Just CrimeLatest News

Murder: వర్షిణి హత్యకేసులో.. తల్లే విలన్

Murder: కాటారం - భూపాలపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో ఒక యువతి మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించడంతో ఈ కేసు మొదలైంది.

Murder

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటీవల జరిగిన ఒక భయంకరమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే . అయితే ఈ కేసు ఇప్పుడు.. ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా భారీ ట్విస్ట్ చోటుచేసుకోవడంతో అంతా షాక్ తిన్నారు. ఒక హత్య(Murder)ను బయటపడకుండా చేయడానికి ఒక తల్లే.. తన కూతురినే హత్య చేసిందని తేలడంతో అందరినీ షాక్‌ అయ్యారు.

కాటారం – భూపాలపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో ఒక యువతి మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించడంతో ఈ కేసు మొదలైంది. ఘటన స్థలంలో లభ్యమైన ఆధార్ కార్డు ఆధారంగా, మృతదేహం చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి (22) అని పోలీసులు గుర్తించారు.

వర్షిణి కనిపించడం లేదంటూ ఆగస్టు 6న ఆమె కుటుంబ సభ్యులు చిట్యాల పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే, దర్యాప్తులో పోలీసులకు కొన్ని షాకింగ్ నిజాలు తెలిశాయి. ఈ కేసు వెనుక ఒక భయంకరమైన కుట్ర ఉందని వారు అనుమానించారు.

Murder
Murder

పోలీసుల దర్యాప్తులో వర్షిణి తల్లి కవిత ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. కాల్ రికార్డులు, ఇతర ఆధారాలు సేకరించిన పోలీసులు ఆమెను లోతుగా విచారించారు. కవిత తన భర్త కుమారస్వామిని తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో.. ప్రియుడు రాజ్ కుమార్తో కలిసి చంపినట్లు అంగీకరించింది. ఆ తర్వాత భర్త అనారోగ్యంతో చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు కూడా నిర్వహించింది.

అయితే, ఆగస్టు 3న ఈ విషయం కూతురు వర్షిణికి తెలియడంతో, ఆమె తల్లిని నిలదీసింది. దీంతో కవిత, ఆమె ప్రియుడు రాజ్ కుమార్ కలిసి వర్షిణిని కూడా హత్య(Murder) చేశారు. ఈ దారుణమైన హత్య (Murder)తర్వాత, వర్షిణి మృతదేహాన్ని ఒక ఫ్రిజ్‌లో దాచిపెట్టి, ఆమె కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి, వర్షిణి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో గుర్తించారు. అయితే, మృతదేహం వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయల వంటి క్షుద్రపూజలకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యం కావడం ఈ కేసులో మరో అనుమానాన్ని రేకెత్తించింది.

ప్రస్తుతం కవిత , ఆమె ప్రియుడు రాజ్ కుమార్ జైలులో ఉన్నారు. పోలీసులు ఈ కేసులో మరికొంతమంది ప్రమేయం ఉందా, బెదిరింపులు ఉన్నాయా అని కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే తల్లే ఈ కేసులో విలన్ అని తేలడంతో స్థానికులు అవాక్కవుతున్నారు.

Trump: ట్రంప్ పగ: రష్యా, చైనాలతో పాటు భారత్‌పై ఘాటు వ్యాఖ్యలు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button