Just InternationalJust NationalLatest News

US Student Visa : అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. డీహెచ్‌ఎస్ వీసా ఆంక్షల ప్రతిపాదన రద్దు

US Student Visa : అమెరికాలో విదేశీ స్టూడెంట్స్, జర్నలిస్టుల వీసా లిమిట్‌ను తగ్గించడానికి ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చిన ప్రతిపాదనను యూఎస్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది.

US Student Visa

అమెరికాలో హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్న లక్షలాది మంది విదేశీ విద్యార్థులతో పాటు ఇంటర్నేషనల్ జర్నలిస్టులకు అక్కడి న్యాయస్థానం పెద్ద ఊరట నిచ్చింది. విద్యార్థులు, స్కాలర్లు , డాక్యుమెంటరీ వీసాల కాలపరిమితిని స్ట్రిక్ట్ చేస్తూ ట్రంప్ యంత్రాంగం రూపొందించిన వివాదాస్పద కండీషన్లను అమెరికా ఫెడరల్ కోర్టు పూర్తిగా రద్దు చేసింది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS)వీసా ఆంక్షలపై తీసుకున్న డెసిషన్ పూర్తిగా చట్టవిరుద్ధమని, ఏకపక్షంగా ఉందంటూ ధర్మాసనం మండిపడింది. బోస్టన్ ఫెడరల్ న్యాయమూర్తి ఎఫ్. డెన్నిస్ సేలర్ దీనిపై తీర్పును వెలువరించడంతో ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.

అమెరికాలో హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతున్న లక్షలాది మంది విదేశీ విద్యార్థులతో పాటు ఇంటర్నేషనల్ జర్నలిస్టులకు అక్కడి న్యాయస్థానం పెద్ద ఊరట నిచ్చింది. విద్యార్థులు, స్కాలర్లు , డాక్యుమెంటరీ వీసాల కాలపరిమితిని స్ట్రిక్ట్ చేస్తూ ట్రంప్ యంత్రాంగం రూపొందించిన వివాదాస్పద కండీషన్లను అమెరికా ఫెడరల్ కోర్టు పూర్తిగా రద్దు చేసింది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS)వీసా ఆంక్షలపై తీసుకున్న ఈ డెసిషన్ పూర్తిగా చట్టవిరుద్ధమని, ఏకపక్షంగా ఉందంటూ ధర్మాసనం మండిపడింది. బోస్టన్ ఫెడరల్ న్యాయమూర్తి ఎఫ్. డెన్నిస్ సేలర్ దీనిపై తీర్పును వెలువరించడంతో ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.

గతంలో ట్రంప్ యంత్రాంగానికి చెందిన డీహెచ్‌ఎస్ (DHS) విభాగం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కు గరిష్టంగా 4 ఏళ్ల పరిమితిని మాత్రమే విధిస్తూ ప్రపోజెల్స్ రెడీ చేసింది. అంతకంటే ఎక్కువ కాలం అమెరికాలో కొనసాగాలంటే మళ్లీ స్పెషల్‌గా ఫెడరల్ పర్మిషన్‌ని పొందాలనే కండీషన్‌ను పెట్టింది.

అంతేకాకుండా విదేశీ జర్నలిస్టుల వీసా(US Student Visa) గడువును కూడా కొద్ది నెలలకే కుదించడంతో పాటు, ఎడ్యుకేషన్ ముగిసిన తర్వాత అక్కడ ఉండే గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించాలని కూడా సూచించింది. అయితే ఈ చర్యలు గ్లోబల్ స్టూడెంట్స్‌ను ను ప్రోత్సహించే కాంగ్రెస్ అసలు ఉద్దేశానికే గొడ్డలిపెట్టులా ఉన్నాయంటూ న్యాయస్థానం అభిప్రాయపడింది. వీసా(US Student Visa) వ్యవధిని దెబ్బతీసేంతగా బ్రాడ్ పవర్స్ ఏమీ కూడా డీహెచ్‌ఎస్‌కు చట్టం ఇవ్వలేదని స్పష్టం చేసింది.

ఈ కీలక తీర్పుపై వివిధ ఫారిన్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అలాగే ఇండియన్ అసోసియేన్ సంతోషం వ్యక్తం చేశాయి. అమెరికాలోని సైన్స్, టెక్నాలజీ , పరిశోధనా రంగాల భవిష్యత్తును కాపాడటంలో న్యాయస్థానం మళ్లీ కీలక పాత్ర పోషించిందంటూ ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ ప్రతినిధులు కొనియాడారు.

కాగా ఇప్పటి వరకూ ఇలాంటి కఠిన నిబంధనల వల్లే అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఫారిన్ స్టూడెంట్స్ జాయినింగ్స్ మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టాయని విద్యావేత్తలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుతో పాత పద్ధతిలోని డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానమే సేఫ్టీగా కొనసాగుతుందని విశ్లేషిస్తున్నారు.

Pre-Mature Aging : మీ చుట్టూ ఉన్నవారికి, మీ ఏజ్‌కు సంబంధం ఉందా? సైకాలజీ, కార్మిక్ రిలేషన్స్ చెప్పే షాకింగ్ నిజాలేంటి?

Related Articles

Back to top button