Rock: 137 టన్నుల రాయిని ఒక్క వేలితోనే కదిలించొచ్చట.. ఏంటా సీక్రెట్?
Rock: ఈ రాయిని చూడటానికి..దాన్ని తాకి కదిలించడానికి టూరిస్టులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ అద్భుతం వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం.

Rock
ప్రపంచంలో మనల్ని ఆశ్చర్యపరిచే విషయాలు ఎన్నో. అలాంటి వాటిలో ఒకటి ఫ్రాన్స్‌లోని హుయెల్‌గోట్ ఫారెస్ట్‌లో ఉన్న “ట్రెంబ్లింగ్ రాయి” (La Roche Tremblante). ఈ రాయి 137 టన్నుల బరువుతో, సుమారు 7 మీటర్ల పొడవు ఉన్నా కూడా, కేవలం ఒక వేలితోనే కదిలించవచ్చు. నమ్మడం లేదా? కానీ ఇది నిజం! ఈ రాయి(rock)ని చూడటానికి..దాన్ని తాకి కదిలించడానికి టూరిస్టులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ అద్భుతం వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం.
సైజులో పెద్దగా ఉన్నా కూడా ఈ రాయి (rock)ఎందుకు ఈజీగా కదులుతుందంటే..ఈ రాయి(Rock)కి కింద భాగంలో ఒక చిన్న అంచు మాత్రమే ఉంటుంది. వందల ఏళ్ల నదీ ప్రవాహం, ప్రకృతి శక్తుల కారణంగా ఈ రాయి ఒక అద్భుతమైన సమతుల్యతను సాధించింది. ఇది చాలా తక్కువ పట్టుతో బేస్ మీద నిలబడి ఉంటుంది.

నిర్దిష్ట స్థానంలో వేలితో కానీ, చేత్తో కానీ నెడితే, ఎంతటి చిన్న పిల్లలు అయినా దీన్ని సులభంగా కదిలించవచ్చు. రాయి ఆకారం, అది నిలబడిన కోణం, దాని భారీ బరువు – అన్నీ కలిసి ఈ అద్భుతమైన యాంత్రిక స్థిరత్వాన్ని కలిగించాయి.
పర్యాటకులు ఈ రాయిని చూసి ఆశ్చర్యపోవడమే కాదు, దాన్ని కదిలించి తమ బలాన్ని పరీక్షించుకోవడానికి కూడా ఉత్సాహం చూపిస్తారు. ఈ రాయిని కదిలించడంలో చాలా మంది విజయవంతం అవుతారు.
ఈ ఫారెస్ట్‌లో “ట్రెంబ్లింగ్ రాయి”తో పాటు, 200 టన్నుల “మష్రూమ్” ఆకారపు రాయి, పురాణాలు చెప్పే “హెల్ యొక్క గుహ”,, “కింగ్ ఆర్థర్ గుహ” వంటి మరికొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి.
ఈ రాయిని తాకి కదిలించడం కేవలం ఒక చిన్న సవాల్ మాత్రమే కాదు, అది అందరికీ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంతో పాటు..ఎంత బలవంతులని నిరూపించుకునే అవకాశాన్ని ఇస్తుంది. అందుకే ఈ అద్భుతాన్ని చూసేందుకు వచ్చే టూరిస్టుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.