Mowgli: అదరగొట్టిన మోగ్లీ గ్లింప్స్..నాని, చరణ్‌ల సపోర్ట్
Mowgli: గ్లింప్స్‌కు రామ్ చరణ్ విడుదల చేయగా.. హీరో నాని వాయిస్ ఓవర్ ఇచ్చి .. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచారు.

Mowgli
తొలి సినిమాతోనే యూత్‌ఫుల్ ఎనర్జీతో మెప్పించిన కుర్రాడు రోషన్ కనకాల. మనందరికీ తెలిసిన యాంకర్ సుమ తనయుడు అయినా, తన నటనతోనే అభిమానులను సంపాదించుకున్నాడు. రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నంగా, బబుల్ గమ్‌తో యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యాడు. ఒక సాధారణ అబ్బాయిగా, మన పక్క ఇంట్లో ఉండే కుర్రాడిలా కనిపించి, ఫస్ట్ మూవీతోనే సూపర్ మార్కులు కొట్టేశాడు.
ఇప్పుడు ఈ కుర్రాడు తన రెండో సినిమా ‘మోగ్లీ’(Mowgli)తో పక్కా ప్లాన్‌తో వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేశారు. దానికి నాచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ ఇవ్వగా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు.ఈసారి కేవలం లవ్ స్టోరీకి మాత్రమే పరిమితం కాకుండా, రగ్గెడ్ లుక్‌తో యాక్షన్ ప్యాక్డ్ రోల్లో కనిపిస్తున్నాడు. రోషన్ కెరీర్లో ఈ సినిమా ఒక బిగ్ బ్రేక్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.

2023లో వచ్చిన తన మొదటి సినిమా ‘బబుల్ గమ్’లో రోషన్, సాయి ఆదిత్య అలియాస్ ఆది అనే డీజే పాత్రలో కనిపించాడు. సామాన్య యువకుడిగా, తన కలలను నిజం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, సంపన్న కుటుంబానికి చెందిన జాహ్నవిని ప్రేమించి, ఆ తర్వాత వారి మధ్య వచ్చే సంఘర్షణలను చాలా సహజంగా పండించాడు. రోషన్ నటనలోని అమాయకత్వం, యువతకు నచ్చే ఎనర్జీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. తొలి ప్రయత్నంలోనే తనకంటూ ఒక మంచి స్థానం సంపాదించుకున్న రోషన్, ఇప్పుడు పూర్తి భిన్నమైన పాత్రతో మన ముందుకు వస్తున్నాడు.
అతని రెండో సినిమా మోగ్లీ(Mowgli), టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించడం ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలాన్ని ఇస్తోంది. ఈ సినిమాలో రోషన్ (Roshan Kanakala)ఓ అడవిలో పెరిగిన యువకుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇందులో సాక్షి సాగర్ హీరోయిన్గా, బండి సరోజ్ విలన్‌గా నటిస్తున్నారు.
అడవిలో పెరిగిన ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కోసం విలన్ అడవిలోకి రావడం, ఆ తర్వాత వారి మధ్య జరిగే సంఘర్షణల చుట్టూ కథ అల్లుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక చిన్న ప్రేమకథ కోసం పెద్ద యుద్ధం అనే థీమ్ ఈ సినిమా కథకు కీలకం కానుంది.తాజాగా విడుదలైన ‘మోగ్లీ’ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ గ్లింప్స్‌కు హీరో నాని(Nani) వాయిస్ ఓవర్ ఇవ్వగా, రామ్ చరణ్(Ram Charan) విడుదల చేసి.. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచారు.