Just International

Trump: ట్రంప్ నోట మళ్లీ పాత పాటే..ఎందుకీ మైండ్ గేమ్?

Trump: ట్రంప్ వ్యాఖ్యలను చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఒక మైండ్‌గేమ్ లేదా పొలిటికల్ పొజిషనింగ్ గా భావిస్తున్నారు.

Trump

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)మరోసారి నోరు పారేసుకున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు, వాటిని తాను ఆపానని, వాణిజ్య ఒప్పందాలను అడ్డుకుంటానని హెచ్చరించడం వల్లనే శాంతి కుదిరిందని తాజాగా మీడియాతో ట్రంప్ చెప్పడం మరోసారి హాట్ టాపిక్ అయింది.

ట్రంప్ తన ఇంటర్వ్యూలలో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర విద్వేషం ఉంది. నేను ప్రధాని మోదీతో మాట్లాడాను.. ట్రేడ్ ఉండదు, యుద్ధం పెడితే భారీ టారిఫ్‌లు ఉంటాయని చెప్పాను. పాకిస్థాన్ నాయకులతోనూ ఇదే విషయాన్ని చెప్పి, ఒక రోజులో నిర్ణయం తీసుకోమని అన్నాను. తాను ఫోన్ చేసిన 5గంటలకు యుద్ధం ఆగిందని వివరించారు.

Animated series: 9.1 రేటింగ్ తో రికార్డులు..మహావతార్ నరసింహ’కు ఏమాత్రం తగ్గని యానిమేటెడ్ సిరీస్

ట్రంప్ వ్యాఖ్యలను చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఒక మైండ్‌గేమ్ లేదా పొలిటికల్ పొజిషనింగ్ గా భావిస్తున్నారు. ట్రంప్ తనను తాను ప్రపంచ నాయకుడిగా, శాంతి స్థాపకుడిగా చూపించుకోవడానికి ఇలాంటి వాదనలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ట్రంప్(Trump) ప్రపంచ నాయకుడిగా తనను నిరూపించుకోవడానికి.. ప్రపంచంలో ఏ పెద్ద సమస్య వచ్చినా అది అమెరికా ఒత్తిడి వల్లే పరిష్కారమైందని చూపించడం ద్వారా తన నాయకత్వ ప్రతిభను పెంచుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రపంచ స్థాయిలో మద్దతు, గౌరవం పొందడానికి ఆయన అనుసరిస్తున్న స్ట్రాటజీ.

Trump
Trump

అమెరికా ఓటర్లను ఆకట్టుకోవడానికి పదేపదే ఇలా చెబుతూ వస్తున్నారు. దేశీయ రాజకీయాల్లో, ముఖ్యంగా ఎన్నికల సమయంలో “నేను యుద్ధాలను ఆపాను” అని ప్రచారం చేసుకోవడం ద్వారా అమెరికన్ ఓటర్లలో తన పట్ల నమ్మకాన్ని, ఆధిపత్యాన్ని పెంచుకోవడమే ట్రంప్ ప్రధాన లక్ష్యమని విశ్లేషకులు చెబుతున్నారు.

పబ్లిక్ ఇమేజ్ పెంపు కోసం అంటే నోబెల్ శాంతి బహుమతి వంటి అంతర్జాతీయ పురస్కారాలు పొందడానికి, సమాజంలో శాంతియుత నాయకుడిగా తన ప్రతిష్టను పెంపొందించుకోవడానికి ఆయన తన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

ట్రంప్(Trump) ఆరోపణలను భారత ప్రభుత్వం గతంలోనే ధీటుగా ఖండించింది. భారత విదేశాంగ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం, మరియు సైనిక డైరెక్టర్ జనరల్స్ (DGMO) అధికారులు “ఇరు దేశాల మిలిటరీ అధికారుల మధ్య జరిగిన చర్చల ఫలితంగానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది, దీనిలో ఏ మూడవ వ్యక్తి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ కూడా పార్లమెంటులో ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు.

భారత విదేశాంగ శాఖ అధికారులు మాత్రం అసలు అప్పుడు మోదీ-ట్రంప్(Trump) మధ్య ఫోన్ సంభాషణ లేదు, వాణిజ్య ఒప్పందాల గురించి చర్చ జరగలేదని వివరించారు. ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవాలకు విరుద్ధం. భారత్ తన నిర్ణయాలను సైనిక స్థాయిలో స్వతంత్రంగా తీసుకుందని తేల్చి చెప్పారు. .

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button