Just Andhra PradeshLatest News

Akvan Cyclone : ఏపీకి అక్వాన్ తుపాన్ ముప్పు..నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం

Akvan Cyclone : అక్వాన్ పేరుతో పిలుస్తున్న ఈ తుపాన్.. ప్రస్తుతం చెన్నైకి 610 కి.మీ. మచిలీపట్నానికి 660 కి.మీ. విశాఖపట్నానికి 670 కి.మీ., ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Akvan Cyclone

ఆంధ్రప్రదేశ్ తీరం వైపు అక్వాన్ తుపాన్ ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుపానుగా బలపడి, గంటకు 10 కి.మీ. వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ఇరాన్ దేశం సూచించిన అక్వాన్ పేరుతో పిలుస్తున్న ఈ తుపాన్.. ప్రస్తుతం చెన్నైకి 610 కి.మీ. మచిలీపట్నానికి 660 కి.మీ. విశాఖపట్నానికి 670 కి.మీ., ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ తుపాన్ మంగళవారం సాయంత్రానికల్లా తీవ్ర తుపాన్‌గా రూపాంతరం చెంది.. ఆ తర్వాత మరింత బలపడి గురువారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మెల్లగా తీరం సమీపానికి వచ్చి శుక్రవారం మధ్యాహ్న సమయానికి నెల్లూరు , తుని మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుపాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కి.మీ. వేగంతో, గరిష్టంగా గంటకు 145 కి.మీ. వేగంతో అత్యంత బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది.

మంగళవారం సాయంత్రం నుంచి తుపాన్ ప్రభావంతో ఏపీలోని తీరప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ క్లారిటీ ఇచ్చింది. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా.. దానికి ఆనుకుని ఉన్న తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారనుండటంతో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అక్వాన్ తుపాన్(Akvan Cyclone) ముప్పుతో అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో అత్యవసర సమీక్షను నిర్వహించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

తుపాను సహాయక చర్యల కోసం, ఏవైనా అత్యవసర సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది.

మన మిత్ర వాట్సాప్ నంబర్: 9552300009
టోల్ ఫ్రీ / ఎమర్జెన్సీ నంబర్లు: 112, 1070, 18004250101
ఈ నెంబర్లను సంప్రదించి ప్రజలు ఎమర్జెన్సీ సాయం పొందొచ్చని అధికారులు వెల్లడించారు.

Pre-Mature Aging : మీ చుట్టూ ఉన్నవారికి, మీ ఏజ్‌కు సంబంధం ఉందా? సైకాలజీ, కార్మిక్ రిలేషన్స్ చెప్పే షాకింగ్ నిజాలేంటి?

Related Articles

Back to top button