Just EntertainmentLatest News

Box Office : బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్.. విశ్వంభర, ఫౌజీ, వారణాసి రిలీజ్ డేట్స్ చేంజ్?

Box Office : విశ్వంభర, ఫౌజీ, వారణాసి మూవీ రిలీజ్ డేట్స్‌పై లేటెస్ట్ బజ్ ఏంటి. మెగాస్టార్, ప్రభాస్, మహేశ్ బాబు చిత్రాల రిలీజ్ ప్లాన్లలో రాబోయే మార్పులేంటి?

Box Office

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొద్ది కాలంగా రీలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అనేది ఒక పెద్ద ట్రెండ్‌గా మారిపోయింది. అనౌన్స్ చేసిన డేట్‌కి సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావడంలో మేకర్స్ పడుతున్న తిప్పలు ఒక సమస్య అయితే, ఆ వాయిదాల ఎఫెక్ట్ వల్ల మిగిలిన సినిమాల షెడ్యూళ్లన్నీ తలకిందులవ్వడం మరో సమస్యగా మారిపోయింది.

ఎంతో ఆశగా తమ అభిమాన హీరో రిలీజ్ కోసం థియేటర్ వైపు చూసే ఫ్యాన్స్.. ఈ పోస్ట్‌పోన్ వార్తలు కొంత నిరాశను మిగుల్చుతున్నా, బాక్సాఫీస్(Box Office) వద్ద ఏ ఏ సినిమాలు పోటీ పడతాయోననే క్యూరియాసిటీ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. దీనిలో భాగంగానే రాబోయే ఏడాదిలో రిలీజ్ కావాల్సిన కొన్ని భారీ బడ్జెట్ సినిమాల డేట్లలో మళ్లీ ఊహించని ఛేంజెస్ జరగనున్నాయనే వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మెయిన్‌గా మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర గురించి ఒక ప్రచారం సాగుతోంది. ముందుగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ చేస్తారని భావించినా కూడా లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. విశ్వంభర మూవీని మార్చి 19న రిలీజ్ చేయాలని నిర్మాతలు ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సరిగ్గా ఇక్కడే ఇంకో ట్విస్ట్ నెలకొంది. ఇప్పటికే ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఫౌజీ మూవీ కూడా ఇప్పటికే మార్చి 19వ తేదీని లాక్ చేసేసుకుంది. దీంతో బాక్సాఫీస్(Box Office) వద్ద చిరంజీవి, ప్రభాస్ సినిమాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ తప్పదా అనే చర్చ మొదలైంది.

అయితే ఈ కథ ఇక్కడితోనే ఆగలేదు. ప్రభాస్ ఫౌజీ కూడా తన రిలీజ్ డేట్‌ను మార్చుకునే ఆలోచనలోనే ఉన్నట్లు మరో టాక్ కూడా వినిపిస్తోంది. మార్చి 19వ తేదీ నుంచి ఈ సినిమాను ఏప్రిల్ 7వ తేదీకి షిఫ్ట్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. కాకపోతే, ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏమిటంటే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న అడ్వెంచరస్ డ్రామా వారణాసి ఇప్పటికే ఏప్రిల్ 7వ తేదీపై కన్నేసి ఉంచింది. ఇప్పుడు ఫౌజీ కనుక అదే డేట్‌కు వస్తే, వారణాసి మూవీ రిలీజ్ మరికొంత కాలం ముందుకు జరుగుతుందా? లేదా ఈ 2 సినిమాలు పోటీ పడతాయా అనేది పెద్ద సస్పెన్స్‌గా మారింది.

ఒక మూవీ తప్పుకుంటే మరో పిక్చర్ ఆ డేట్‌ను సొంతం చేసుకోవడం, దానివల్ల మూడో చిత్రంపై ఎఫెక్ట్ పడటం టాలీవుడ్‌లో సరికొత్త లూప్‌లా మారిపోయింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ మూడు సినిమాల రిలీజ్ డేట్స్‌ మార్పులపై ఎలాంటి ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ ప్రకటన రాలేదు. అయినా కూడా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, కొద్ది రోజుల్లో రాబోయే ఈ బడా ప్రాజెక్టుల రిలీజ్ క్యాలెండర్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకోవడం మాత్రం గ్యారంటీగా కనిపిస్తోంది.

Garividi Lakshmi OTT : ప్రైమ్ వీడియోలో గరివిడి లక్ష్మి స్ట్రీమింగ్..ఆనంది కెరీర్‌లోనే ఇది మరో గట్టి సినిమా..

Related Articles

Back to top button