Goddess: అమ్మవారు మెచ్చే పూజలు.. మంగళవారం ఎందుకు అంత ముఖ్యం? కుజదోష నివారణ ఎలా?
Goddess: అమ్మవారికి ప్రీతికరమైన రోజులు, సమయాలు..పురాణ వచనం ప్రకారం, ప్రతి రోజు ప్రదోషకాలంలో అమ్మవారు శివుడితో కలిసి ఆనందతాండవం చేస్తారు.

Goddess
పరమశివుని అర్థాంగి అయిన అమ్మవారు(Goddess)(శక్తి) స్వయంగా అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పిన పూజా విధానాలు, వ్రతాలు , సమయాల గురించి పురాణాలు వివరిస్తున్నాయి. భక్తులు ఈ నియమాలను పాటించడం ద్వారా ఆమె కరుణకు, అనుగ్రహానికి పాత్రులవుతారు.
అమ్మవారి(Goddess)కి ప్రీతికరమైన రోజులు, సమయాలు..పురాణ వచనం ప్రకారం, ప్రతి రోజు ప్రదోషకాలంలో అమ్మవారు శివుడితో కలిసి ఆనందతాండవం చేస్తారు. ఈ సమయంలో చేసే పూజలు దేవికి అత్యంత ప్రీతికరమైనవిగా చెబుతారు. ముఖ్యంగా, వీటిలో ఆర్ద్రనతకరి, అనంత తృతీయ, రసకల్యని వంటి వ్రతాలు అత్యంత ఇష్టమైనవిగా చెబుతారు.
మంగళవారం (భౌమవారం) అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడం, అర్చన చేయడం లేదా వ్రతం ఆచరించడం ద్వారా ప్రత్యేక ఫలాలను పొందొచ్చు. ఈ రోజున పూజ చేసిన వారి ఇళ్లకు అమ్మవారు స్వయంగా విచ్చేస్తారని నమ్మకం.
మంగళవారం పూజ చేసిన భక్తులకు కలిగే ప్రయోజనాలు..శత్రు పీడలు ఉండవు.రోగనివారణ కలుగుతుంది.అప్పులు, రుణాలు తీరిపోతాయి.కుజగ్రహ దోషాలు కూడా నివారణ పొందుతాయి. అలాగే, ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయడం, కృష్ణ చతుర్దశి (అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి) రోజున అమ్మవారిని స్తుతించడం ఆమె కరుణకు పాత్రులు కావడానికి సులువైన మార్గాలు.

నవరాత్రుల విశిష్టత, రూపాలు
సంవత్సరంలో వచ్చే శరన్నవరాత్రులు (దసరా నవరాత్రులు), వసంత నవరాత్రులు (ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు) అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి. దేవీ భాగవతం ప్రకారం, “శ్రీరామో లలితాంబికా, శ్రీకృష్ణో శ్యామలంబ” అని చెప్పబడింది. అంటే, శ్రీరాముడు కూడా లలితాపరమేశ్వరి అవతారమే. కాబట్టి శ్రీరామ నవరాత్రులు కూడా అమ్మవారి పూజకు సమానమైన ఫలితాన్ని ఇస్తాయి.
అమ్మవారు కాళి, చండి, బాల, లలిత, దుర్గ వంటి అనేక రూపాలలో మనల్ని అనుగ్రహిస్తుంది. ఆమె కేవలం ఒక దేవత మాత్రమే కాదు, మాతృరూపం, శాంతిరూపం, దయారూపం, బుద్ధిరూపం, నిద్రరూపం, ఆకలిరూపం వంటి చైతన్యస్వరూపం. ఆమె ఈ సకల సృష్టిలోనూ వ్యాపించి ఉంది.
సాధారణంగా భక్తులు ఇల్లు, పిల్లలు, పెళ్లి, ధనం వంటి తాత్కాలిక సుఖాలను కోరుకుంటారు. అయితే, భక్తి యొక్క నిజమైన సారాంశం వేరు. శంకరాచార్యులు చెప్పినట్లుగా.. నన్ను కరుణించు, నాతో ఉండు. మోక్షం వద్దు, విద్య వద్దు, సంపదలు వద్దు. నీ నామస్మరణే చాలు. ఎల్లప్పుడూ నీ పాదాల చెంత భక్తితో ఉండగలనని అనుగ్రహించు అని అమ్మవారిని కోరుకోవడం ఉత్తమమైన భక్తి మార్గం. పరమభక్తి ద్వారా నిరంతరం దేవి పాదాల చెంత స్థానం పొందాలని కోరుకోవడమే ఆమెను సంతోషపెట్టే నిజమైన ఆరాధన.