Bigg BossJust EntertainmentLatest News

Bigg Boss Red Zone : బిగ్ బాస్ హౌస్‌లో మళ్లీ ఎలిమినేషన్ గండం..రెడ్ జోన్‌లో మొదలైన భయం

Bigg Boss Red Zone : బిగ్ బాస్ హౌస్‌లో బిగ్‌బాస్ హోటల్ టాస్క్ రసవత్తరంగా మారింది. సంచాలక్ త్రిగుణ్ కఠిన నిర్ణయం అలాగే బిగ్ బాస్ ఫైర్ అవ్వడంతో రెడ్ జోన్ హౌస్‌మేట్స్‌కు మళ్లీ డబుల్ ఎలిమినేషన్ భయం పట్టుకుంది.

Bigg Boss Red Zone

బిగ్ బాస్ రియాలిటీ షోలో బిగ్‌ బాస్‌ హోటల్ టాస్క్ అనుకోని విధంగా మలుపులు తిరుగుతోంది. ఎల్లో జోన్‌లో ఉన్న వారంతా ఓనర్లుగా, రెడ్ జోన్ మెంబర్లంతా వర్కర్లుగా మారి ఆడుతున్న ఈ గేమ్‌లో కంటెస్టెంట్ల మధ్య బ్యాలెన్స్‌ను టెస్ట్ చేయడానికి బిగ్ బాస్ ఒక ప్రత్యేక ఛాలెంజ్‌ను విసిరాడు.

అయితే ఈ గేమ్‌లో గెలిచిన వారికి మాత్రం ముందుకు వెళ్లే అవకాశాలు దక్కగా, ఓడిపోయిన రెడ్ జోన్(Bigg Boss Red Zone) టీమ్‌పై బిగ్ బాస్ సీరియస్ అవుతూ పెద్ద బాంబ్ పేల్చాడు. ఈ వీక్ కూడా రెడ్ టీమ్ నుంచి ఏకంగా ఇద్దరు హౌస్ మేట్స్ ఇంటి బాట పట్టక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేశాడు.

హోటల్ రెనోవేషన్‌లో భాగంగా ఇచ్చిన కమ్యూనికేషన్ టాస్క్‌లో హౌస్‌లో బాగా ఎంటర్టైన్‌మెంట్ ఇచ్చింది. దీనిలో ఓనర్లు సైగలు చేస్తుంటే వర్కర్లు వాటిని కరెక్టుగా పసిగట్టి బోర్డుపై అమర్చాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా నరేష్, ఝాన్సీ ఒక జంటగా, వర్షిణి, రోహిత్ మరొక జంటగా బరిలోకి దిగారు.

అయితే నరేష్ ఇస్తున్న సైగలను అర్థం చేసుకుని అన్నీ కరెక్ట్‌గా పెట్టాల్సిన ఝాన్సీ, ఏకంగా ఆ బోర్డునే నరేష్‌కి చూపించి అది సరిగ్గా ఉందా లేదా అని అడగడంతో బిగ్ బాస్‌ ఫుల్ సీరియస్ అయ్యాడు. అసలు గేమ్ రూల్స్ అర్థమయ్యాయా అని ప్రశ్నిస్తూ ఆట మధ్యలోనే ఆపేయాలంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దీనితో ఝాన్సీ చెప్పగా, సంచాలక్ త్రిగుణ్ మళ్లీ గేమ్‌ను స్టార్టింగ్ నుంచి షురూ చేశాడు.

Glowing Skin : గ్లోయింగ్ స్కిన్ కోసం క్రీములు మారుస్తున్నారా? యవ్వనాన్ని వెనక్కి తెచ్చే సీక్రెట్ ఇదే..

Related Articles

Back to top button