రతిరోజూ ఢిల్లీకి (Direct / Non-stop) విమాన సర్వీసులను నడుపుతున్నాయి.

ప్రముఖ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్స్ ఈ సర్వీసులను ఆదివారం అక్టోబర్ 25 నుంచి ప్రయాణికులకు సేవలు అందించడానికి సిద్ధమైంది. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి డైరెక్టుగా ఢిల్లీకి నడుస్తున్న మొట్టమొదటి విమాన(First Flight) సర్వీస్ ఇదే కావడంతో విశేషత సంతరించుకుంది.

ప్రతిరోజూ ఉదయం 6:00 గంటలకు ఢిల్లీలో టేకాఫ్ అయ్యే ఫ్లైట్, మార్నింగ్ 8:00 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత భోగాపురం నుంచి ఉదయం 8:30 గంటలకు తిరిగి అదే ఫ్లైట్ ఢిల్లీకి పయనం కానుంది. ఈ చారిత్రక సర్వీసులను గ్రాండ్‌గా లాంచ్ చేయడానికి ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

జీఎంఆర్ సీఈవో / సీసీఏఓ కన్వర్ బీర్ సింగ్ కారా, ఆకాశ ఎయిర్‌లైన్స్ మేనేజర్ భూపతిరాజు అచ్యుత రామరాజు ఈ ఫస్ట్(First Flight) ఈవెంట్‌కు హాజరై కేక్ కట్ చేసి, తొలి ప్రయాణికులకు స్వయంగా బోర్డింగ్ పాస్‌లు, టికెట్లు అందజేస్తారు. ఈ కొత్త కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర వాసులు, వ్యాపారస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Decision : లైఫ్‌లో సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారా? కన్ఫ్యూజన్‌కు ఇలా చెక్ పెట్టండి..

Related Articles

Back to top button