Bigg Boss: బిగ్ బాస్ హౌజ్‌లో వైల్డ్ కార్డ్ రచ్చ.. కళ్యాణ్‌ను ‘అమ్మాయి పిచ్చోడు’ అన్న రమ్య
Bigg Boss: బిగ్ బాస్ హౌజ్‌లో కొత్త కంటెస్టెంట్ల రాకతో హౌస్‌లో వ్యక్తిగత దూషణలు, గొడవలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Bigg Boss
బిగ్ బాస్(Bigg Boss) తెలుగు సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో మరింత రసవత్తరంగా మారింది. ఈ ఆదివారం అడుగుపెట్టిన ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు – అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దివ్వెల మాధురి, సీరియల్ నటులు నిఖిల్ నాయర్, ఆయేషా జీనథ్, గౌరవ్ గుప్తా – హౌస్(Bigg Boss)లో రచ్చ మొదలుపెట్టారు.
వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌మేట్స్‌కి తొలిరోజే నామినేషన్లలో గట్టి షాక్ ఇచ్చాయి. నిన్నటి ఎపిసోడ్లో దివ్వెల మాధురి, కళ్యాణ్‌ల మధ్య అనవసరమైన అంశంపై పెద్ద గొడవ జరిగింది. మాధురి వెటకారంగా మాట్లాడి కళ్యాణ్‌ను రెచ్చగొట్టడం, దానికి కళ్యాణ్ మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుందని గట్టిగా రియాక్ట్ అవ్వడం, చివరకు గొడవ పెద్దదిగా మారడం తెలిసిందే. హౌస్మేట్స్ ఆపడానికి ప్రయత్నించినా గొడవ ఆగలేదు.
గొడవ తర్వాత దివ్వెల మాధురి, రమ్య మోక్ష కలిసి కళ్యాణ్ ప్రవర్తనపై చర్చ (Discussion) పెట్టారు. ఈ సందర్భంగా రమ్య మోక్ష, కళ్యాణ్ గురించి సంచలన కామెంట్లు చేసింది. రమ్య మోక్ష మాట్లాడుతూ, కళ్యాణ్‌ను పరోక్షంగా ‘అమ్మాయి పిచ్చోడు’ అంటూ రెచ్చిపోయింది. నామినేషన్ రోజున శ్రీజ, కళ్యాణ్ బెలూన్ను కట్ చేసినప్పటి నుంచి అతడి ప్రవర్తన మారిందని రమ్య తెలిపింది. “అసలు మాట్లాడట్లేదు, ముఖం తిప్పుకుంటున్నాడు, ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు,” అని రమ్య, మాధురి దగ్గర చెప్పుకొచ్చింది.

దీనికి మాధురి “మనం గేమ్ ఆడటానికి వచ్చాము, ఎవరితోనూ మాట్లాడటానికి కాదు” అని జవాబిచ్చింది.
అయితే తనూజ , కళ్యాణ్ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి మాట్లాడిన రమ్య మోక్ష, కళ్యాణ్ తీరు పట్ల చాలా ఇరిటేటింగ్‌గా ఉన్నట్లు తెలిపింది.
“మొదటి రోజు వచ్చి కూర్చుంటుంటే (కళ్యాణ్) చేతులు ఇలా వేసినప్పుడు, తనూజ ఎంత ఇరిటేటింగ్‌గా ఉందో తెలుసా? చూస్తే నాకే ఏదోలా ఉంది. అదే నన్ను చేస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చేస్తా అంతే.. కిందేసి తొక్కేస్తాను.. అంతే అలాగే ఉండాలి.”
ఆ అమ్మాయి (తనూజ) అతడికి ఎందుకు అంత లీనియెన్స్ ఇస్తుందో అర్థం కావట్లేదని, అతడి ప్రవర్తనను ఒక్క మాటతో ఆపెయ్యొచ్చని రమ్య అభిప్రాయపడింది. “ఒకరు మనతో అలా చేశారంటే మనం కూడా ఏదో ఇచ్చే ఉంటాం కదా.. అందుకే కదా ఆ బిహేవియర్ వస్తుంది. రెండు చేతులూ కలిస్తేనే కదా చప్పట్లు” అంటూ రమ్య మోక్ష గట్టి డైలాగులు వేసింది. కొత్త కంటెస్టెంట్ల రాకతో హౌస్‌లో వ్యక్తిగత దూషణలు, గొడవలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
3 Comments