Prime Minister Modi:ప్రధాని సరికొత్త రికార్డ్.. ట్రంప్‌ని దాటిపోయిన మోదీ..
Prime Minister Modi:జపాన్ ప్రధాని, అర్జెంటీనా అధ్యక్షులు తర్వాతి స్థానాల్లో ఉండగా, ట్రంప్ 43 శాతం రేటింగ్‌తో 11వ స్థానం సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Prime Minister Modi
ప్రపంచ అగ్రరాజ్యాల అధినేతలకు కూడా సాధ్యం కాని విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Modi).. సోషల్ మీడియా వేదికగా సరికొత్త చరిత్ర సృష్టించారు. 75 ఏళ్ల వయసులో సైతం తనదైన పాలనా శైలితో వరల్డ్ వైడ్ ప్రశంసలు అందుకుంటున్న మోదీ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో 100 మిలియన్ల (10 కోట్ల) ఫాలోవర్ల మైలురాయిని దాటిన ఫస్ట్ ప్రపంచ నాయకుడిగా రికార్డ్ క్రియేట్ చేశారు.
2014లో ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన మోదీ, పదేళ్ల కాలంలో ఎక్కువ ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకుడిగా గుర్తించబడ్డారు. ఫిబ్రవరి 26 నాటికి మోదీ అందుకున్న ఈ ఘనతతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంటి బలమైన నాయకుల కంటే కూడా మోదీ ఎంతో ముందున్నారని తేలింది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ 5లో ఉన్న మిగిలిన ప్రపంచ నాయకులందరి ఫాలోవర్లను కలిపినా సరే.. మోదీ ఫాలోవర్ల సంఖ్యకన్నా తక్కువగా ఉండటం ఆయనకు ఉన్న గ్లోబల్ క్రేజ్‌ను తెలియజేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇతర నేతల ఫాలోవర్ల వివరాలను పరిశీలిస్తే.. 43.2 మిలియన్ల మందితో డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో నిలవగా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 15 మిలియన్లతో మూడో స్థానంలో ఉన్నారు. వీరితో పోలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Modi)కి ఉన్న ఫాలోవర్లు డొనాల్డ్ ట్రంప్ కంటే రెండింతలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

కేవలం సోషల్ మీడియా ఫాలోయింగ్‌లో మాత్రమే కాకుండా.. ప్రజాదరణ రేటింగ్‌లలో కూడా పీఎం మోదీ నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. మార్నింగ్ కన్సల్ట్ అలాగే స్టాటిస్టా వంటి అంతర్జాతీయ సంస్థల తాజా డేటా ప్రకారం, 67 నుంచి 70 శాతం ఆమోద రేటింగ్‌తో ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన లీడర్‌గా టాప్‌లో కొనసాగుతున్నారు. ఈ విషయంలో జపాన్ ప్రధాని, అర్జెంటీనా అధ్యక్షులు తర్వాతి స్థానాల్లో ఉండగా, ట్రంప్ 43 శాతం రేటింగ్‌తో 11వ స్థానం సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక భారత్ విషయానికి వస్తే, ప్రధాని మోదీకి దగ్గరలో కూడా ఏ ఇతర నాయకుడు లేకపోవడం విశేషం. దేశంలో ప్రధాని మోదీ తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 16.1 మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 12.6 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.



