Weekend Episode : షాలినికి నాగార్జున మాస్ వార్నింగ్.. ముకేష్‌కు అదే రేంజ్లో క్లాస్
Weekend Episode : బిగ్ బాస్ 49వ ఎపిసోడ్లో షాలిని, రోహిత్‌ల ఓవరాక్షన్ పై నాగార్జున ఫైర్.. వర్షిణి, ముకేష్‌కు గట్టి వార్నింగ్.. వీకెండ్ ఎపిసోడ్లో రెచ్చిపోయిన షాలినికి నాగ్ మాస్ వార్నింగ్.. పూర్తి వివరాలు చదవండి.
Weekend Episode
తెలుగు రియాలిటీ బిగ్ బాస్ షో వీకెండ్ ఎపిసోడ్(Weekend Episode) వచ్చిందంటేనే హోస్ట్ నాగార్జున క్లాసులు, కంటెస్టెంట్స్ ఆట తీరుపై మాస్ వార్నింగ్‌లు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సీజన్లో హౌస్‌లో జరుగుతున్న గొడవలు, బూతులు, కొట్టుకోవడాలు అన్నీ బౌండరీలు దాటుతుండటంతో శనివారం రోజు 49వ ఎపిసోడ్(Weekend Episode)లో నాగార్జున కొందరిని ఆకాశానికి ఎత్తుతూ, మరికొందరి గ్లాస్లు పగలగొట్టి మరీ గట్టిగా క్లాస్ తీసుకున్నారు.
షో స్టార్టింగ్‌లో ఆడియన్స్‌తో ముచ్చటించిన నాగ్.. రోహిత్, షాలిని తీరుపై ప్రజాభిప్రాయాన్ని ప్రస్తావించారు. వాళ్లు హౌస్‌లో ఎంత చిల్లరగా ప్రవర్తిస్తున్నారనే వీడియోలు చూపించి మరీ..వీళ్లేనా మీకు నచ్చిందని ఆడియన్స్‌ని ప్రశ్నించారు. ఇక ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ జరగకపోవడంతో.. నెక్స్ట్ వీక్ హౌస్‌కి కెప్టెన్ ఉండరని, గ్రీన్ లెవల్లో ఉన్న నీతూ, త్రిగుణ్, దేబ్జానీ, ముకేష్ ఇంటి బాధ్యతలను సమానంగా పంచుకోవాలని బిగ్ బాస్ ఆదేశించారు.
నాగార్జున రాగానే అందరూ నిలబడినా, రోహిత్, షాలిని జంట మాత్రం సరిగ్గా రెస్పాండ్ అవకపోవడాన్ని అందరూ గమనించారు. ఆ తర్వాత నరేష్ ఆట తీరును, బిహేవియర్‌ను మెచ్చుకున్న నాగ్.. అతనికి కెప్టెన్ రూమ్ యాక్సెస్ ఇచ్చి బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇక అమన్ ఆటను పొగుడుతూ ఫస్ట్ గోట్ అని అభినందించి.. ఎంతమంది వెనక్కి లాగినా వెనకడుగు వేయొద్దని అన్నారు. దేబ్జానీ పట్టుదలని, నీతూ ఫస్ట్ వీక్ నుంచి చూపుతున్న జోరుని మెచ్చుకుంటూ.. వర్షిణితో పోల్చుతూ నీతూ తన భుజాలపై 32 కేజీల బరువు వెయిట్ మోయడాన్ని గుర్తు చేసి ప్రశంసించారు.
మరోవైపు ముకేష్ కూడా లిమిట్ దాటి మాట్లాడటం, శివ్ పర్సనల్ లైఫ్ గురించి అలాగే నీతూ ప్రొఫెషన్ గురించి తక్కువ చేసి కామెంట్లు చేయడంపై నాగ్ ఫైర్ అయ్యారు. ఏమైంది నీ క్యారెక్టర్.. ఇలాగే ఉంటే నీ పతనం మొదలవుతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక శివ వైల్డ్ ఫైర్‌లా ఆడుతున్నాడని మెచ్చుకుంటూ, కన్నీళ్లు పెట్టుకోవద్దని చెప్పారు.

నీతూని ఏం పీకావ్ అంటూ ఛాలెంజ్ చేసిన వర్షిణి గేమ్‌పైన కూడా నాగ్ ఫైర్ అయ్యారు. ఆమె మాట్లాడిన తీరుకు కోపగించుకుని టేబుల్ పై బాక్స్‌ని నేలకేసి కొట్టి.. కసిగా ఆడాలని హెచ్చరించారు. అలాగే రామ్‌ప్రసాద్‌ను షాలిని రీ-ఎంట్రీ గురించి అడగగా, ఆమె బిహేవియర్ మార్చుకోలేదని, ఆడియన్స్ ఓట్లతో వెళ్లిపోయిన మనిషి మళ్లీ రావడమే తప్పని అన్నాడు. దాంతో రామ్‌ప్రసాద్ గేమ్‌పైన కూడా నాగ్ అసంతృప్తి వ్యక్తం చేసి బాక్స్ బద్దలు కొట్టారు.
ఎలిమినేట్ అయి మళ్లీ వచ్చానంటూ హౌస్‌లో సింపతీ గేమ్‌లు మొదలు పెట్టిన షాలినికి నాగార్జున చుక్కలు చూపించారు. దక్షితో గొడవ పడుతూ బూతులు మాట్లాడిన వీడియోలను, అలాగే రూమ్‌లో దేబ్జానీతో దురుసుగా ప్రవర్తించిన వీడియోను ఒకదాని తర్వాత ఒకటి ప్లే చేసి గట్టిగా క్లాస్ పీకారు. నేషనల్ టెలివిజన్ అని మర్చిపోయి ముద్దులు, రొమాన్స్ చేయడం తప్పు కాదా అని సీరియస్ అయ్యారు.
దీంతో షాలిని ఇక తాను ఈ పెయిన్ భరించలేనని, బయటకు వెళ్లిపోతానని అంది. దీంతో డోర్స్ ఓపెన్ చేయమని నాగ్ చెప్పడంతో.. వెంటనే రోహిత్ హడలిపోతూ ఆమెను ఆపే ప్రయత్నాన్ని చేశాడు. దీంతో వెళ్తున్నావా? ఉంటున్నావా? అంటూ నాగార్జున గట్టిగా అడగడంతో, చివరికి షాలిని వెళ్లను సార్ అంటూ అక్కడే ఉండిపోయింది.
First Flight : ఉత్తరాంధ్ర వాసులకు గుడ్‌న్యూస్.. భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్





