Sonia Gandhi : రాజీవ్ గాంధీ హత్య వెనుక పెద్ద కుట్ర? సోనియా గాంధీ బుక్‌తో మళ్లీ హీట్..
Sonia Gandhi : సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ ద్వారా బయటకు వచ్చిన ఈ నిజాలు, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు రాబోయే రోజుల్లో ఎలాంటి పొలిటికల్ కాన్సీక్వెన్స్కు దారి తీస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
Sonia Gandhi
భారత పొలిటికల్ హిస్టరీలో చెరగని విషాదంగా మిగిలిపోయిన.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య వ్యవహారం దశాబ్దాల తర్వాత మళ్లీ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ బిలాంగింగ్ (Belonging) పబ్లిషింగ్ సందర్భంగా ఈ అంశం మరోసారి నేషనల్ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ బుక్ ఆవిష్కరణ సందర్భంగా రిలీజ్ చేసిన ఒక స్పెషల్ వీడియోలో సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. దీనిలో రాహుల్ గాంధీ చేసిన కామెంట్లు అటు పొలిటికల్ వర్గాల్లో, ఇటు దేశవ్యాప్తంగా సరికొత్త కలకలాన్ని సృష్టిస్తున్నాయి.
తన తండ్రి రాజీవ్ గాంధీ(Sonia Gandhi) హత్య కేవలం ఎల్టీటీఈ (LTTE) చేసిన కుట్ర మాత్రమే కాదంటూ, ఆయనకు కల్పించాల్సిన భద్రతను ఉద్దేశపూర్వకంగానే తొలగించారంటూ రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజీవ్ గాంధీ పర్యటనల టైమ్‌లో భద్రతను ఉపసంహరించుకోవడం వల్లే హంతకులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని రాహుల్ చెప్పుకొచ్చారు.
ఇది కేవలం ఒక సాధారణ భద్రతా లోపం ఒకటే కాదని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే సంకేతాలను రాహుల్ కామెంట్లు తెలియజేసినట్లు అయిందన్న టాక్ నడుస్తోంది. అంటే అప్పటి రాజీవ్ భద్రతా మార్పులకు బాధ్యులెవరు, ఎవరి ఆదేశాలతో ఈ నిర్ణయాలు జరిగాయనే పాత ప్రశ్నలను ఈ ప్రకటన మళ్లీ తెర మీదకు వచ్చినట్లు అయింది.
1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎన్నికల ప్రచారంలో ఉన్న టైమ్‌లో రాజీవ్ గాంధీ(Sonia Gandhi) ఆత్మాహుతి దాడికి గురై దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై గతంలో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు విచారణ పూర్తి చేసి న్యాయపరమైన తీర్పులు వెలువరించినా, పొలిటికల్ మాత్రం అనుమానాలు పూర్తిగా నివృత్తి కాలేదు.
ఇప్పుడు సోనియా గాంధీ బుక్‌లో ప్రస్తావించిన అంశాలు, రాహుల్ కామెంట్లతో అప్పటి భద్రతా వ్యవస్థల తీరుపై మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం గాంధీ కుటుంబ వ్యక్తిగత భావోద్వేగానికి సంబంధించిన విషయం మాత్రమే కాకుండా, దేశ మాజీ ప్రధానమంత్రి భద్రతలోని లొసుగులకు సంబంధించిన ముఖ్యమైన రాజ్యాంగ అంశంగా మారిపోయింది.
ప్రస్తుతం సోనియా గాంధీ(Sonia Gandhi) ఆత్మకథ బిలాంగింగ్ ద్వారా బయటకు వచ్చిన ఈ నిజాలు, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు రాబోయే రోజుల్లో ఎలాంటి పొలిటికల్ కాన్సీక్వెన్స్కు దారి తీస్తాయనేది ఆసక్తికరంగా మారింది.మరి అప్పటి భద్రతా లోపాలపై మరిన్ని ఆధారాలు ఇప్పుడు బయటకు వస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది.





