HealthJust LifestyleLatest News

Brain tumor:ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు..బ్రెయిన్ ట్యూమర్ కావొచ్చు

Brain tumor: అంతేకాకుండా, మొబైల్ ఫోన్లు వంటి గాడ్జెట్‌లు కూడా బ్రెయిన్ ట్యూమర్ కి కారణం కావచ్చు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

Brain tumor

మనిషి శరీరంలోని అన్ని అవయవాల నియంత్రణ అంతా మెదడు నుంచే జరుగుతుంది. అలాంటి కీలకమైన మెదడులో కణితి (ట్యూమర్) ఏర్పడటం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మెదడులోని ఏదైనా భాగంలో కణాలు అసాధారణంగా పెరగడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడుతుంది.

బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుందనే నిర్దిష్ట కారణం ఇంకా పూర్తిగా తెలియదు. అయితే, ఎక్స్‌-కిరణాలు వంటి రేడియేషన్‌కు ఎక్కువ కాలం గురికావడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉందని చాలామంది వైద్య నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా, మొబైల్ ఫోన్లు వంటి గాడ్జెట్‌లు కూడా దీనికి కారణం కావచ్చు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

బ్రెయిన్ ట్యూమర్(brain tumor) లక్షణాలు మెదడులోని ఏ భాగంలో కణితి ఉందో దానిపై ఆధారపడి మారుతూ ఉంటాయి. సాధారణంగా కనిపించే లక్షణాలలో తీవ్రమైన తలనొప్పి, వాంతులు, మూర్ఛలు, దృష్టి సమస్యలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో, నడవడం, మాట్లాడటం, లేదా అనుభూతి చెందడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.

Brain tumor
Brain tumor

బ్రెయిన్ ట్యూమర్‌(brain tumor)ను గుర్తించడానికి వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో ముఖ్యమైనవి MRI, CT స్కాన్, ఆంజియోగ్రామ్, న్యూరలాజిక్ పరీక్షలు. వీటితో పాటు కొన్నిసార్లు స్పైనల్ ట్యాప్ వంటి పరీక్షలు కూడా చేయవచ్చు.

బ్రెయిన్ ట్యూమర్‌(brain tumor)కు అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.రేడియోథెరపీ..ఈ పద్ధతిలో కణితిని అధిక శక్తి కిరణాల రేడియేషన్‌తో చంపుతారు.

కీమోథెరపీ.. క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి యాంటీ-క్యాన్సర్ మందులను శరీరానికి సరఫరా చేస్తారు. వెంట్రిక్యులర్ పెరిటోనియల్ షంట్.. మెదడు లోపల అదనంగా పేరుకుపోయిన ద్రవాన్ని బయటకు పంపడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.

బ్రెయిన్ ట్యూమర్ అనేది ప్రాణాంతకం కావచ్చు, కానీ సరైన సమయంలో గుర్తించి, చికిత్స అందిస్తే కొంతమంది దీని నుంచి బయటపడగలుగుతారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైద్య సలహా తీసుకోవడం ముఖ్యం.

Beer : బీర్ లవర్స్‌కు పండుగే..రూ.90 కోట్లతో క్యాన్డ్ బీర్ ప్లాంట్..ప్లేస్ కూడా ఫిక్స్..!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button