Pre-Mature Aging : మీ చుట్టూ ఉన్నవారికి, మీ ఏజ్‌కు సంబంధం ఉందా? సైకాలజీ, కార్మిక్ రిలేషన్స్ చెప్పే షాకింగ్ నిజాలేంటి?
Pre-Mature Aging : మన చుట్టూ ఉండే మనుషుల ప్రభావం మన వయసు మీద పడుతుందా? మానసిక ఒత్తిడి, యవ్వనం తగ్గిపోవడం వెనుక సైకాలజీతో పాటు కార్మిక్ రిలేషన్స్ చెప్పే ఆశ్చర్యకరమైన నిజాలివే.
Pre-Mature Aging
కొంతమందితో మాట్లాడితే ఐదు నిమిషాల్లోనే చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. అదే మరికొంతమందితో ఒక్క రెండు నిమిషాలు ఉంటే చాలు ఆ రోజంతా నీరసం వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి అనుభవం మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది.
అసలు మన చుట్టూ ఉండే మనుషుల వల్ల మన ఏజ్, మన ఫేస్‌లోని ఆ గ్లో లేదా యవ్వనం ఎఫెక్ట్ అవుతాయా అంటే..అవును, కచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయని సైకాలజీతో పాటు కార్మిక్ సైన్స్ కూడా చెబుతోంది. ఇది ఏదో మనుషుల ఫీలింగ్, నమ్మకం మాత్రమే కాదు, దీని వెనుక సైన్స్, బయోలాజికల్ ప్రాసెస్, ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అనే నిజాలు ఉన్నాయి.
సైకాలజీ పరంగా దీనిని చూస్తే మనిషి కణాల్లో ఉండే టెలోమియర్స్ (Telomeres) అనే భాగాలు మనుషుల వయసును నిర్ణయిస్తాయి. మన చుట్టూ రోజూ ఏడుస్తూ, ప్రతిదానికీ నెగిటివ్ ఆలోచనలు నింపుతూ, విషం చిమ్మే మనుషులు (Toxic People) ఉంటే.. మన బ్రెయిన్ విపరీతమైన ప్రెజర్‌కు గురవుతుంది. దీనివల్ల బాడీలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా రిలీజవుతుంది.
ఈ కార్టిసాల్ డైరెక్టుగా మనిషిలోని సెల్స్‌పై అటాక్ చేసి ఆ టెలోమియర్ల పొడవును త్వరగా తగ్గించేస్తుంది. సైకాలజీలో దీనిని ప్రీ-మెచ్యూర్ ఏజింగ్(Pre-Mature Aging) అంటే రియల్‌గా ఉండే వయసు కంటే ముందే ఏజ్(Pre-Mature Aging) మీరిపోవడం కనిపిస్తుంది. నెగిటివ్ వైబ్స్ ఇచ్చే మనుషుల చుట్టూ ఉన్నప్పుడు మన బాడీలో సెల్స్ స్పీడ్‌గా క్షీణించడంతో..చర్మంపై త్వరగా ముడతలు రావడం, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడటం, ఫేస్ టోన్ తగ్గిపోవడం వంటివి కనిపిస్తాయి. అదే ప్రశాంతంగా, పాజిటివ్‌గా ఉండే మనుషుల మధ్య ఉంటే ఆక్సిటోసిన్, డోపమైన్ రిలీజయ్యి బాడీ నాచురల్‌గా యంగ్‌గా కనిపిస్తుంది.
ఇక సైకాలజీలోనే ఎమోషనల్ కాంటాజియన్ (Emotional Contagion) అనే వర్డ్ ఉంది. అంటే ఒకరి ఎమోషన్స్ వేరొకరికి వైరస్‌లా వ్యాపించడం అన్నమాట. మీ చుట్టూ ఉన్నవారు డల్ గా, డ్రామాలు ఆడుతూ ఉంటే తెలీకుండానే మీ మైండ్ కూడా అదే మోడ్‌లోకి వెళ్లిపోతుంది. దీనివల్ల మీబ్రెయిన్ తొందరగా డ్రెయిన్ అయిపోయి ముసలితనం ఛాయలు త్వరగా వస్తాయి.
మరొకవైపు కార్మిక్ సైన్స్ లేదంటే ఆధ్యాత్మిక కోణంలో చూస్తే..దీన్ని ఎనర్జీ వాంపైరిజమ్ (Energy Vampirism) అండ్ కార్మిక్ ఎక్స్ఛేంజ్ అంటారు. ప్రతి మనిషి చుట్టూ ఒక శక్తి వలయం(Aura) ఉంటుంది. మనం ఒకరితో క్లోజ్‌గా ఉన్నప్పుడు లేదంటే తరచూ వారితో టైమ్ సస్పెండ్ చేసినపుడు ఇద్దరి ఎనర్జీలు ఒకదానికొకటి ఎక్స్ఛేంజ్ అవుతాయి.
కార్మిక్ లాజిక్ ప్రకారం కొన్ని బంధాలు ఋణానుబంధంతో మన లైఫ్‌లోకి వస్తాయి. కొంతమంది వ్యక్తులు మన ప్రాణశక్తిని (Pranic Energy) పిండేయడానికే మన జీవితంలోకి వస్తారు. వారి దగ్గర కార్మిక్ నెగిటివిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, వారితో కలవడం వల్ల మీ పాజిటివ్ ఎనర్జీ వారి వైపు వెళ్లి, వారి నెగిటివిటీ మిమ్మల్ని ఆవరిస్తుంది. దీన్నే వాళ్ల చూపు లేదా వాళ్లతో రిలేషన్‌షిప్ వల్ల నా కళ అంతా పోయింది అని అంటుంటాం. కార్మిక్ రిలేషన్స్ సరిగ్గా లేనప్పుడు ఎవరిలో అయినా ఉత్సాహం, జీవకళ (Vitality) క్షీణించిపోతాయి.
అందుకే మన పెద్దవాళ్లు మన చుట్టూ సత్సంగం (మంచి వారి సాంగత్యం) ఉండాలని ఊరికే చెప్పలేదు. మనతో ఉంటూ మనకు ప్రశాంతతను పంచేవారు, మన ఎదుగుదలను చూసి సంతోషించేవారు ఉంటే మన ఆరా స్ట్రాంగ్‌గా మారి పాజిటివ్ వైబ్రేషన్స్‌తో పాటు యవ్వనం సుదీర్ఘకాలం పాటు నిలిచి ఉంటుందన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.
కాబట్టి త్వరగా మీ వయసు మీద పడకుండా(Pre-Mature Aging) ఉండాలంటే మంచి ఫుడ్, వర్కవుట్స్ ఎంత ముఖ్యమో.. మీ లైఫ్‌లో ఉన్న నెగిటివ్ పీపుల్‌ను పక్కన పెట్టడం కూడా అంతే ముఖ్యం. వైబ్ మ్యాచ్ అయితేనే బంధం కంటిన్యూ చేయండి.. లేకపోతే నమస్కారం అనుకుంటేనే మీ హెల్త్‌కీ, ఏజ్‌కీ, చివరకు మీ గ్రోత్‌కు అన్నింటికి మంచిది.
Rumours : రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేస్తారు? దీనిపై సైకాలజిస్టులు ఏం చెబుతున్నారు?





