Elimination : బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని ఎలిమినేషన్..11వ వారంలో మాజీ కంటెస్టెంట్ల రీఎంట్రీ
Elimination : బిగ్ బాస్ పదో వారంలో శ్వేత ఎలిమినేట్ అయింది. అలాగే పదకొండో వారంలో రాబోతున్న డిక్టేటర్స్ థీమ్, మాజీ కంటెస్టెంట్ల రీఎంట్రీ.. మరింత మాస్ మసాలా యాడ్ చేయబోతోంది.
Elimination
బిగ్ బాస్ పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంతా అనుకున్నా కూడా శ్వేత ఒక్కరినే ఇంటి నుంచి బయటకు పంపి బిగ్ బాస్ టీం సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే వచ్చే వారం మాత్రం ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.
పదో వారంలో సుధీర్, రాంప్రసాద్, శ్వేత డేంజర్ జోన్లో ఉండగా, చివరకు శ్వేత ఎలిమినేట్(Elimination) అయినట్లు కింగ్ నాగార్జున ప్రకటించారు. దీంతో సుధీర్, రాంప్రసాద్ ఊపిరి పీల్చుకున్నారు. శ్వేత హౌస్ నుంచి బయటకు వెళ్తున్న సమయంలో అమన్ ఆమెను తలచుకుని కంటతడి పెట్టాడు.
స్టేజ్ మీదకు చేరుకున్న శ్వేత తన జర్నీని ఏవీని చూసి ఎమోషనల్ అయింది. ఆ తర్వాత నాగార్జున ఇచ్చిన స్పెషల్ టాస్క్‌లో భాగంగా సూపర్ మార్కెట్ నుంచి కొన్ని వస్తువులను సెలక్ట్ చేసి ముగ్గురు కంటెస్టెంట్లకు అంకితం చేస్తూ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
అమన్ గురించిన విషయాలు మాట్లాడిన శ్వేత, తను ప్యూర్ అండ్ ఇన్నోసెంట్ అని కత్తిని మనం పాజిటివ్‌గానూ, నెగెటివ్‌గానూ వాడతామని, కానీ తాను మాత్రం మంచి ఉద్దేశంతోనే ఈ సలహా ఇస్తున్నానని చెప్పింది. అందరి కోసం త్యాగాలు చేయడం మానేసి కాస్తంత స్వార్థంగా ఉండాలని, అప్పుడే ఆటలో రాణించగలవని అమన్‌కు చెప్పిన శ్వేత.. నువ్వే ఈ సీజన్ విన్నర్ కావాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది.
ఇక రెండో వస్తువుగా వేకప్ అలారమ్‌ను సెలక్ట్ చేసుకుంటూ దేబ్జానీకి కొన్ని సలహాలు ఇచ్చింది . గేమ్‌లో ఎక్కడా మీ సొంత వ్యక్తిత్వం, మీ ఓన్ డెసిషన్స్ కనిపించడం లేదని, ఎప్పుడూ రామన్న నీడలోనే ఉంటూ షీల్డ్‌లా వాడుకుంటున్నారని సెటైరిక్‌గా చెప్పింది. లేడీ కంటెస్టెంట్లలో మీరే మరింత స్ట్రాంగ్‌గా నిలబడాలని శ్వేత చెప్పగా, తాను ఇప్పటికే మేల్కొన్నానని, అసలైన గేమ్ ఇకపై చూపిస్తానని దేబ్జానీ ఆన్సర్ చెప్పింది.
తర్వాత స్టక్ రికార్డ్ అనే కాన్సెప్ట్‌ను సెలక్ట్ చేసుకుని ముకేష్ గేమ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ గేమ్‌ను మీ చేతులతోనే మీరు పాడుచేసుకుంటున్నారని, ఇతరులిచ్చే సలహాలను స్వీకరించి మీ గేమ్‌ను మార్చుకోవాలని చెప్పింది.
ఇక పదకొండో వారంలో డిక్టేటర్స్ అనే సరికొత్త థీమ్‌తో బిగ్ బాస్ హౌస్ రంజుగా మారబోతుందని నాగార్జున హింట్ ఇచ్చారు. దీనిలో భాగంగా గతంలో ఎలిమినేట్(Elimination) అయిన కంటెస్టెంట్లు మళ్లీ హౌస్‌లోకి అడుగుపెట్టి నామినేషన్స్ ప్రాసెస్‌ను నిర్వహిస్తారని తెలుస్తోంది.
మిథిలేష్, షాలినీ, అపూర్వ, ఝాన్సీ, చరణ్, రోహిత్, చైత్ర వంటి మాజీ కంటెస్టెంట్లు మళ్లీ వచ్చి వీరిని నామినేట్ చేయడమే కాకుండా, వారిలో కొంతమంది వన్ వీక్ పాటు హౌస్‌లోనే గెస్టులుగా ఉండి డిక్టేటర్లుగా వ్యవహరిస్తారని టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా పదకొండవ వారంలో రాబోతున్న ఈ డిక్టేటర్స్ థీమ్ హౌస్‌లో సరికొత్త రగడను క్రియేట్ చేయడం గ్యారంటీ అనిపిస్తోంది.
Office Politics : ఆఫీస్ పాలిటిక్స్.. ఆఫీసులో ఉండే ఆ 4 రకాల మనుషులు మీ దగ్గరా ఉన్నారా?





