Just TechnologyLatest News

Zoho Mail: జీ మెయిల్ నుంచి జోహో మెయిల్‌కు మారాలనుకుంటున్నారా? అయితే ఇవి ఫాలో అవ్వండి

Zoho Mail: వినియోగదారుల ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రకటనలు లేని సేవ (Ad-free): ఇందులో ఎలాంటి ప్రకటనలు (Advertisements) ఉండవు.

Zoho Mail

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన “దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించండి” (Vocal for Local) అనే పిలుపునకు అనుగుణంగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా , పలువురు మంత్రులు వారి ఇమెయిల్ సేవలను Google అందించే జీమెయిల్ నుంచి స్వదేశీ సంస్థ అయిన జోహో మెయిల్ (Zoho Mail) కు మార్చుకున్నారు. దీంతో ఈ భారతీయ సంస్థ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

జోహో మెయిల్(Zoho Mail) ప్లాట్‌ఫాం వినియోగదారులను ఆకర్షిస్తున్న ముఖ్య అంశాలు ..

వినియోగదారుల ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రకటనలు లేని సేవ (Ad-free): ఇందులో ఎలాంటి ప్రకటనలు (Advertisements) ఉండవు. వ్యాపారాలు , నిపుణులు ఉపయోగించడానికి అనువైన కస్టమ్ డొమైన్ ఇమెయిల్స్, సులభమైన ఇంటర్‌ఫేస్ వంటి ప్రొఫెషనల్ స్థాయి టూల్స్‌ను తక్కువ ఖర్చుకే అందిస్తుంది.వినియోగదారులు తమ వ్యక్తిగత లేదా వ్యాపార డొమైన్ పేరుతో ప్రత్యేకమైన ఇమెయిల్ అడ్రస్‌ను సృష్టించుకోవచ్చు.ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇన్బాక్స్ అనుభవాన్ని అందిస్తుంది.

జీమెయిల్ నుంచి జోహో మెయిల్‌కు మారే విధానం (మైగ్రేషన్ ప్రాసెస్)..
మీ పాత మెయిల్స్, కాంటాక్ట్‌లను కోల్పోకుండా జీమెయిల్ నుంచి జోహో మెయిల్‌కు మారడం చాలా సులభం.ముందుగా, Google Play Store లేదా App Store నుంచి Zoho Mail యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. లేదా జోహో మెయిల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కొత్త ఖాతాను సృష్టించాలి. మీ అవసరాన్ని బట్టి పర్సనల్ ఇమెయిల్ (వ్యక్తిగత) లేదా బిజినెస్ ఇమెయిల్ (వ్యాపార) ఎంపికపై క్లిక్ చేయాలి.

Zoho Mail
Zoho Mail
  • జీమెయిల్‌లో IMAP ఎనేబుల్ చేయడం..
  • మీ జీమెయిల్ ఖాతాలోకి వెళ్లాలి.
  • Settings > See all settings > Forwarding and POP/IMAP ను క్లిక్ చేయాలి.
  • అక్కడ IMAP ఫీచర్‌ను ఎనేబుల్ (Enable) చేయాలి. దీని ద్వారా జోహో మెయిల్ మీ జీమెయిల్ డేటాను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.
  • డేటా ఇంపోర్ట్ (Import) కోసం జోహో మెయిల్ ఖాతాలోకి లాగిన్ అయ్యి, Settings > Import/Export ఎంపికను ఓపెన్ చేయాలి.అక్కడ ఉన్న Migration Wizard (మైగ్రేషన్ విజార్డ్) సహాయంతో మీ పాత ఇమెయిల్స్, ఫోల్డర్‌లు ,కాంటాక్ట్స్‌ను జోహో మెయిల్‌లోకి ఇంపోర్ట్ చేయాలి.

ఫార్వార్డింగ్ సెట్ చేయడం (కొత్త మెయిల్స్ కోసం)..

భవిష్యత్తులో మీ జీమెయిల్ అడ్రస్‌కు వచ్చే కొత్త మెయిల్స్ కూడా జోహో ఖాతాకి రావాలంటే, తిరిగి జీమెయిల్ Settings లోని Email forwarding ఎంపికలోకి వెళ్లాలి. అక్కడ మీ కొత్త Zoho Mail చిరునామాను నమోదు చేయాలి.ఇలా ఈజీగా , సురక్షితంగా దేశీయ ప్లాట్‌ఫాం అయిన జోహో మెయిల్‌కు మారిపోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button