Just InternationalLatest News

US: భారత ఎగుమతులపై అమెరికా సుంకాల పిడుగు.. 4 నెలల్లో 37.5% భారీ పతనం

US: అమెరికాకు మన ఎగుమతులు కేవలం నాలుగు నెలల వ్యవధిలో (మే 2025 నుంచి సెప్టెంబర్ 2025 మధ్య) 37.5 శాతం మేర కుప్పకూలాయి.

US

భారతదేశ ఎగుమతులు అమెరికా(US) మార్కెట్‌లో పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వాషింగ్టన్ ప్రభుత్వం భారతీయ వస్తువులపై ఏకంగా 50 శాతం మేర భారీ సుంకాలను విధించడంతో, అమెరికాకు మన ఎగుమతులు కేవలం నాలుగు నెలల వ్యవధిలో (మే 2025 నుంచి సెప్టెంబర్ 2025 మధ్య) 37.5 శాతం మేర కుప్పకూలాయి. ఈ తీవ్ర ఆందోళనకరమైన పరిస్థితిని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (GTRI) తన తాజా నివేదికలో వెల్లడించింది.

GTRI నివేదిక ప్రకారం, ఈ నాలుగు నెలల కాలంలో భారత ఎగుమతుల్లో చారిత్రక క్షీణత నమోదైంది. మే 2025లో $8.8 బిలియన్ డాలర్లుగా ఉన్న నెలవారీ ఎగుమతులు, సెప్టెంబర్ నాటికి $5.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఈ నాలుగు నెలల కాలంలో, నెలవారీ ఎగుమతుల విలువలో భారత్ ఏకంగా $3.3 బిలియన్ డాలర్లను కోల్పోయింది.వరుసగా నాలుగు నెలల పాటు ఎగుమతులు క్షీణించడం ఇదే తొలిసారి అని నివేదిక స్పష్టం చేసింది.

అత్యంత తీవ్ర ప్రభావం సెప్టెంబర్‌లో కనిపించింది. అమెరికా(US) విధించిన 50 శాతం సుంకాలు పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత, సెప్టెంబర్ నెలలో అత్యంత తీవ్రమైన ప్రభావం కనిపించింది.ఆగస్టులో $6.87 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు, సెప్టెంబర్‌లో ఏకంగా 20.3 శాతం తగ్గి $5.5 బిలియన్ డాలర్లకు చేరాయి. 2025లో ఒకే నెలలో ఇంతటి భారీ పతనం నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ పతనానికి వాషింగ్టన్ విధించిన సుంకాలే ప్రత్యక్ష కారణమని GTRI నివేదిక స్పష్టం చేసింది.

US
US

కాగా ఈ సుంకాల ప్రభావం ముఖ్యంగా భారతీయ ఎగుమతి వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే కీలక రంగాలపై పడింది, వీటిలో టెక్స్‌టైల్, రెడీమేడ్ దుస్తులు,జెమ్స్ అండ్ జువెలరీ (రత్నాలు, ఆభరణాలు),ఇంజినీరింగ్ వస్తువులు, రసాయనాలు (Chemicals)

ఈ కీలక రంగాల నుంచి ఎగుమతులు భారీగా పడిపోవడంతో మొత్తం ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది.

అమెరికా(US) వంటి అతిపెద్ద మార్కెట్‌లో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, భారతీయ తయారీ, ఎగుమతి రంగాల పోటీతత్వం (Competitiveness) దెబ్బతినే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

GTRI నివేదిక ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి భారత ప్రభుత్వానికి తక్షణమే విధానపరమైన సమీక్ష (Policy Review) చేపట్టాలని సూచించింది. దేశ వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకోవడానికి, అమెరికాతో దౌత్యపరంగా చర్చలు జరపడం, ఇతర అంతర్జాతీయ మార్కెట్‌లపై దృష్టి సారించడం అత్యవసరం.

Gold: పసిడి పరుగుకు బ్రేక్ లేదా ?

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button